👉 ప్రతి అవసరానికో అబద్ధం ఇదే BJP సిద్ధాంతమా ??

✊అడిగితే ఇవ్వము - అడక్కపోయిన హామీలు ఇస్తాం..ఎన్నికలు అంటే అంతే

✊ దక్షిణభారత రాష్ట్రాలపట్ల బీజేపీ ఊసరవెల్లి వైఖరి.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం మరి పుదుచ్చేరికి మొదలయ్యే అధ్యాయమా ?

7సంవత్సరాలుగా అడుగుతున్నా,పోరాడుతున్నా, ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదు అంటున్న బీజేపీ అడక్కుండానే పూడిచ్చేరి కి ప్రత్యేకహోదా ఇస్తాం అనడం

తెలంగాణాలో ఎన్నికల సమయంలో పసుపుబోర్డ్ ఏర్పాటు చేస్తాం అని బాండ్ పేపర్ రాసిఇచ్చి గెలిచాక పసుపు బోర్డ్ అవసరం లేదు అని మొసంచేయడం అడగకున్నా తమిళనాడు ఎన్నికల్లో  పసుపుబోర్డు ఏర్పాటు చేస్తాం అని హామీ ఇవ్వడం.

ఉత్తరాదిన ఎన్నో పరిశ్రమలు నష్టాలలో వున్నా ప్రభుత్వం సహకారంతో తోడ్పాటు ఇవ్వడం,దక్షిణాది రాష్ట్రాలలో లాభాలలో వున్నా సరే పరిశ్రమలను  ప్రైవేటీకరణ చేయడం.


ఎన్నికలు వస్తే వెనకా ముందు చూడకుండా ఏహామీ అయినఇచ్చేయడం ఎన్నికలో అయిపోయాక మోసం చేయడం బీజేపీ నైజం  బీజేపీఅంటే బదనాం జనతా పార్టీ అంటున్న దక్షిణాది రాష్ట్రాల ప్రజలు

              బీజేపీ అనగా భారతీయ జనతా పార్టీ అది ఒకప్పుడు మొదటి తరం అతిరథ మహారధుల హయాంలో బీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యాన్మయం కాలక్రమేణా అధికారంలోకి రావడం ఎంతో గొప్ప పరిపాలన అందించడం మంచి పేరు తెచ్చుకోవడం అది ఒకప్పటి బీజేపీ నాయకత్వ వ్యవహార శైలి.మరి ఈ తరం బీజేపీ అంటే బదనాంజనతాపార్టీ(BJP) అని అనాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి అంటే ఇప్పుడున్న నాయకత్వ వ్యవహార శైలి అలాంటిది అంటే ఎక్కడైతే బీజేపీ బలంగా లేదో ఏ రాష్ట్రంలో అయితే ఎప్పటికి బీజేపీ అధికారంలోకి రాదని తెలుస్తుందో ఆ రాష్ట్రాలని, ఆ రాష్ట్ర ప్రాంతీయ పార్టీలను, ఆ ప్రాంత ప్రజలను బదనాం చేయడమే వారి లక్ష్యం.

              మరీ ముఖ్యంగా బీజేపీ కి ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఉంది అంటే దక్షిణాది రాష్ట్రాల్లో అని చాలాసులభంగా చెప్పేయొచ్చు దేశమంతటా మోదీ హవా నడుస్తున్న 2014-15 ఎన్నికల్లో ఏకపక్షంగా బీజేపీ కి మెజారిటీ ఎంపీ స్థానాలు వచ్చినప్పటి కాలం నుండి మొన్నటి 2019 సాధారణ ఎన్నికల్లో సైతం మోదీ హవా స్పష్టంగా ఉంది రెండోదపా కూడా అధికారంలోకి వచ్చిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం ఒకటి,అరకొర స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు తో పొత్తు పెట్టుకొని మాత్రం సాదించగలిగింది.ఈ ఉదాహరణలు చాలు బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా లేదని చెప్పడానికి. ఈ కారణాలు చాలు బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు చూపించడానికి.

ఎన్నికలుంటే హడావిడి-అమితమైన ప్రేమాభిమానాలు ఎన్నికలు అయిపోయాక వితండవాదం-నమ్మకద్రోహం

                 ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎక్కడెక్కడి నాయకులంతా క్యూ కట్టి ప్రచారంతో హడావిడి చేయడం అవసరం అయిన అవసరం లేని సంబంధం లేని హామీలు ఇవ్వడం. అది ఏ ఎన్నిక అయిన మునిసిపాలిటీ, కార్పొరేషన్, అసెంబ్లీ, పార్లమెంటు ఏ ఎన్నిక అయిన హామీలు ఇచ్చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. మనం గెలుస్తామా లేదా సాధ్యమైయ్యే హామీయా కదా అనికూడా చూడకుండా హామీలు ఇవ్వడం వారికే చెల్లుతుంది.

✊ వీటిలో ఉదాహరణకి కొన్ని......

                 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేకపోయినా బీజేపీ వారికి సహకరించి రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించారు. పార్లమెంటు లో రాష్ట్ర విభజన రోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆంధ్ర ఎంపీలు గొడవచేస్తుంటే అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ కి 5 సంవత్సరాలు ప్రత్యేకహోదా కల్పిస్తాం అని హామీ ఇవ్వడం అనూహ్యంగా  ఇప్పటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు లేచి ప్రత్యేకహోదా 5 కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని పట్టుబట్టి అందరి దృష్టి ఆకర్షించారు. ఆ సమయంలో వెంకయ్య నాయుడు గారిని తలగుకోని, పొగడని ఆంధ్రుడు ఉండడు.

                కాలచట్రం గిర్రున తిరిగింది వెనువెంటనే వచ్చిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ మ్యానిఫెస్టోలో ఆంధ్ర కు ప్రత్యేకహోదా ఇష్టం అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు.కేంద్రంలో బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఇక్కడకూడా అధికారాన్ని పంచుకున్నారు.ప్రత్యేకహోదా ప్రస్తావన చేయలేదు,అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిల్లీ తిరిగితిరి అలసిపోయి హోదా ఇవ్వడానికి కుంటిసాకులు చెబుతూ 14వ ఆర్థిక సంఘం మీద నెట్టేసి ఇంకేదో కారణాలు చెప్పుకుంటూ పబ్బం గడిపేసింది.

              అప్పటి టీడీపీ ప్రభుత్వం నుండి ఇప్పటి వైస్సార్సీపీ ప్రభుత్వం వరకు ఎన్నో పోరాటాలు చేశారు,దీక్షలు చేశారు,ఉద్యమాలుచేశారు,ఎంపీలు రాజీనామాలు చేశారు ఎన్ని చేసినా బీజేపీ వైఖరి ఒక్కటే ప్రత్యేకహోదా ఏ రాష్ట్రానికి ఇవ్వబోము, ఇవ్వడం కుదరదు అని.

 

                 మరి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో పక్కనే ఉన్న యూటీ పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు  మ్యానిఫెస్టో విడుదల చేస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే యూటీ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తాం, ఇప్పుడున్న రాష్ట్ర-కేంద్ర వాటా 70:30 ని పెంచుతూ రాష్ట్రం 30శాతం పెట్టుకుంటే చాలు కేంద్రం 70 శాతం భరిస్తుందని హామీలు ఇవ్వడం. 2.50లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. విచిత్రమైన వింత ఏంటంటే పుదుచ్చేరి మొత్తం జనాభా సుమారుగా 2.25 లక్షలు అయితే వీరు 2.50 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తారంట ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా చూస్తామా?.

               ఇంకో ఉదాహరణ మొన్నటికి మొన్న 2018 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేళ బీజేపీ ఒక కొత్త ఎత్తు వేసింది అది ఏంటంటే ఎన్నో ఏళ్లుగా పసుపుబోర్డుఏర్పాటు చేయాలని ఉద్యమంచేస్తున్న నిజామాబాద్ రైతులకు బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ గారు బీజేపీ ని తనను గెలిపిస్తే నిజామాబాద్ కు పసుపుబోర్డు తీసుకొస్తానని ఒకబాండ్ రాసి సంతకం చేసి ఇచ్చి రైతులను నమ్మించి ఓట్లు వేయించుకుని ఎంపీ గా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. గెలిచాక ఎంపీ అరవింద్ గారు కొంతకాలం కాలయాపన చేశారు చివరికి రైతులు నిలదీయడంతో అసలు నిజామాబాద్ కి పసుపుబోర్డు అవసరం ఏముంది అని నిర్దాక్షిణ్యంగా నిలువునా మోసం చేశారు.

             ఇప్పుడేమో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎవరు అడగకున్నా, బీజేపీ అక్కడ గెలిచే పరిస్థితి లేకున్నా బీజేపీ అధికారంలోకి వస్తే తమిళనాడులో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తాం అని తమిళనాడు పసుపు రైతులను మోసం చేయడానికి కంకణం కట్టుకుంది. తమిళనాడు రైతులు బీజేపీ మాయమాటలు మోసపోరు అనుకోండి అది వేరే విషయం.

               మరోపక్క రైతు వెతిరేఖ చట్టాలతో పంజాబ్ లాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్ర రైతులు వందల రోజులనుండి రోడ్ ఎక్కి ఉద్యమాలు చేస్తుంటే పట్టించుకున్న పాపానికి పోలేదు.ఎందరో రైతులు ప్రాణత్యాగాలు చేస్తున్నారు చివరికి సుప్రీంకోర్టు లో బీజేపీపై న్యాయపోరాటం చేస్తున్నారు.

           భారతదేశం మొత్తంమీద బీజేపీ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు నష్టాల్లో ఉన్నమాట వాస్తవం. కానీ బీజేపీ మాత్రం వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పరిశ్రమలు నష్టాలలో ఉంటే వాటికి కేంద్రం సహాయం చేసి లాభాల బాటపట్టడానికి సహకరిస్తుంది.అదే బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో పరిశ్రమలు లాభాలు వస్తున్నా సరే ఏదో ఒక కుంటిసాకులు చూపించి పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసేస్తున్నాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ.

              2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని వాడుకుని వారికున్న ఓట్లను మాయమాటలు చెప్పి వేయించుకుని ఎన్నికలుఅయిపోగానే వాళ్ళని మోసం చేయడం ఒకటైతే. ఇప్పుడు తిరుపతి లో ఎంపీ స్థానానికి ఎన్నికలు రాగానే మళ్ళీ జనసేన జపం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జపం చేయడమే కాకుండా బీజేపీ జాతీయ పార్టీ ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న ప్రాంతీయపార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడమే బీజేపీ ప్రధానలక్ష్యం అని చెప్పుకుంటున్నారంటే వారి రాజకీయ దిగజారుతనానికి, వారి చేతకానితనానికి నిదర్శనం. బీజేపీ అవసరం వస్తే కాళ్ళు పట్టుకుంటుంది అవసరం తీరిపోతే జుట్టు పట్టుకుంటుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం.

                ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా అయినా పోలవరం నిర్మాణ వ్యయం వ్యవహారంలో అయినా, తెలంగాణ కు పసుపుబోర్డు అయినా, నీటిప్రాజెక్టులకు జాతీయహోదా అయినా తమిళనాడు రైతులైన ఒడిశా ప్రజలైన, కర్ణాటక అయిన కేరళ అయినా బీజేపీ పార్టీకి అధికారం ఇస్తేనే ఇవ్వలేదో ఆయా రాష్ట్రాలను సర్వనాశనం చేయడమే బీజేపీ అజండా.

             భవిష్యత్తులో అయినా ఇలాంటి కక్షపూరిత రాజాకీయలకు బీజేపీ స్వస్తి చెప్పకపోతే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ భూస్థాపితం అవ్వడం ఖాయం.

విశ్లేషకులు: ఆర్.కె.శాతరాసి

:+91 9629301038

Post a Comment

0 Comments

Close Menu