👉 జాతీయ చిహ్నాలు అంటే ఏమిటి ?

 

భారతదేశ జాతీయ చిహ్నాలు

👉 భారతదేశ జాతీయ చిహ్నాలు: 

👉రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు అనేక జాతీయ చిహ్నాలు ఉన్నాయి. భారతదేశం యొక్క జాతీయ చిహ్నాలు భారతదేశం యొక్క జాతీయ గుర్తింపు,సంస్కృతి మరియు స్వభావాన్ని సూచిస్తాయి. ప్రతి భారతీయుడి హృదయంలో గౌరవం మరియు దేశభక్తిని ప్రేరేపిస్తాయి.

👉 జాతీయ చిహ్నాలు అంటే ఏమిటి ?

👉జాతీయ చిహ్నాలు జాతీయ ప్రజలు, విలువలు, లక్ష్యాలు లేదా చరిత్ర యొక్క దృశ్య, శబ్ద, లేదా ఐకానిక్ ప్రాతినిధ్యాలను సృష్టించడం(గుర్తించడం) ద్వారా ప్రజలను ఏకం చేయాలని అనుకుంటాయి. ఈ చిహ్నాలు తరచుగా దేశభక్తి లేదా ఔత్సాహిక జాతీయవాదం (స్వాతంత్ర్యం, స్వయంప్రతిపత్తి లేదా వేరుచేయడం వంటివి) లో భాగంగా ర్యాలీ చేయబడతాయి. ఉద్యమాలు) మరియు జాతీయ సమాజంలోని ప్రజలందరినీ కలుపుకొని ప్రతినిధిగా రూపొందించబడతాయి.






Q. భారతదేశ జాతీయ జెండా ఏమిటి ?


ANSWER : త్రివర్ణ పతాకం (Tiranga)  

 

Q. భారత జాతీయ పతాకం ఎ ఆకారం లో ఉంటుంది ?


ANSWER : దీర్ఘ చతురస్రాకారంలో  

 

Q. భారత జాతీయ పతాకం లో అశోక చక్రం ఎ రంగులో ఉంటుంది ?


ANSWER : నేవీ బ్లూ రంగు  

 

Q. భారత జాతీయ పతాకం తయారీలో ఎ వస్త్రాన్ని మాత్రమే వాడాలి ?


ANSWER : ఖాదీ లేక చేనేత వస్త్రాన్ని  

 

Q. భారత జాతీయ పతాకం తయారీలో ఎన్ని పోగులు ఉండాలని నిర్దేశకాలున్నాయి ?


ANSWER : చదరపు సెంటీమీటరుకు కచ్చితంగా 150 పోగులు ఉండాలని, కుట్టుకు నాలుగు పోగులు ఉండాలని, ఒక చదరపు అడుగు గుడ్డ కచ్చితంగా 205 గ్రాములుండాలని నిర్దేశకాలున్నాయి.  

 

Q. జాతీయపతాకాలను ఉత్పత్తిచేయడానికి అనుమతి ఇచ్చే అధికారం ఎవరికీ ఉంది ?


ANSWER : ఖాదీ డెవలప్‌మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC)  

 

Q. జాతీయపతాకాలను ఉత్పత్తి అనుమతి రద్దు చేసే అధికారం ఎవరికీ ఉంది ?


ANSWER : అనుమతిని రద్దు చేసే అధికారం బి.ఐ.ఎస్.కు ఉంది.  

 

Q. అశోకచక్రం (ధర్మచక్రం) ఇందులో ఎన్ని ఆకులు (స్పోక్స్) గలవు. ?


ANSWER : 24 ఆకులు (స్పోక్స్).  

 

Q.భారత దేశ జాతీయ గీతం ఏమిటి ?


ANSWER : జన గణ మన  

 

Q.భారత దేశ జాతీయ పాట ఏమిటి ?


ANSWER : వందేమాతరం  

 

Q.జనగణమన భారత జాతీయగీతం ఇది ఎవరు రచించారు ?


ANSWER : రవీంద్రనాథ్ టాగోర్  

 

Q.జనగణమన భారత జాతీయగీతం మొదటి సారిగా ఎప్పుడు పాడారు ?


ANSWER : 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో  

 

Q.జనగణమన భారత జాతీయగీతం 1912 జనవరి లో ఈ గీతాన్ని ప్రచురించింది ఎక్కడ ?


ANSWER : "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది  

 

Q."మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా" అనే పేరుతో తర్జుమా చేసిన గీతం ఏది ?


ANSWER : జనగణ మన (ఆంగ్లములో)  

 

Q.మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది ఎక్కడ ?


ANSWER : మదనపల్లెలో 1919 ఫిబ్రవరి 28న  

 

Q.వందేమాతరం ఎ భాషా గీతం ?


ANSWER : సంస్కృతం  

 

Q.వందేమాతరం గీతం ఎవరు రచించారు ?


ANSWER : బంకించంద్ర ఛటర్జీ Bankim Chandra Chatterjee  

 

Q.వందేమాతరం గీతం ఎ నవల నుండి తీసుకొన్నారు ?


ANSWER : ఆనంద్ మఠ్ అనే నవలనుండి  

 

Q. భారత జాతీయ ప్రతిజ్ఞను ఎవరు రచించారు.


ANSWER : పైడిమర్రి వెంకటసుబ్బారావు  

 

Q. భారత జాతీయ ప్రతిజ్ఞనలో ప్రధానమైన మార్పు "అర్హుడనగుటకై" స్థానంలో ఏమి చేర్చారు.


ANSWER : "అర్హత పొందడానికి"  

 

Q. భారత జాతీయ ప్రతిజ్ఞ ఎప్పుడు రచించారు ?


ANSWER : 1962లో  

 

Q. భారత జాతీయ ప్రతిజ్ఞ 1962లో రచించారు దీనికి కారణం ?


ANSWER : భారత్-చైనా యుద్ధం తరువాత విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం  

 

Q. భారత జాతీయ చిహ్నం ను ఎక్కడ నుండి స్వీకరించారు ?


ANSWER : దీనిని, సారనాధ్ లోని, అశోకుని స్తూపం నుండి  

 

Q. భారత జాతీయ చిహ్నం ఎవరు తయారు చేసారు ?


ANSWER : దిననాథ్ భార్గవ  

 

Q. భారత జాతీయ చిహ్నం లో సింహాలను వాస్తవికంగా చిత్రీకరించాలని ఎ జంతుప్రదర్శనశాలలో సింహాల ప్రవర్తనను అధ్యయనం చేసారు ?


ANSWER : కోల్‌కతా జంతుప్రదర్శనశాల  

 

Q. భారత జాతీయ చిహ్నం తాయారు చేసిన వ్యక్తి వయసు అప్పుడు ఎంత ?


ANSWER : 21 (నందలాల్ బోస్ శిష్యుడు దిననాద్ భార్గవ )  

 

Q. భారత జాతీయ చిహ్నం ఎక్కడ నుండి గ్రహించారు ?


ANSWER : సారనాద్ లోని అశోకుని స్థంబం నుండి  

 

Q. భారత జాతీయ జంతువు ఏది ?


ANSWER : పెద్ద పులి  

 

Q. భారత జాతీయ జంతువు శాస్త్రీయ నామం ఏమి ?


ANSWER : పాంథెరా టైగ్రిస్  

 

Q. భారతీయ రూపాయి చిహ్నం దేవనాగరి హల్లు "र" (RA) మరియు ఎ భాషా అక్షరం "R" లు కలిపి ఏర్పడింది ??


ANSWER : లాటిన్ అక్షరం R  

 

Q. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక కరెన్సీ యొక్క ISO కోడ్ ఏమిటి ?


ANSWER : INR  

 

Q. భారత జాతీయ క్యాలెండర్ ఏమిటి ?


ANSWER : శాలివాహన షాక క్యాలెండర్  

 

Q. భారతీయ పంచాంగం (కాలండరు) ఏరాజు పేరు మీద ఈనాటికీ చలామణీ అవుతోంది ?


ANSWER : తెలుగు చక్రవర్తి శాలివాహనుని పేరు మీదే  

 

Q. భారత దేశంలో జాతీయ వారసత్వ జంతువు ఏది ?


ANSWER : ఏనుగు  

 

Q. ఎప్పటి నుండి భారత ఏనుగు భారతదేశ జాతీయ వారసత్వ జంతువు ?


ANSWER : 22 అక్టోబర్ 2010  

 

Q. భారత దేశపు జాతీయ జల జంతువు ?


ANSWER : దక్షిణ ఆసియా నది డాల్ఫిన్  

 

Q. భారత దేశపు జాతీయ సరీసృపం(reptile) ?


ANSWER : కింగ్ కోబ్రా  

 

Q. భారత దేశపు జాతీయ పక్షి ?


ANSWER : భారతీయ నెమలి (ఇండియన్ పీఫౌల్ (పావో క్రిస్టాటస్ ))  

 

Q. భారత దేశపు జాతీయ చెట్టు ఏమిటి ?


ANSWER : భారతీయ మర్రి ( ఫికస్ బెంగాలెన్సిస్ )  

 

Q. భారత దేశపు జాతీయ పండు ఏమిటి ?


ANSWER : మామిడి ( మాంగిఫెరా ఇండికా )  

 

Q. భారత దేశపు జాతీయ నది ?


ANSWER : గంగా నది  

 

Q. భారత దేశపు జాతీయ పువ్వు ఏది ?


ANSWER : భారతీయ లోటస్ ,పవిత్ర కమలం లేదా కేవలం లోటస్  

 

Q. భారత దేశపు జాతీయ కూరగాయ ఏది ?


ANSWER : గుమ్మడికాయ  

 

Q. భారత దేశపు జాతీయ క్రీడ ఏది ?


ANSWER : హాకి  

Post a Comment

0 Comments

Close Menu