👉కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర

 👉కేంద్ర ఎన్నికల సంఘం 

👉ఏమిటి: కొత్త కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకం  

👉ఎప్పుడు: ఏప్రిల్ ౧౨ ౨౦౨౧

👉ఎవరు : కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ ౧౨ ౨౦౨౧ ఒక ప్రకటన విడుదల చేసింది

👉ఎక్కడ : భారత్ లో   

👉ఎవరికి : కేంద్ర ఎన్నికల సంఘానికి

👉ఎందుకు: సునీల్‌ ఆరోరా పదవీకాలం ఏప్రిల్ ౧౨ ౨౦౨౧ తో ముగిసిన నేపథ్యంలో



👉కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి)గా సుశీల్‌చంద్ర నియమితులయ్యారు.

👉ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

👉ప్రస్తుత సిఇసి సునీల్‌ ఆరోరా పదవీకాలం ఏప్రిల్ ౧౨ ౨౦౨౧ తో ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

👉కొత్త సిఇసిగా సుశీల్‌ చంద్ర రేపు బాధ్యతలు స్వీకరిస్తారని న్యాయశాఖ తెలిపింది.

👉సుశీల్‌ చంద్ర ఈ పదవిలో వచ్చే ఏడాది మే 14 వరకు కొనసాగే అవకాశం ఉంది.

👉సుశీల చంద్ర హయాంలోనే గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా అసెంబ్లీల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది.

👉2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 14న సుశీల్‌ చంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.

👉కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది.

ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు సుశీల్‌ చంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఛైర్మన్‌గా ఉన్నారు.

Post a Comment

0 Comments

Close Menu