👉 సూపర్ స్టార్ రజిని కాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే ౨౦౧౯ అవార్డు

👉ఏమిటి: దాదాసాహెబ్ ఫాల్కే ౨౦౧౯ అవార్డు

👉ఎప్పుడు: ఏప్రిల్ 1 ౨౦౨౧  

👉ఎవరు : కేంద్రం ప్రకటన

👉ఎక్కడ : భారత్ లో

👉ఎవరికీ : సూపర్ స్టార్ రజిని కాంత్ కి..

👉 ఎందుకు: భారతీయ సినీ పరిశ్రమకు ఓ వ్యక్తి చేసిన సేవలకు గుర్తింపుగా...


👉భారతీయ సినీ రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పేరుమీద ఓ అవార్డుని ప్రకటిస్తోంది. తొలిసారిగా ఈ అవార్డును 1969లో ప్రకటించారు.

👉ఈ అవార్డును కూడా భారతీయ సినీ పరిశ్రమకు ఓ వ్యక్తి చేసిన సేవలకు గుర్తింపుగా అందిస్తారు.

👉దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న భారత దేశంలో 1870 ఏప్రిల్ 30న టింబక్ అనే ఊరిలో ఫాల్కే జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది.

👉ఫాల్కేను భారతీయ సినిమాకు పితామహుడిగా భావిస్తారు. తొలి భారతీయ సినిమాను రూపొందించిన ఘనత ఫాల్కేదే.

👉బియన్ రెడ్డి లతో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె. విశ్వనాథ్ ఉన్నారు.

👉దర్శకులు సత్యజిత్ రే, అదూర్ గోపాల కృష్ణన్, మృణాళ్ సేన్, శ్యాం బెనగల్, తపన్ సిన్హా, శాంతారాం, హృషికేష్ ముఖర్జీలు ఈ పురస్కారం అందుకొన్నారు.

👉కేవలం దర్శకులే కాకుండా శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. నేపథ్యగాయకులైన మన్నాడే, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే కూడా ఈ అవార్డు గ్రహీతలే.

👉 గతంలో అవార్డు గ్రహీతలు

  1. 1969 - దేవికా రాణి, నటి
  2. 1970 - బి.ఎన్.సర్కార్, నిర్మాత
  3. 1971 - పృథ్వీరాజ్ కపూర్, నటుడు
  4. 1972 - పంకజ్ మల్లిక్, సంగీత దర్శకుడు
  5. 1973 - సులోచన
  6. 1974 - బి.ఎన్.రెడ్డి, దర్శకనిర్మాత
  7. 1975 - ధీరేన్ గంగూలీ, నటుడు
  8. 1976 - కానన్ దేవి, నటి
  9. 1977 - నితిన్ బోస్, దర్శకుడు
  10. 1978 - ఆర్.సి.బోరల్, స్క్రీన్ ప్లే
  11. 1979 - సోహ్రాబ్ మోడి, దర్శకనిర్మాత
  12. 1980 - పైడి జైరాజ్, దర్శకుడు, నటుడు
  13. 1981 - నౌషాద్, సంగీత దర్శకుడు
  14. 1982 - ఎల్.వి.ప్రసాద్, దర్శకుడు, నిర్మాత, నటుడు
  15. 1983 - దుర్గా ఖోటే, నటి
  16. 1984 - సత్యజిత్ రే, దర్శకుడు
  17. 1985 - వి.శాంతారాం, దర్శకుడు, నిర్మాత, నటుడు
  18. 1986 - బి.నాగిరెడ్డి, నిర్మాత
  19. 1987 - రాజ్ కపూర్, నటుడు, దర్శకుడు
  20. 1988 - అశోక్ కుమార్, నటుడు
  21. 1989 - లతా మంగేష్కర్, గాయని
  22. 1990 – అక్కినేని .నాగేశ్వర రావు, నటుడు
  23. 1991 - భాల్జీ ఫెండార్కర్, గాయకుడు, సంగీత దర్శకుడు
  24. 1992 - భూపేన్ హజారికా, గాయకుడు, సంగీత దర్శకుడు
  25. 1993 - మజ్రూహ్ సుల్తాన్‌పురి, పాటల రచయిత
  26. 1994 - దిలీప్ కుమార్, నటుడు, గాయకుడు
  27. 1995 - రాజ్ కుమార్, నటుడు, గాయకుడు
  28. 1996 - శివాజీ గణేశన్, నటుడు
  29. 1997 - ప్రదీప్, పాటల రచయిత
  30. 1998 - బి.ఆర్.చోప్రా, దర్శకుడు, నిర్మాత
  31. 1999 - హృషీకేష్ ముఖర్జీ, దర్శకుడు
  32. 2000 - ఆషా భోంస్లే, గాయని
  33. 2001 - యష్ చోప్రా, దర్శకుడు, నిర్మాత
  34. 2002 - దేవానంద్, నటుడు, దర్శకుడు, నిర్మాత
  35. 2003 - మృణాల్ సేన్, దర్శకుడు
  36. 2004 - అదూర్ గోపాలక్రిష్ణన్, దర్శకుడు
  37. 2005 - శ్యాం బెనగళ్, దర్శకుడు
  38. 2006 - తపన్ సిన్హా, దర్శకుడు
  39. 2007 - మన్నా డే, గాయకుడు
  40. 2008 - వి.కె.మూర్తి, ఛాయాగ్రాహకుడు
  41. 2009 - డి.రామానాయుడు, దర్శకుడు, నిర్మాత, నటుడు,
  42. 2010 - కైలాసం బాలచందర్, దర్శకుడు
  43. 2011 - సౌమిత్ర చటర్జీ, నటుడు
  44. 2012 - ప్రాణ్, నటుడు
  45. 2013 - గుల్జార్, నటుడు
  46. 2014 - శశికపూర్, నటుడు
  47. 2015 - మనోజ్ కుమార్, నటుడు, దర్శకుడు, నిర్మాత
  48. 2016 - కె.విశ్వనాథ్, నటుడు, దర్శకుడు, నిర్మాత
  49. 2017 - వినోద్ ఖన్నా
  50. 2018 - అమితాబ్ బచ్చన్
  51. ౨౦౧౯- రజినీకాంత్

👉రజనీకాంత్  అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. 1950డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించారు. కొన్నాళ్లు కండక్టర్‌గా పనిచేసి.. నటనపై మక్కువతో చెన్నైకి వెళ్లారు. మద్రాసు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌లో డిప్లొమా చేశారు. 

👉కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగల్‌'లో తొలి అవకాశం అందుకొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి భారతీయ సినీ పరిశ్రమలో సూపర్​స్టార్​గా గుర్తింపు పొందారు.

 

Post a Comment

0 Comments

Close Menu