👉ఏమిటి: ట్రైబ్యునళ్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు
👉ఎప్పుడు: ఇటివల
👉ఎవరు : కేంద్ర ప్రభుత్వం
👉ఎక్కడ : భారత్ లో
👉ఎవరికి : ఫిల్మ్ సర్టిఫికేషన్ అపిలేట్ ట్రైబ్యునల్(ఎఫ్‌ఏసీటీ) సహా.. మరికొన్ని
👉ఎందుకు: ప్రజలకు పెద్దగా అవసరం ఉండకపోవడం వల్ల కొన్నింటిని రద్దు చేయడం సహా.. మరికొన్నింటినీ విలీనం చేయాలని నిర్ణయించింది.
👉ఫిల్మ్ సర్టిఫికేషన్ అపిలేట్ ట్రైబ్యునల్(ఎఫ్‌ఏసీటీ) సహా.. మరికొన్ని ట్రైబ్యునళ్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
👉ట్రైబ్యునళ్ల సంస్కరణల(హేతుబద్ధీకరణ, సర్వీసు నిబంధనలు) ఆర్డినెన్స్-2021 పేరుతో దీన్ని అధికారికంగా ప్రకటించింది.
👉సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) నుంచి సినిమాలకు ధ్రువపత్రాలు పొందడంలో సమస్యలు ఉంటే నిర్మాతలు ఇంతవరకు ఈ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేవారు.
👉 ఇకపై వారు హైకోర్టులో అపీలు చేయాల్సి ఉంటుంది.
👉దీంతో పాటు మరికొన్ని ట్రైబ్యునళ్లు కూడా రద్దయ్యాయి. ఇందుకోసం పలు చట్టాల్లో సవరణలు చేసింది.
👉ప్రజలకు పెద్దగా అవసరం ఉండకపోవడం వల్ల కొన్నింటిని రద్దు చేయడం సహా.. మరికొన్నింటినీ విలీనం చేయాలని నిర్ణయించింది.
👉మొత్తం 26 ట్రైబ్యునళ్ల స్థానంలో 19ఉండనున్నాయి.
👉ఇందుకు సంబంధించిన బిల్లును ఫిబ్రవరిలోనే పెట్టినప్పటికీ ఇంకా దానికి పార్లమెంటు ఆమోదం లభించలేదు.
👉దాంతో అత్యవసర ఆదేశాలు ఇచ్చింది.
👉ఎఫ్‌ఏసీటీని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. దీనివల్ల అనవసర ఆంక్షలతో పాటు, సినిమా విడుదలలో జాప్యం జరుగుతుందనికొంత మంది ఆవేదన వ్యక్తం చేసారు.
0 Comments