👉 తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత

 

👉ఏమిటి: భారతదేశ తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత కాలం చేసారు

👉ఎప్పుడు: ఇటివల  

👉ఎవరు : మాజీ క్రికెటర్ సీకే నాయుడు కుమార్తె.

👉ఎక్కడ : ఇండోర్ తన నివాసం లో   

👉 ఎందుకు: సాదారణ అనారోగ్య కారణాల వలన (౮౮ వయస్సు)

👉భారతదేశ తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాతగా పరిగణించబడుతున్న చంద్ర నాయుడు ఏప్రిల్ 4న  మధ్యాహ్నం కన్నుమూశారు.

👉గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న చంద్ర నాయుడు ఇండోర్‌లో తన నివాసంలో మరణించారు. ఆమె వయసు 88ఏండ్లు ఈమె మాజీ క్రికెటర్ సీకే నాయుడు కుమార్తె.

👉ఈమె ఇండోర్‌లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

👉 అలాగే హోల్కర్ కాలేజీలో చదువుతున్నప్పుడు 50వ దశకంలో క్రికెట్ ఆడారు.

👉ఆమె ఆటపై చురుకైన ఆసక్తిని కనబర్చారు.అంతర్జాతీయ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా పనిచేసి భారతదేశ తొలి మహిళ వ్యాఖ్యాతగా రికార్డులకెక్కారు.

👉80వ దశకంలో తన తల్లి జ్ఞాపకార్థం ట్రోఫీని విరాళంగా ఇవ్వడం ద్వారా మహిళల ఇంటర్-యూనివర్శిటీ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రవేశపెట్టారు

👉ఇమె ఎంపీసీఏలో చురుకైన సభ్యురాలుగా ఉండి అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఇండోర్, జెయింట్స్ ఇంటర్నేషనల్ క్రియాశీల సభ్యురాలుగా అనేక సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు.

👉లార్డ్స్ మ్యూజియానికి తన తండ్రి సీకే నాయుడు వినియోగించిన క్రికెట్ బ్యాట్ అందజేత సమయంలో లార్డ్స్ కామన్ రూమ్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి పొందిన ఏకైక మహిళగా చంద్ర నాయుడు నిలిచారు.

Post a Comment

0 Comments

Close Menu