👉కుంభమేళాలో కరోనా ...

👉ఏమిటి: కుంభమేళాలో కరోనా కలకలం

👉ఎప్పుడు: ఇటివల  

👉ఎవరు : కరోనా

👉ఎక్కడ : ఉత్తరాఖండ్‌లో  

👉ఎందుకు : కుంభమేళాలో పాల్గొనే భక్తులకు కఠిన నిబంధనలు విధించారు. మాస్క్, సామాజిక దూరం తప్పనిసరి చేశారు.

👉ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో కరోనా కలకలం సృష్టించింది.

👉నాలుగు రోజులుగా జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటి వరకు 300లకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయని అధికారులు తెలిపారు.

👉ఈ నేపథ్యంలో కుంభమేళకు వచ్చే భక్తులు 72 గంటల ముందుగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని కోరారు.

👉నెగెటివ్ అని రిపోర్ట్ వస్తేనే కుంభమేళా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

👉అంతేకాదు, కుంభమేళాలో పాల్గొనే భక్తులకు కఠిన నిబంధనలు విధించారు. మాస్క్, సామాజిక దూరం తప్పనిసరి చేశారు.

👉కరోనా కారణంగా ఇప్పటికే కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ఘాట్లు భక్తులు లేక వెలవెలబోతున్నాయి.

👉సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది.

👉పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది.

👉పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా నిర్వహించబడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu