👉ఏమిటి: సీరియల్ నంబర్లు లేనివి, నాటు తుపాకీల వినియోగాన్ని కట్టడి
👉 ఎప్పుడు: ఇటివల
👉 ఎవరు : జో బైడెన్ కీలక ప్రకటన
👉 ఎక్కడ : అమెరికా
👉 ఎవరికి : అమెరికా ప్రజలకి
👉ఎందుకు: తుపాకుల వినియోగంపై ఇటీవల ప్రతిపాదించిన బిల్లులకు చట్టసభల్లో ఆమోదం లభించని నేపథ్యంలో.
👉తుపాకుల వినియోగంపై ఇటీవల ప్రతిపాదించిన బిల్లులకు చట్టసభల్లో ఆమోదం లభించని నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు.
👉 సీరియల్ నంబర్లు లేనివి, నాటు తుపాకీల వినియోగాన్ని కట్టడి చేసేందుకు వాటిపై ఆంక్షలు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు.
👉వీటిని తుపాకీ నియంత్రణ చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు.
👉 తుపాకుల వినియోగం ఓ అంటువ్యాధి వంటిదని బైడెన్ పేర్కొన్నారు.
👉అయితే బైడెన్.. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న విధంగా తుపాకుల దిగుమతిపై నిషేధం, ఉపసంహరణ, కట్టడి చేసేందుకు దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక అధికారాలు మొదలైన హామీలకు కార్యరూపం ఇవ్వలేకపోయారు.
👉 ఈ విషయంపై చట్టసభల్లో రిపబ్లికన్ల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతే కారణం.
👉 తుపాకీ వినియోగంపై గత నెల బిల్లులను ప్రవేశపెట్టగా బైడెన్ ప్రభుత్వానికి ఎగువ సభ సెనేట్లో చుక్కెదురైంది.
👉 బిల్లు ఆమోదం పొందడానికి సరైన మెజారిటీ లభించలేదు.
👉బిల్లు చట్టంగా మారేందుకు 60 ఓట్లు అవసరం కాగా.. 10 మంది రిపబ్లికన్ల మద్దతును కూడగట్టే పనిలో డెమొక్రాట్లు నిమగ్నమయ్యారు
0 Comments