👉 రాడార్​ కళ్లకు కనిపించని యుద్ధనౌకల రూపకల్పన

 

👉ఏమిటి: రాడార్​ కళ్లకు కనిపించని యుద్ధనౌకల రూపకల్పన 

👉ఎప్పుడు: ఇటివల  

👉ఎవరు : అంకుర సంస్థ జూస్​ న్యూమరిక్స్

👉ఎక్కడ : భారత్ లో  

👉ఎవరితో : గోవా షిప్​యార్డ్​తో భాగస్వామ్యం

👉ఎందుకు: ఈతరహా సిమ్యులేషన్ల ద్వారా ఆయుధ రూపకల్పనలో భారీగా సొమ్ము ఆదా అవుతుంది.

 
👉రాడార్​ కళ్లకు కనిపించని భవిష్యత్​ తరం యుద్ధనౌకల రూపకల్పన కోసం పుణెకు చెందిన అంకుర సంస్థ జూస్​ న్యూమరిక్స్​ ఎంపికైంది.

👉ఈ దిశగా గోవా షిప్​యార్డ్​తో భాగస్వామ్యం వహించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు రూ.1.5 కోట్లు మంజూరు చేసింది.జూస్​ సంస్థ ఈ కంప్యూటర్​ సిమ్యులేషన్ల రంగంలో పనిచేస్తోంది.

👉అత్యంత నైపుణ్యంతో రూపొందించిన సిమ్యులేషన్​ నమూనాల ద్వారా.. బాంబులు, క్షిపణుల మార్గాన్ని 95 శాతం కచ్చితత్వంతో ముందుగానే గుర్తించొచ్చు.

👉దీనికి తోడు ఈతరహా సిమ్యులేషన్ల ద్వారా ఆయుధ రూపకల్పనలో భారీగా సొమ్ము ఆదా అవుతుంది అని సమాచారం.

👉జూస్​ న్యూమరిక్స్​ను బొంబాయి ఐఐటీ పూర్వ విద్యార్థులు బసంత్​ గుప్త, ఇర్షాద్​ ఖాన్​, అభిషేక్​ జైన్​లు 2004లో ప్రారంభించారు.

👉ఈ సంస్థలో కేవలం 42 మంది ఉద్యోగులుమాత్రమే ఉన్నారు అయినా రక్షణ విభాగానికి చెందిన 50 సంస్థలు ఈ అంకుర పరిశ్రమ నుంచి సేవలు పొందుతున్నాయి. ఇప్పటికే 225 రక్షణ ప్రాజెక్టులను ఈ సంస్థ పూర్తి చేసింది.

👉2010లో భారత వైమానికదళానికి చెందిన సుఖోయ్​-30ఎంకేఐ యుద్ధ విమానానికి బ్రహ్మోస్​ క్షిపణిని అనుసంధానించే కీలక ప్రాజెక్టుపై ఈ సంస్థ పనిచేసింది.

👉ఈ ప్రాజెక్టు కోసం రష్యా తొలుత రూ.1300 కోట్లు డిమాండ్​ చేసింది.అయితే జూస్​ న్యూమరిక్స్ సంస్థ దాన్ని రూ.80 కోట్లకే పరిమితం చేసి పనిచేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu