👉 పవన్ కళ్యాణ్ చేస్తున్నది రాజకీయమా ? వ్యాపారమా ?


👉పవన్ కళ్యాణ్ చేస్తున్నది రాజకీయమా ? వ్యాపారమా ?

👉 జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికే పార్టీ పెట్టాడా?

👉 పవన్ కళ్యాణ్ వల్ల ఎవరికి లాభం?

👉సినీఅభిమానులకా? ఎప్పుడు సినిమాలు చేస్తా అంటాడో ఎప్పుడు చేయనంటాడో అయోమయం !!

👉సొంత సామాజకవర్గానికా? రిజర్వేషన్లు అవసరమే లేదంటాడు కాపులకు అండగా ఉండేదీ లేదు తనకు అవసరం అయితే మాత్రం కులాల ప్రస్తావన తెస్తాడు.

👉 సామాన్య ప్రజాలకా ? ఏ ఎన్నికలకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో తెలీదు తనపార్టీ ఎప్పుడు పోటీలో ఉంటుందో తనకే తెలీదు.

👉 సొంత రాష్ట్రానికా ?తెలంగాణాలో అవసరం అయితే తెలంగాణా మాటలు, ఆంద్రప్రదేశ్ లో అవసరం అయితే ఆంధ్ర మాటలు చెప్పడమే ఏ రాష్ట్రానికి ఉపయోగపడింది లేదు.

👉 పోనీ దేశానికా? - MLA గానే గెలవలేనోడు దేశానికి ఏం చేయగలడు.

👉 కొన్ని రాజకీయ పార్టీలకా? - కొంచం ఆలోచించదగ్గ విషయమే

                 పవన్ కళ్యాణ్ సుప్రసిద్ధ సినిమా నటుడు ఇంకా గొప్పగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి సొంత చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఇంతకన్నా గొప్ప బిరుదు ఇంకోటి అవసరం లేదు.ఎందుకంటే సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిందే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అన్నయ్య అభిమానులు గుండెల్లో పెట్టి చూసుకున్న తమ్ముడు పవన్ కళ్యాణ్.ఎంతలా అంటే ఒకానొక సమయంలో చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అని వేరువేరుగా యూనియన్ లీడర్స్ పుట్టుకొచ్చి అన్నయ్యకన్నా తమ్ముడు అభిమానులే ఎక్కువ, గొప్ప అనే అంత హడావిడి సృష్టించారు.

                  2008వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయ రంగప్రవేశం చేయడం, ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో అన్నయ్యతో పాటు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ప్రధాన పాత్ర పోషించడం, తమ సామాజిక వర్గానికి చేరువ అవడం జరిగింది. కొన్ని ప్రత్యేక కారణాలదృష్ట్యా అన్నయ్య చిరంజీవి తో విభేదించి అన్నయ్యకు దూరం అవ్వడం అదే దారిలో కుటుంబంతో దూరంగా ఉండటం, అప్పటినుండి తన అభిమానులు వేరు చిరంజీవి అభిమానులు వేరు అన్న భేదాలు పబ్లిక్ గా అందరికీ తెలిసిందే.


👉జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ప్రశ్నించడానికి పార్టీ పెట్టారా?

               ప్రతి రాజకీయ పార్టీకుడా ప్రత్యేకమైన సిద్ధాంతాలతో ఏర్పడటం జరుగుతుంది.మరి పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతం ఏంటంటే ప్రశ్నించడం( వైఎస్ జగన్ అండ్ జగన్ పార్టీని).జగన్ పార్టీ ఎక్కడున్నా ప్రతిపక్షం లో వున్నా అధికారంలో వున్నా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూనే ఉంటాడు. జగన్ కు సంబంధం ఉన్న లేకున్నా జగన్ ని ప్రశ్నిస్తూనే ఉంటాడు.

వేదిక ఏదైనా పులివెందుల పేరు ఎత్తి జగన్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే తన అజండా.

  • ప్రత్యేక హోదా విషయంపై నాడు ప్రతిపక్షంలో వున్నా నేడు అధికారంలో ఉన్నా జగన్ ని ప్రశ్నిస్తూనే వుంటారు.నిజానికి అడగాల్సింది ప్రశ్నించాల్సింది తను రాజకీయ పొత్తులో ఉన్న బీజేపీ(కేంద్రంలో పార్టి) చేయవలసిన పని అయినా బీజేపీ ని ప్రశ్నించరు.
  • పోలవరం నిధుల విషయంలో జగన్ నే ప్రశ్నిస్తారు తప్పా నిధులు ఇవ్వాల్సిన బీజేపీ నిప్రశ్నించరు.
  • సి బి ఐ కేసులు గురించి కూడా జగన్ నే ప్రశ్నిస్తారు బీజేపీ పరిధిలో ఉన్నా బీజేపీ ని మాత్రం ప్రశ్నించరు.
  • డీజిల్ పెట్రోల్ రేట్స్ పెరిగిపోతుంటే జగన్ నే ప్రశ్నిస్తారు పెంచుతున్న బీజేపీ ని మాత్రం ప్రశ్నించరు.
  • భారతదేశంలో ఏది ఎక్కడ ఇబ్బందులు నష్టాలు జరిగినా జగన్ నే ప్రశ్నిస్తారు.

             2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ అనూహ్యంగా జనసేన అనే రాజకీయ పార్టీ స్థాపించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది.ఎందుకంటే అప్పటివరకు ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోవడం,విడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ప్రధాన  నాయకుడు కావడం.

               ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవిజ్ఞులు అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రధాన నాయకుడు గా ఉండటం.దానికి మునుపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైస్సార్సీపీ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి ప్రాతినిధ్యం వహించడం జరుగుతున్న తరుణంలో.

                 విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం జరిగింది ఆ ద్రోహాన్ని తను ప్రశ్నించడానికి పార్టీ పెడుతున్నా అని పెట్టి, ఎన్నికలు రాగానే పోటీ చేయడానికి సమయం చాలా తక్కువ ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేయట్లేదు రాష్ట్రానికి అనుభవజ్ఞులైన నాయకుడు అవసరం, రాష్ట్రం ఆర్ధిక వనరులు కోల్పోయి, రాజధాని కోల్పోయి ధీన స్థితిలో ఉంది ఇలాంటి సందర్భంలో చంద్రబాబు లాంటి అనుభవిజ్ఞులు రాష్ట్రానికి అవసరం అని,జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీను దూషిస్తూ తన మద్దత్తు చంద్రబాబు గారికి అని ఇంకో జాతీయ పార్టీ బీజేపీ తో కలిసి ఊరు ఊరూ తిరిగి ఓట్లు అడిగారు.

                 పై చెప్పిన కారణం పబ్లిక్ రీసన్ అయినప్పటికీ ప్రైవేటు గా తన అజండా వేరే ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.అది ఏంటంటే తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి అవ్వాల్సిన వైఎస్ జగన్ కొన్ని రాజకీయ కారణాలవల్ల కాకపోవడం, ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి అవ్వాలని గట్టి ప్రయత్నంలో జగన్ ఉండటం. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీని నడుపుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్దితో రాజకీయ విభేదాలు ఉండటం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కారణాలు.ఈ అంశాలు చంద్రబాబు కి కూడా కాస్త రాజకీయంగా ఇబ్బంది ఉండటంతో అదే సమయంలో రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు తన చాణిక్యంతో ప్రసన్నం చేసుకోవడం,వీటన్నిటి దృష్ట్యా చంద్రబాబు కు మద్దతు తెలిపితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాలేడు.ఎలాగైనా జగన్ ను ముఖ్యమంత్రి కానివ్వకూడదు అనేది ప్రధాన కారణం అని రాజకీయ విశ్లేషకుల అంచనా.


👉సరే రాజకీయ పార్టీ పెట్టాడు దానివల్ల ఎవరికి లాభం?

👉 సినీఅభిమానులకి లాభమా?


             అప్పటివరకు చిరంజీవి తమ్ముడిగా,పవర్ స్టార్ గా పేరొందిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా 2014లో జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టడం ఇకమీదట సినిమాలో నటించబోను అని తన జీవితం రాజాకీయలకు అంకితం అని చెప్పడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు సగటు సినిమా అభిమానులు కాస్త నిరాశే చెందారు.

              2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు మద్దత్తుతో సరిపెట్టుకోవడం.ఎన్నికలు అయిపోయాక కొన్నాళ్ళకు మళ్ళీ సినిమా చేస్తున్నా అని చెప్పడం ఒక సినిమా చేయడం అది అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఆ సమయంలో రాజకీయ ప్రత్యర్థులు పార్ట్ టైం పొలిటీషన్ అని విమర్శించడం, కొన్నాళ్ళకు మళ్లీ సినిమాలు చేయను రాజకీయాలే అని చెప్పడం. 2019ఎన్నికల్లో స్వయంగా తను పోటీచేసిన 2 స్థానాలలో రెండు ఓడిపోవడం తన పార్టీ అభ్యర్థి 1 అసెంబ్లీ సీటు గెలవడం వంటి ఘోర అవమాలమధ్య కాస్త సమయం తీసుకొని మళ్ళీ సినిమాలలో నటిస్తాను అనడం.

               అంటే ఎప్పుడు సినిమాలు చేస్తాను అంటాడో ఎప్పుడు చేయను అంటాడో ఎపుడు ఏమి మాట్లాడతాడో అర్థంకాని పరిస్థితిలో సగటు అభిమాని ఎప్పుడు నిరాశతోనే వున్నాడు.

👉సొంత సామాజకవర్గానికి లాభమా?

               ప్రజారాజ్యం పార్టీతో తన సొంత కాపు-బలిజ సామాజకవర్గం కు కాస్త దగ్గరయ్యారు పవన్ కళ్యాణ్.సినిమా సైతం చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు తెచ్చుకుని అన్నయ్య రాజకీయ పార్టీ తో సొంత సామాజికవర్గానికి దగ్గరవ్వడం అంతా అన్నయ్య చలువే.             

              ఎప్పుడు దేశభక్తి, దేశ వ్యవహారాలు, దేశ రాజకీయాలు మాట్లాడే పవన్ కళ్యాణ్ చాలాసార్లు కులాలు ఉండకూడదు,మతాలు వుండకూడదు దేశమంతా ఒక్కటే రిజర్వేషన్లు వుండకూడదు, కుల రాజకీయాలకు నేను దూరం నాకు కులం లేదు నాకు కులం రంగు పూయవద్దు అని హితబోదలు పలుకుతుండేవారు.

                ముద్రగడ్డ పద్మనాభం గారు లాంటి కాపు ఉద్యమ నేతలు ఎన్నో ఏళ్లుగా కాపులకు రిజర్వేషన్లు కోసం ఉద్యమాలు చేస్తుంటే ఏరోజు పట్టించుకున్న పాపానికిపోలేదు.సినిమా ఇండస్ట్రీలో వున్న కాపు సామాజికవర్గం వారంతా చిరంజీవి గారితో కలిపి అందరూ కాపు ఉద్యమానికి మద్దతు తెలిపితే,సినిమా ఇండస్ట్రీలో ఉంది,రాజకీయ పార్టీకి అధినేత అయ్యుండి తన సొంత సామాజకవర్గానికి కనీస మద్దతు తెలపలేని పవన్  ఒక రాజకీయనాయకుడా అన్నవిమర్శలూ మూటగట్టుకున్నాడు.

                 ఒక్కసారిగా ఎన్నికలొస్తే నా కులం నా మతం నావాళ్లు అంటూ ఉపన్యాసాలు. బీజేపీ కి మద్దతు తెలుపుతూ తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో కాపులను బలిజలను అధికారపార్టీ వేధిస్తోంది, ప్రలోభాలు పెడుతుంది నా కులం వాళ్ళని ఏమన్నా అంటే ఊరుకోను నిలాదీస్తాను అంటూ మైకులు పగిలేలా అరుపులు.

పవన్ కళ్యాణ్ గారు నీ అవసరానికి కులం వాడటం కాదు కులం అవసరానికి మీరు కాస్త ఉఒఅయోగపడండి అని సొంత సమాజకవర్గంలోనే విమర్శలు.

               పవన్ కళ్యాణ్ రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న ప్రజలు కానీ తన సొంత సామాజికవర్గం వారు కానీ పవన్ కళ్యాణ్ ను నమ్మే పరిస్థితిలో లేరు.నమ్మి ఉంటే కనీసం పోటీ చేసిన రెండు చోట్లలో ఒక్కచోట అయిన గెలిచేవాడే.కాబట్టి పవన్ కళ్యాణ్ వల్ల తన సొంత సామాజకవర్గానికి కూడా ప్రయోజనం లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.


👉సామాన్య ప్రజాలకి లాభమా?

              దేశంలోకావచ్చు రాష్ట్రంలో కావొచ్చు సామాన్య ప్రజల్లో చాలా ఎక్కువ భాగం ప్రజలు ఏదోఒక రాజకీయ పార్టీతో భాగమై వుంటారు.ఏ పార్టీకి సంబంధం లేని వారు కొందరు వుంటారు వారే తటస్తులు అని రాజకీయ పరిభాషలో చెప్పుకుంటాం.అలాంటి తటస్తులకు పవన్ కళ్యాణ్ వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే లేదనే చెప్పాలి.

                ఎందుకంటే  పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు తన సొంత పార్టీ గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేసింది కేవలం 2019 సాధారణ ఎన్నికల్లో మాత్రమే అదికూడా ఘోర ఓటమి పోటీ చేసిన రెండుచోట్ల స్వయానా థానే ఓడిపోవడం. 2014 నుండి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోని రాజకీయ పార్టీ లేదు ఒక్క వైస్సార్సీపీ తప్ప. 2014లో టీడీపీ,బీజేపీతో పొత్తు జనసేన పోటీ చేయలేదు. కొద్దిరోజుల బీజేపీ తో విడిపోయి టీడీపీ తో కొనసాగడం తరువాత సీపీఎం,సీపీఐ కొన్నాళ్ళకు బిఎస్పి, కొన్నాళ్ళకు కాంగ్రెస్ ను పొగడటం.

               ప్రత్యేక హోదా విషయం పై బీజేపీ ని పచ్చిగా తిట్టిన పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళకు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, బీజేపీ కోసం త్యాగాలు చేయడం, బీజేపీ కోసం ప్రచారాలు చేయడం, బీజేపీ కోసం ప్రత్యర్థి పార్టీలు సంబంధం లేని విషయాలల్లో కూడా జోక్యం చేసుకొని విమర్శించం వంటివి చూసి పొరపాటున పవన్ కళ్యాణ్ పార్టీకి ఓట్లు వేద్దాం అనుకునే వారికి పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి అర్థం కాకఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో తెలీక, తన పార్టీ గుర్తుపై ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తాడో తేలిక పవన్ కళ్యాణ్ చెప్పిన వారికి ఓట్లు వేయడం అవసరమా అనే సందేహాన్ని ప్రజల్లో స్వయానా పవన్ కల్యాణే పుట్టిడ్తున్నారేమో.


👉 సొంత రాష్ట్రానికి లాభమా?

               ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలన్నా రాజకీయ మీటింగులు అన్నా పవన్ కళ్యాణ్ వాడే అస్త్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందనితెలిసి 11రోజులు భోజనంమానేసాను అంత భాధపడ్డాను అను బాహాటంగా చెప్పనే పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో కేసీఆర్ కబడ్ధార్ అంటూ ఉత్తర కుమార పలుకులు పలుకుతారు,  తెలంగాణ లో ఎన్నికలు రాజకీయ మీటింగుల్లో తెలంగాణ అంటే నాకు ప్రాణం తెలంగాణ ఉద్యమం గనుక నాచేతిలో ఉండి ఉంటే ఆంద్రప్రదేశ్ పాలకులకు చుక్కలు చూపించేవాడిని, ఆంధ్రప్రదేశ్ పాలకులు తెలంగాణా కు అన్యాయం చేసారు  అని నిస్సిగ్గుగా చెప్పుకుంటారు.

             తన తీసిన సినిమా విడుదల సమయం దగ్గరకొస్తే ఏదో ఒక రూపంలో తెలంగాణలో అక్కడ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ ని మించిన తెలంగాణ అభిమాని ఇంకెవ్వరులేరు అన్నంతగా విన్యాసాలు చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ప్రచారం ఇక్కడ చేస్తారు.

               దీంతో రెండు రాష్ట్రాల ప్రజలు కూడా బాగా తెలుసుకుని పవన్ కళ్యాణ్ ను ఎక్కడ పెట్టాల్లో అక్కడ పెట్టారు.తను ఎన్నినాటకాలు,రాజకీయాలు చేసినా రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుండి ఇఓపటివరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాల్లో విజయం సాధించలేదు రాజకీయాల్లో విజయం సాధించలేదు.


👉పోనీ దేశానికి లాభమా?

                పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీ పెట్టి దాదాపుగా 8 సంవత్సరాలు కావొస్తుంది. ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేసిందిలేదు పోటీ చేసిన ఒక్కసారి కూడా స్వయానా పార్టీ అధ్యక్షుడే రెండుచోట్ల ఓడిపోవడం,ఒకే ఒక్క ఎం ఎల్ ఏ గెలవడం తనుకూడా పార్టీకివ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం. ఇంతవరకు సొంత రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు  ఎం ఎల్ ఏ కూడా అవ్వలేదు ఒక నియోజకవర్గానికి,రాష్ట్రానికే ఏమి చేయలేని వ్యక్తి దేశానికి ఏమి చేయగలడు వరదలు,విపత్తులు వచ్చినప్పుడు సినిమాలో సంపాదించిన డబ్బు కాస్త దాన చేసాయడం తప్పా,ఉపన్యాసాల్లో దేశభక్తి గురించి మాట్లాడి చివర్లో జైహింద్ అనడం తప్పా.

👉కొన్ని రాజకీయ పార్టీలకి లాభమా?

            పవన్ కళ్యాణ్ వల్ల ఎవరికి ఎక్కువ లాభం అంటే ఏ సామాన్యుడిని అడిగినా టక్కున చెప్పే సమాధానంఏంటంటే కొన్నిరాజకీయ పార్టీలకు అని. ఏ రాజకీయ పార్టీకి అవసరం అయితే లేదా ఏ రాజకీయ పార్టీతో తనకు అవసరం ఉంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడానికి ఏమాత్రం వెనకాడడు.

👉తెలుగుదేశం-జనసేన-బీజేపీ

              హడావిడిగా పార్టీ పెట్టి ప్రశ్నిస్తా అని చెప్పి తెరవెనుక ఏమి జరిగిందో మరి కొత్తగా పార్టీ పెట్టి పోటీ చేయకుండా తెలుగుదేశం బీజేపీ పార్టీలకు మద్దతు ఇచ్చి తనవల్లే రెండు పార్టీలు రాష్టం లో తెలుగుదేశం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాయని ఉపన్యాసాలు. అవసరం అయిన ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి ప్రెస్సుమీట్లు పెట్టి టీడీపీ బీజేపీ కి వత్తాసు పలికి హడావిడి చేసి వెళ్లిపోవడం ఒక పద్దతిగా చేస్తారు.

                వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ గ్రాఫ్ కొంచం తగ్గుతుందని తీయగానే తిరిగి టీడీపీ బీజేపీని బండబూతులు తిట్టడం ఎక్కడలేనిఅవినీతి ఆరోపణలు చేయడం ఒక అలవాటు.

👉 సీపీఎం-జనసేన-సీపీఐ

               అప్పటిదాకా వామపక్షాల భావజాలాన్ని సిద్ధాంతాలకి పూర్తి భిన్నమైన బీజేపీ తో పొత్తులో ఉంది ఉన్నఫలంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం.బీజేపీ కి దూరం అయ్యిన వెంటనే కాంగ్రెస్ ను పొగడటం. నాకు మించిన కమ్యూనిస్టు సిద్ధాంతాలు కార్ల్ మర్క్స్ కు కూడా లేవు అన్నంత బిల్డప్ ఇచ్చి కొద్దిరోజులు పబ్బం గడిపేస్తారు.

👉 టీ ఆర్ ఎస్-జనసేన

              ఇతర పార్టీలతో పొత్తులో ఉంటూనే ఎం ఎల్ సి ఎన్నికలలో టీ ఆర్ ఎస్ కు మద్దత్తు ఇవ్వడం.కొన్ని ఎన్నికల్లోతమపార్టీ కార్యకర్తలుతో నామినేషన్ వేయించడం లాస్ట్ మినిట్స్ లో వేరే పార్టీకి మద్దత్తు ఇవ్వండి మన నామినేషన్స్ వెనక్కి తీసుకోండి అని చెప్పడం.

👉బీజేపీ-జనసేన

            2019 ఎన్నికల్లో ఘోర ఓటమితో బీజేపీ రెండో సారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో దెబ్బకు బీజేపీ గుర్తొచ్చి మళ్ళీ బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం.ఆంధ్రప్రదేశ్ లో జనసేన కన్నా దిగువన ఉన్న బీజేపీ జనసేన పొత్తుకు వెంపర్లాడటం.

             హైదరాబాద్ లోని జీహెచ్ఎంసి ఎన్నికల్లో నామినషన్ వేసేసిన తరువాత పవన్ కళ్యాణ్ పార్టీ బీజేపీ కోసం నేమినేషన్ వెనక్కు తీసుకోవడం.తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ పార్టీ సీటు వదులుకోవడం. ప్రచార సభల్లో సంబంధం లేని విషయాలు కూడా వైస్సార్సీపీ కి అంతగట్టటం.

బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న త్యాగాలు చూస్తుంటేలోలోపల ఏదో భలమైన కారణం,బంధం ఉండి వుండవొచ్చేమో.టీడీపీ కి అవసరం అయినప్పుడు టీడీపీకి, బీజేపీకి అవసరంవున్నప్పుడు బీజేపీకి, వామపక్షాలకు అవసరమైనప్పుడువాటితో నిస్సిగ్గుగా నిర్లజ్జగా తిట్టిన పార్టీతో కావడం, కలిసిన పార్టీని తిట్టడం పవన్ కళ్యాణ్ కే చెల్లు.

              ఇంత హడావుడి చేస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓటు శాతం కేవలం 5.53%. 5.53%ఓట్లు పెరిగేది ఎప్పుడు? గెలిచేది ఎప్పుడు? అధికారంలోకి వచేదెప్పుడు?.

               అతి దారుణం అయిన విషయం ఏంటంటే ఇటీవల తిరుపతి ఉపఎన్నికలులో జనసేన పార్టీఎన్నికల  గాజుగ్లాసుగుర్తు ను వేరేపార్టీ అభ్యర్థికి కేటాయించింది కేంద్రఎన్నికలసంఘం. కారణం ఏంటంటే జనసేనాకు రాజకీయ పార్టీ గుర్తింపును అవసరంఅయిన 6%ఓట్లు 2 అసెంబ్లీ స్థానాలు కానీ కైవసం చేసుకోవాలి అదికూడా లేనందున జనసేనాకు రాజకీయ పార్టీగా గుర్తింపు లేదు.


👉మాటలకు చేతలకు పొంతనలేని రాజకీయాలు

  • ·       ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి అధికారంలో ఉన్నవారిని కాకుండా జగన్ ని మాత్రమే ప్రశ్నించడం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో వున్నా.
  • ·       లక్షల పుస్తకాలు చదివానుఅని ఉపన్యాసాలల్లో చెప్పడం అదే ఉపన్యాసాలల్లో భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం.
  • ·       ఒక్కో ఊరిలో ఒక్కో విధంగా ఒకసారి ఇంటర్మీడియట్ లో సీఈ సీ చదివానని ఇంకోసారి ఎం పీ సీ చదివాను అని, ఇంకో దగ్గర బైపీసీ అని, మరొక దగ్గర ఇంటర్మీడియట్ డిస్ కంటిన్యూ అని  ఉపన్యాసంలో  చెప్పడం చాలామందికి నవ్వు తెప్పించే అంశం.
  • ·       ప్రత్యేక హోదా కోసం వైస్సార్సీపీ టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టండి నేను దేశమంతా తిరిగి మద్దతు కూడగడతా అని చెప్పి తీరా అవిశ్వాస తీర్మానం పెట్టాక అడ్రెస్ లేకుండా పోవడం.
  • ·       బీజేపీతో పొత్తులో ఉంటే హిందు మతం అంటే ప్రాణం అని, వామపక్షాలు తో వేరే పార్టీలతో పొత్తులో ఉంటే నేను హిందు నా భార్య క్రిస్టియన్ అని నా స్నేహితులు అందరూ ముస్లిమ్స్ అని ఏ అవసరానికి ఆ మతాన్ని కులాన్ని వాడటం.

                ఇన్నిఅవలక్షణాలు,అవరోధాలు,అవమానాలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలు గమనిస్తున్న ప్రజలు రాజకీయ పండితులు విస్మయం చెందుతున్నారు.కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం లేకపోయినా కొన్ని కొన్ని రాజకీయ పార్టీలకు ప్రయోజనం అనే అభిప్రాయానికి రాక తప్పదు.

నోట్ : ఈ వ్యాసం పూర్తిగా విశ్లేషకుల వ్యక్తిగతం

విశ్లేషకులు: ఆర్.కె శాతరాసి(9629301038)

Post a Comment

0 Comments

Close Menu