Q. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) ను లెక్కించడానికి భారత్ లో ఎన్ని పద్ధతులు వాడతారు ?
ANSWER : స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) ను లెక్కించడానికి భారత్ లో మూడు పద్ధతులు వాడతారు
Q . స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) ను లెక్కించడానికి భారత్ లో ఎ పద్ధతులు వాడతారు ?
ANSWER : 3 పద్ధతులు అవి ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి మరియు ఉత్పత్తి పద్ధతి
Q. ఒక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఏమి అంటారు ?
ANSWER : ఒక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు
Q. నామమాత్రపు జిడిపి ఎ ధరల ఆధారంగా లెక్కించబడుతుంది.?
ANSWER : ప్రస్తుత ధరల ఆధారంగా
Q. ''జీడీపీ అనేది ఒక విద్యార్థి మార్కుల జాబితా వంటిది'' అని ఎవరు అభివర్ణిచారు.?
ANSWER : రీసెర్చ్ అండ్ రేటింగ్స్ సంస్థ కేర్ రేటింగ్స్‌కు చెందిన ఆర్థికవేత్త సుశాంత్ హెగ్డే
Q. భారతదేశంలో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) ప్రతి ఏటా ఎన్ని సార్లు జీడీపీని లెక్కిస్తుంది. ?
ANSWER : ప్రతి ఏటా నాలుగు సార్లు.అలాగే ప్రతి ఏటా వార్షిక జీడీపీ వృద్ధి గణాంకాలను కూడా సీఎస్ఓ విడుదల చేస్తుంది
Q. GDP లో ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కించే ఈ గణాంకాలను ఆర్థిక పరిభాషలో ఏమి అంటారు ?
ANSWER : త్రైమాసిక గణాంకాలు(మూడు నెలలకు ఒకసారి)
Q. భారత దేశ GDP ఎంత ?
ANSWER : 3.05 ట్రిలియన్ డాలర్లు (నామమాత్ర 2021 అంచనా.)
Q. భారత దేశ GDP ర్యాంక్ ఎంత ?
ANSWER : ప్రపంచంలో 6 వర్యాంక్ (నామమాత్ర 2020) 3 వ ర్యాంక్ (పిపిపి 2020)
Q. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ ఆదాయాన్ని అందించే రంగం ఏది ?
ANSWER : తృతీయ రంగం(సేవా రంగం, రియల్ ఎస్టేట్, హోటళ్ళు మరియు రెస్టారెంట్లు, టెలికమ్యూనికేషన్స్ వంటి అనేకము ఉంటాయి).
Q. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనుకుంటున్న సమయం ఎప్పటికి ?
ANSWER : 2024-25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
Q.భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనుకుంటున్నదుకు గాను సంవస్తారానికి ఎంత వృద్ధి రేటును ఉంచడం అవసరం ?
ANSWER : సంవత్సరం 9% వృద్ధి రేటును ఉంచడం అవసరం.
Q. . భారతదేశ జిడిపిని లెక్కించడానికి ప్రాథమిక (బేస్) సంవత్సరం ఎంత ?
ANSWER : భారతదేశ జిడిపి లెక్కింపుకు ప్రాథమిక సంవత్సరం 2011-12
Q . భారతదేశంలో జాతీయ ఆదాయ డేటాను ఎవరు విడుదల చేస్తారు ?
ANSWER : భారతదేశం లో GDP ని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఒ), స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ మంత్రిత్వశాఖ చే విడుదల చేయబడతాయి
Q. మొత్తం జాతీయ ఆదాయం + అమ్మకపు పన్నులు + తరుగుదల + నికర విదేశీ కారకాల ఆదాయం = ?
ANSWER : జీడీపీ(జిడిపి = మొత్తం జాతీయ ఆదాయం + అమ్మకపు పన్నులు + తరుగుదల + నికర విదేశీ కారకాల ఆదాయం)
Q. అన్ని రంగాలలో 100% ఉపాధి, స్థిరమైన కరెన్సీ మరియు స్థిరమైన ఉత్పత్తి ధరలతో ఆదర్శ ఆర్థిక పరిస్థితిని ఏమంటారు ?
ANSWER : సంభావ్య జిడిపి (Potential GDP)
Q.స్థూల జాతీయోత్పత్తి బ్లాక్ మార్కెట్‌ను లెక్కలోకి ఎలా తీసుకొంటుంది ?
ANSWER : లెక్కలోకి తీసుకొలేదు
Q. వ్యయ విధానం లో సాధారణంగా ఉపయోగించే జిడిపి ఫార్ములా ఏమి ?
ANSWER : GDP = C + G + I + NX (సి = వినియోగం , G = ప్రభుత్వ , I = మూలధనము ,NX = నికర ఎగుమతులు)
Q. ప్రపంచంలో జిడిపి అనే ప్రాథమిక భావన ఎవరు కల్పించారు ?
ANSWER : విలియం పెట్టీ ( చార్లెస్ డావెనెంట్ ఈ పద్ధతిని 1695 లో మరింత అభివృద్ధి చేశారు)
Q. జీడీపీ లో సామర్ధ్య విధానాన్ని ఎవరు అభివృద్ధి చేశారు ?
ANSWER : 1980 లలో, అమర్త్యసేన్ మరియు మార్తా నస్బామ్
0 Comments