బంధకళ (tie and dye) చీరలు


👉ఏమిటి: బంధకళ చీరలు

👉ఎప్పుడు: ఇటివల

👉 ఎవరు : ఈ కళలో సువర్ణపూర్ చేనేత కళాకారులు ప్రత్యేక గుర్తింపు

👉ఎక్కడ : ఒడిశా

👉ఎవరికి : సువర్ణపూర్ చేనేత కళాకారులు

👉ఎందుకు : టై అండ్ డై చీరలకు పెట్టింది పేరు ఒడిశా.

 


👉 టై అండ్ డై చీరలకు పెట్టింది పేరు ఒడిశా. ఈ చేనేత విధానానికే మరో పేరు 'బంధకళ'.

👉ఈ కళలో సువర్ణపూర్ చేనేత కళాకారులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ప్రాంతంలోనే బంధకళ పుట్టినట్లు చెప్తారు.

👉ఈ ఊరంతా రంగురంగుల దారాలతో తయారుచేసే కళ్లు చెదిరే డిజైన్లే దర్శనమిస్తాయి.

👉సువర్ణపూర్‌కు చెందిన ఓ చేనేత కళాకారుడు ఓ చీరపై భారతదేశ పటం చిత్రించాడు.

👉చీర కొంగు, అంచులపై 28 రాష్ట్రాల పేర్లు, వాటి చిత్రపటాలు డిజైన్ చేశాడు. అంతేకాదు, అన్నదాతల ఔన్నత్యాన్ని చాటిచెప్పే 'జై జవాన్-జై కిసాన్ ' నినాదం, దేశభక్తిని తెలిపే 'ఐ లవ్ మై ఇండియా' లాంటి నినాదాలను సన్నని దారాలతో చీరపై నేశాడు.

👉ఈ డిజైన్లన్నీ టై అండ్ డై పద్ధతిలోనే చేశాడు చేనేత కళాకారుడు ఈశ్వర్ మెహెర్.

👉ఈ చీరల తయారీలో ఎలాంటి రసాయనాలు, యంత్రాలు వినియోగించరు. సన్నని, సున్నితమైన దారాలు, సహజ రంగులను వాడి, మగ్గాలపై చేత్తోనే నేస్తారు. శంపూర్ దారాలతో తయారు చేసే ఈ చీరలు మెత్తగా ఉండి, ధరిస్తే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.ఈ చీరకు డిమాండ్ బాగానే ఉన్నందున 15 నుంచి 20 వేల రూపాయలకు అమ్మాలనుకుంటున్నాడు ఈశ్వర్.

👉ఈ ఐదు మీటర్ల పొడవైన చీరపై పొదిగిన ప్రతి చిత్రం..ఒడిశాలోని కళాకారుల నైపుణ్యాలకు అద్దం పడుతుంది.

👉ఈ విశిష్టమైన కళకు సరైన గుర్తింపు దక్కితే... ఒడిశా కళాకారుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత చాటుతుంది.

Post a Comment

0 Comments

Close Menu