కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం
- కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం ఇటివల అమలులోకి వచ్చింది.
- ఈ విధానంతో దాదాపు 90 వేల మంది వలసదారులను శాశ్వత నివాసితులుగా చేయనున్నది.
- ఈ విధానం వల్ల భారతీయులు ఎక్కువగా ప్రయోజనం పొందుతారని నిపుణులు అంటున్నారు.
- కొత్త ఇమ్మిగ్రేషన్ కార్యక్రమం కింద కెనడాలో ఇప్పటికే నివసిస్తున్న 90 వేలకు పైగా అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక అవసరమైన ఉద్యోగులకు శాశ్వత నివాస (పీఆర్) హోదా ఇవ్వనున్నారు.
- శాశ్వత నివాస హోదా ఇవ్వడానికి 40 వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు, 30 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు, ఆరోగ్య రంగానికి చెందిన 20 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను ఎంపిక చేయనున్నారు.
- కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులు గత నాలుగేండ్లలో అదే దేశంలో పోస్ట్ సెకండరీ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లయితే శాశ్వత నివాసితులుగా గుర్తింపు పొందుతారు.
- కెనడాలో ఆరోగ్య రంగంలో లేదా ఇతర అవసరమైన పనుల్లో విదేశీ ఉద్యోగులకు కనీసం ఒక ఏడాది అనుభవం కలిగి ఉండాలి.
- కెనడాలో భారతీయ వలసదారుల సంఖ్య 2020 లో 2,20,000 గా ఉన్నందున ఇతర విదేశీ విద్యార్థుల కంటే భారతీయ విద్యార్థులు ఈ ప్రోగ్రాం నుంచి ఎక్కువ ప్రయోజనం పొందుతారని చెప్పవచ్చు.
- కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయే ముందు 2020 లో 3,41,000 మంది వలసదారులకు శాశ్వత నివాస హోదా ఇచ్చేందుకు కెనడా నిర్ణయించింది.
- గత ఏడాది ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టలేకపోయారు.దాంతో ఈ సంవత్సరం నాలుగు లక్షల మంది వలసదారులకు శాశ్వత నివాస హోదా ఇవ్వనున్నారు.
- ఈ విధానం కెనడాలో వలసదారులు తమ మూలాలను స్థాపించుకోవడానికి, కెనడాకు కూడా ఎదగడానికి అవకాశం కల్పిస్తుందని కెనడియన్ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్కో మెండిసినో చెప్పారు.
- వలసదారుల స్థితి తాత్కాలికమే అయినా, వారి సహకారం అంతులేనిదని, అందువలన వారు ఇక్కడే ఉండాలని మేం కోరుకుంటున్నామన్నారు.
0 Comments