చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్ - 21

 🌳🌎చరిత్రలో ఈ రోజు {సెప్టెంబర్ / - 21}🌎🌳

👉 బయోస్ఫియర్ దినోత్సవం.

👉 అంతర్జాతీయ శాంతి దినోత్సవం.

👉 ప్రపంచ  అల్జీమర్స్ దినోత్సవం.





🔎సంఘటనలు🔍

🌸2013: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమైంది.

🌼జననాలు🌼

💛1862: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కంరచయిత. (మ.1915)

💛1898: అద్దంకి శ్రీరామమూర్తి, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, సంగీత విశారదుడు. (మ.1968)

💛1921: భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత

💛1927: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. (మ.1993).

💛1931: సింగీతం శ్రీనివాసరావు, భారతీయ సినిమా దర్శకుడు.

💛1944: ఎమ్వీయల్. నరసింహారావు, సాహితీవేత్త, సినిమా నిర్మాత. (మ.1986).

💛1957: కెవిన్ రడ్డ్, ఆస్ట్రేలియా 26 వ ప్రధానమంత్రి.

💛1963: కర్ట్‌లీ ఆంబ్రోస్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

💛1966: బి.వి.వి.ప్రసాద్, కవి.

💛1979: క్రిస్ గేల్, వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు.

💛1985: క్రిస్ అలెన్, అమెరికా గాయకుడు, గేయరచయిత.

💛1991: నాగరాజు కువ్వారపు, వర్ధమాన సినీ గేయరచయిత.

 

💐మరణాలు💐

 

🍁1743: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (జ.1688)

🍁1832: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత. (జ.1771)

🍁1969: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరులు, భౌతిక శాస్త్రవేత్త

🍁1994: రామకృష్ణ బజాబ్, భారత పారిశ్రామికవేత్త.

🍁2011: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)

🍁2012: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (జ.1915)

 

🇮🇳జతీయ / దినాలు🇮🇳

 

👉 బయోస్ఫియర్ దినోత్సవం.

👉 అంతర్జాతీయ శాంతి దినోత్సవం.

👉 ప్రపంచ  అల్జీమర్స్ దినోత్సవం.

 

👉International Day of Peace 21 సెప్టెంబర్

👉 2022 థీమ్: జాత్యహంకారాన్ని అంతం చేయండి. శాంతిని నిర్మించండి.

👉 ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. UN జనరల్ అసెంబ్లీ దీనిని 24 గంటల అహింస మరియు కాల్పుల విరమణను పాటించడం ద్వారా శాంతి ఆదర్శాలను బలోపేతం చేయడానికి అంకితమైన రోజుగా ప్రకటించింది.

👉 కానీ నిజమైన శాంతిని సాధించడం అనేది ఆయుధాలు వేయడం కంటే చాలా ఎక్కువ. సభ్యులందరూ అభివృద్ధి చెందగలరని భావించే సమాజాల నిర్మాణం దీనికి అవసరం. ఇది వారి జాతితో సంబంధం లేకుండా ప్రజలు సమానంగా పరిగణించబడే ప్రపంచాన్ని సృష్టించడం.

Post a Comment

0 Comments

Close Menu