పొన్నియిన్ సెల్వన్

 పొన్నియిన్ సెల్వన్ కథ ఏంటి?




⭐1950ల కాలం నుంచే ఈ నవల తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పటివరకు లక్షలాది కాపీలు అమ్ముడయ్యాయి. కల్కి రాసిన నవలలను జాతీయం చేశారు. అప్పుడు చాలామంది ప్రచురణకర్తలు, ఆయన నవలలను వివిధ ఫార్మాట్లలో ప్రచురించారు.

⭐ఈ నవల మొదటిసారిగా 1950లో కల్కి మ్యాగజీన్‌లో ఒక సీరియల్‌గా ప్రచురితమైంది. ఆ తర్వాత అనేక సార్లు దీన్ని పునఃప్రచురించారు. ఇది ప్రచురితమైన ప్రతిసారి కల్కీ మ్యాగజీన్ అమ్మకాలు గణనీయంగా పెరిగేవి.

⭐ఇప్పుడు ఇది సినిమాగా రానుండటంతో మళ్లీ ఈ నవలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. చాలామంది ప్రచురణకర్తలు మళ్లీ నవలను ప్రచురించారు. దీన్ని ఇంగ్లిష్‌లోకి కూడా తర్జుమా చేశారు.


⭐పరాంతక చోళుడు-2 పాలన చివరి సంవత్సరాల గురించి ఈ నవలలో పేర్కొన్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. వారు కుందవై, ఆదిత్య కరికాలన్, అరుల్‌ మొళి వర్మన్.

⭐ఆదిత్య కరికాలన్‌కు 'యువరాజు' అనే బిరుదు దక్కింది. పరాంతక చోళుని తర్వాత అదిత కరికలన్ రాజు అవుతాడు.

⭐కాంచీపురంలో అదిత కరికలన్ ఒక బంగారు భవనాన్ని నిర్మిస్తాడు. ఆ తర్వాత తంజావూరులో ఉండే తన తండ్రి పరాంతక చోళుడిని కాంచీపురంలోని బంగారు భవనంలో నివసించడానికి రావాల్సిందిగా కోరుతూ ఉత్తరం రాసి, దాన్ని తన మిత్రుడు వందియతేవన్‌కు ఇచ్చి పంపిస్తాడు.

⭐ఆ ఉత్తరం తీసుకొని వందియతేవన్, తంజావూరుకు బయల్దేరతాడు. మార్గం మధ్యలో కదంపూర్ అనే భవనంలో వందియతేవన్ విశ్రాంతి తీసుకుంటాడు.

⭐అదే సమయంలో చోళ రాజ్య కోశాధికారి పలువెట్టయార్ నేతృత్వంలో ఆదిత్య కరికాలన్‌కు వ్యతిరేకంగా చేసిన కుట్ర గురించి వందియతేవన్ తెలుసుకుంటాడు.

⭐అదిత్య కరికలన్ ఇచ్చిన ఉత్తరాన్ని కుందవై, పరాంతక చోళుడికి వందియతేవన్ అందజేస్తాడు. శ్రీలంకలో యుద్ధంలో తలపడుతోన్న తన తమ్ముడు అరుల్‌ను తీసుకురావాల్సిందిగా కోరుతూ కుందావై, వందియతేవన్‌ను శ్రీలంకకు పంపిస్తుంది. దీంతో వందియతేవన్, శ్రీలంక వెళ్తాడు.

పలువెట్టరైయార్ అదే సమయంలో అరుల్ మొళి వర్మన్‌ను బందీగా తీసుకురావడానికి శ్రీలంకకు రెండు ఓడలను పంపిస్తాడు. వందియతేవన్, అరుల్ మొళి వర్మన్‌లను తీసుకువస్తుండగా ఆ ఓడలు తుపానులో చిక్కుకుంటాయి. వీరిద్దరిని పూంగుళలీ అనే ఒక జాలరి కాపాడుతుంది.

అరుల్‌మొళి వర్మన్ అనారోగ్యం పాలవ్వడంతో చికిత్స కోసం నాగపట్టణంలోని ఒక బౌద్ధ మందిరానికి తీసుకు వెళతారు.

⭐అదే సమయంలో ఆదిత్యను సింహాసనం నుంచి తప్పించి తన పినతండ్రి మధురాంతకన్‌ను గద్దె ఎక్కించాలనే పలువెట్టయార్ కుట్రలు ఊపందుకుంటాయి. ఈ కుట్రలో పలువెట్టయార్ భార్య నందిని కూడా చురుగ్గా పాల్గొంటుంది.

⭐ఆదిత్య కరికలన్‌ను కదంబూర్ అనే ప్రాంతంలోని ఒక భవనంలోకి పిలిపించి హత్య చేయాలని పథకం పన్నుతారు. పథకం ప్రకారమే ఆదిత్యను హత్య చేస్తారు. ఈ హత్యా నేరం వందియతేవన్‌పై పడుతుంది.

⭐ఆ తర్వాత తనపై పడిన నింద నుంచి వందియతేవన్ ఎలా బయటకువచ్చాడు? పలువెట్టయార్‌ ఏమయ్యాడు? వందియతేవన్, కుందవై మధ్య ప్రేమకథ ఏమైంది? అనేదే మిగతా స్టోరీ..

Post a Comment

0 Comments

Close Menu