కాకతీయుల పరిపాలనా విధానం : 1 (kakatiya administration)

 కాకతీయుల పరిపాలనా విధానం : 1



⭐ కాకతీయుల కాలంలో సంప్రదాయ రాజరికం అమలులో ఉంది. 

⭐సంప్రదాయ రాజరికంలో సాధారణంగా రాజ్యం తండ్రి నుండి కుమారునకు వారసత్వంగా సంక్రమిస్తుంది.

⭐ హిందు రాజ వంశాలలో స్త్రీని సింహాసనం ఎక్కించిన అపూర్వ ఘనత కాకతీయులది.

⭐రుద్రమదేవి పురుషనామం ధరించి, పురుషవేషంలో రాజ్యవ్యవహారాలను నిర్వహించింది. ⭐కాకతీయుల కాలంలోనే ప్రప్రథమంగా దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి ఉండేది. రాజుకు పరిపాలనలో సహకరించడానికి మంత్రి పరిషత్తు ఉండేది.

⭐వీరి శాసనాలలో "చాతుర్వర్ణ సముద్ధరణ" అనే బిరుదు తరుచుగా కనపడుతుండేది.

వీరి శాసనాలలో కనిపించే ఉద్యోగుల పేర్లు:

  • 1. మహాప్రధాని 2 అమాత్య
  • 3.ప్రర్గడా 
  • 4 సంధి విగ్రహకుడు.
  • 5. సకల సేనాపతి

⭐కాకతీయుల పరిపాలన గూర్చి పేర్కొన్న గ్రంథాలు : 

  • 1. నీతిసారం - మొదటి ప్రతాపరుద్రుడు 2. నీతిశాస్త్ర ముక్తావళి - బద్దెన
  • 3. సకల నీతి సమ్మతం మడకసింగన్న
  • 4. విజ్ఞానేశ్వరీయం కేతన

⭐మడికి సింగన్న రచించిన సకలనీతి సమ్మతం" అనే గ్రంథములో అష్టాదశ తీర్థులనే ఉద్యోగుల ప్రస్తావన ఉంది.

⭐రాజోద్యాగాలను నియోగాలుగా విభజించారు.

అన్ని శాఖలను (72 శాఖలు) పర్యవేక్షించే అధికారి "బాహత్తర నియోగాధిపతి" .

⭐తూర్పు చాళుక్యుల కాలం నాటి నియోగాధికృత పదమే వీరి కాలంలోబాహత్తరనియోగాధిపతిగా మారింది.

⭐ఈ కాలంలోని బాహత్తరనియోగాధిపతి పదవి నిర్వహించినవారు

⭐కాయస్థ గంగయసాహిణి (గణపతి దేవుని కాలంలో)

⭐త్రిపురారి, పోంకల మల్లయ (రుద్రమ దేవుని కాలంలో)

⭐అంబదేవ మహారాజు (రెండవ ప్రతాప రుద్రుని కాలంలో)

⭐కాకతీయుల కాలంలో అన్ని కులాల వారు మంత్రులుగా పని చేశారు.

⭐అంతఃపురం రక్షకున్ని "నగరి శ్రీకావళి" అని పిలిచేవారు.

అధికారులు:

  1. తిర్పూరులు  - పండిన పంటపై ప్రభుత్వ శిస్తు నిర్ణయించే అధికారి. 
  2. సుంకాధికారి - పన్నులు వసూలు చేసేవాడు.
  3. నగరి శ్రీకావళి - రాజ భవన ద్వార పాలకుడు.
  4. నగరి అధికారి - రాజప్రసాద పాలనాధ్యక్షుడు
  5. మండలేశ్వర- రాష్ట్రపాలకుడు 
  6. రాజాధ్యక్షుడు- రాజా ప్రతినిధి
  7. శాసనాధికారి - రాజపత్ర రక్షకుడు
  8. సంధి విగ్రహక - విదేశాంగ శాఖ మంత్రి
  9. భట్టారక నియోగాధిపతి - ప్రభుత్వ ఉద్యోగులను పర్యవేక్షించే అధికారి.

పన్నులు (Taxes)

⭐ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం - భూమిశిస్తు 

⭐భూమిశిస్తుకు గల పేరు - అరి

⭐భూమిశిస్తు సాధారణంగా 1/5వ వంతుగా ఉండేది.

వీరి కాలంలో గల సంప్రదాయ పన్నులు

  • 1. దర్శనం - రాజును దర్శించేటప్పుడు ఇచ్చే కానుక
  • 2. ఉపకృతి - రాజుగానీ ఇతర అధికారులు గానీ చేసిన మేలుకు ప్రతిఫలంగా ఇచ్చేది.
  • 3. అప్పనం - అకారణంగా ఇచ్చేది.

⭐సాగు చేసిన భూమిని "వెలిచేను, నీరునేల, తోట భూమి" అనే మూడు తరగతులుగా విభజించేవారు.

⭐ప్రతి పొలాన్ని కొలిచే సాధనం - గడ లేదా దండ ( గడ పొడువు - 32 జేనలు)

న్యాయ పాలన:

⭐ఈ కాలంలో సామాన్యమైన వివాదాలన్నీ గ్రామ సభలలో గ్రామ ప్రభువుచేత పరిష్కరించబడేవి.

⭐గ్రామాలలో దొంగతనాలు జరగకుండా చూసే బాధ్యత - తలారి

⭐శిక్షలు కఠినంగా ఉండేవి.

⭐రాజస్థానాలలో ప్రాడ్వివాకులు అనే ప్రత్యేక న్యాయాధికారులు ఉండేవారు.

సైనిక వ్యవస్థ :

⭐కాకతీయులు సైనిక శక్తికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 

⭐కాకతీయుల సైన్యంలో గజ, తరగ, పదాతి దళాలుండేవి.

⭐గజసాహిణి - గజదళాధ్యక్షుడు

⭐అశ్వసాహిణి - అశ్వ దళాధ్యక్షుడు 

⭐కాకతీయుల సైన్యంలో చక్రవర్తి సైన్యం, నాయంకర సైన్యం అనే రెండు విభాగాలుండేవి.

ఆర్థిక పరిస్థితులు

⭐కాకతీయుల కాలం నాటి ఆర్థిక పరిస్థితుల్ని గురించి పేర్కొన్న విదేశీ యాత్రికులు

  • 1.అమిర్ ఖున్ను 
  • 2. మార్కుపోలో 


కాకతీయులు (క్రీ.శ.1030-1323) kakatiyulu 1

రుద్రదేవుడు (క్రీ.శ. 1158-1195) Rudradeva

గణపతి దేవుడు (క్రీ.శ. 1199-1262) Ganapati Devudu

 రుద్రమదేవి (క్రీ.శ.1262-1289) Rudrama Devi 

రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289-1323)

Post a Comment

0 Comments

Close Menu