గణపతి దేవుడు (క్రీ.శ. 1199-1262) Ganapati Devudu

 గణపతి దేవుడు (క్రీ.శ. 1199-1262)



⭐ఇతను కాకతీయులందరిలో గొప్పవాడు. అధిక సంవత్సరాలు పాలించినవాడు (63సం..) బిరుదులు 

  • 1. సకలదేశ ప్రతిస్థాపనాచార్య (మంథెన శాసనం).
  • 2. రాయగజకేసరి
  • 3. ఆంధ్రాధీశ
  • 4. పృధ్వీశ్వర శిరః కందుక క్రీడావినోద
  • 5. చోడకటక చూరకార (వరంగల్, గిర్మాజీపేట శాసనాలు)

యాదవ రాజైన జైతుగి చేతిలో బంధీగా ఉన్న గణపతి దేవుడిని రక్షించి, సింహాసనంపై కూర్చొపెట్టిన ఘనత రేచెర్ల రుద్రుడిది.

దీనివల్ల కాకతిరాజ్య స్థాపకుడిగా, కాకతీయ రాజ్యధార ధౌరేయగా రేచెర్ల రుద్రుడు ప్రతీతి దేవగిరిలో గణపతి దేవుని మేథస్సును చూసిన 'జైతుగి' అతన్ని విడుదల చేశాడు.

శాతవాహనుల తర్వాత యావదాంధ్ర దేశాన్ని జయించి, పాలించిన ఘనత గణపతిదేవుడిది. 

⭐ గణపతిదేవుడి రాజకీయ గురువు విశ్వేశ్వర శంభు

ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తిచేసి రాజధానిని ఓరుగల్లుకు మార్చాడు (క్రీ.శ. 1254లో)

గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవును అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధి చేసి విదేశీ వర్తకుల రక్షణకొరకు అనేక నియమ నిబంధనలతో 'మోటుపల్లి అభయ శాసనం'ను రూపొందించాడు.

⭐ సిద్ధయ్యదేవుడనే సేనానిని మోటుపల్లి నిర్వహణకు నియమించాడు.

⭐ తిక్కన ఓరుగల్లులో ఉన్న సమయంలో మహాభారతంలో విరాటపర్వం మొదలు 15 పర్వాలను తెలుగులోకి అనువదించాడు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులున్నాయి. ఇతడు నిర్వచనోత్తర రామాయణం రాశాడు.

⭐ బావమరిది జాయపసేనానిని గజదళాధిపతిగా నియమించాడు.

⭐ జాయపసేనాని రచించిన సంస్కృత గ్రంథములు 

  • 1. నృత్యరత్నావళి,
  • 2. గీనారత్నావళి,
  • 3. వాయిద్య రత్నావళి

⭐ గణపతిదేవుని రథ దళాధిపతి గంగయ్య సేనాని

⭐ గణపతి దేవుడు పాశుపత శైవ మతాన్ని ఆచరించాడు. ఈయన శైవమత దీక్షా గురువు విశ్వేశ్వర శైవాచార్య

⭐ గణపతి దేవుడి కాలంలో పాలంపేటలో రేచెర్ల రుద్రుడు సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని (క్రీ.శ. 1213) నిర్మించాడు. రేచర్ల రుద్రుడు చేబ్రోలు శాసనాన్ని వేయించాడు. 


కాకతీయులు (క్రీ.శ.1030-1323) kakatiyulu 1


రుద్రదేవుడు (క్రీ.శ. 1158-1195) Rudradeva

Post a Comment

0 Comments

Close Menu