⭐ఈమె ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి మహిళ.
⭐బిరుదులు
⭐ ఈమె గురువు విశ్వేశ్వర శంభు. ఈయనకు 'మందడ' అనే గ్రామం దానం చేయడమైనది.
⭐రుద్రమదేవి రాజ్య ప్రారంభంలో అంతర్గత తిరుగుబాట్లను అణచి రాజ్య స్థిరీకరణలో ప్రముఖపాత్ర వహించిన రేచెర్ల ప్రసాదిత్యుడు కాకతీయరాజ్య స్థాపనాచార్య, రాయపితామహాంక అనే బిరుదును ధరించినట్లు తెలుస్తుంది.
⭐బీదర్ శాసనం ప్రకారం యాదవ రాజైన మహదేవుడు రుద్రమదేవి చేతిలో ఓడిపోయినట్లు తెలుస్తుంది.యాదవులపై విజయానికి చిహ్నంగా ఓరుగల్లు స్వయంభూ దేవాలయంలో రంగ మండపాన్ని నిర్మించినట్లుచరిత్ర చెబుతుంది.
⭐నిరవద్య పురాధీశ్వరుడైన చాళుక్య వీరభద్రుడు రుద్రమదేవి భర్త
1. ముమ్మడమ్మ ఈమె భర్త మహాదేవుడు
2. రుయ్యమ్మ - ఈమె భర్త అన్నలదేవుడు (ఇందులూరు).ఇతను రుద్రమదేవి సేనాని. మహాప్రధాని.
⭐రుద్రమదేవి పాలన కాలంలోనే వెనీస్ యాత్రికుడైన మార్కొపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు.
⭐రుద్రమదేవి కాలం నాటిదే మల్కాపురం శాసనం. ఈ శాసనం పాశుపత శైవానికి సంబంధించి విలువైన సమాచారాన్ని తెలుపుతుంది.
⭐రుద్రమదేవి కాలంలో ఈమె రాజకీయాధిపత్యాన్ని ధిక్కరించి స్వాతంత్ర్యాన్నిప్రకటించుకున్న సామంతుడు కాయస్థ అంబదేవుడు
⭐కాకతీయులపై అంబదేవుడు విజయం సాధించినట్లు చందుపట్ల (నల్గొండ) శాసనం తెలుపుతుంది.
⭐కాయస్థ అంబదేవుడితో జరిగిన పోరులో రుద్రమతోపాటు ప్రధానసేనాని మల్లిఖార్జునుడు మరణించినట్లు తెలుస్తుంది.
0 Comments