⭐ ఇతను రుద్రమదేవి మనుమడు, ముమ్మడమ్మ, మహదేవుల కుమారుడు
⭐ ఇతను కవి, పండిత పోషకుడు.
⭐ఇతని ఆస్థానకవి - విద్యానాథుడు. ఇతను ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార గ్రంథాన్ని రచించాడు.
⭐ఇతని సేనాని అయిన గన్నారెడ్డికి మారన మార్కండేయపురాణాన్ని అంకితమిచ్చాడు.
⭐సింహాసనాన్ని అధిష్టించగానే తిరుగుబాటు జరుపుతున్న కాయస్థ అంబదేవుని ఓడించాడు.
⭐అంబదేవుని ఓడించడంలో ప్రతాపరుద్రుని తరఫున ఇందులూరి అన్నయమంత్రి ప్రముఖపాత్ర వహించాడు.
⭐ఆడిదంమలు సేనాని నాయకత్వాన నెల్లూరుపై దాడి జరిగింది.
⭐నెల్లూరు పాలకుడైన మనుమగొండ గోపాలుని సంహరించి ఆడిదం మల్లు 'మనుమగొండ గోపాల శిరఃఖండన' అనే బిరుదు వహించాడు.
⭐కాకతి రాజ్య విస్తీర్ణం రెండో ప్రతాపరుద్రుని కాలంలో అత్యున్నత స్థితికి చేరింది. తన పాలనా దక్షతతో దేశ రక్షణకు సైన్యాన్ని సిద్ధం చేయడానికి గణపతి దేవుడు ప్రారంభించిన 'నాయక వ్యవస్థ'ను పునర్నిర్మించాడు.
⭐కంచిపురంపై కాకతీయుల ఆధిపత్యాన్ని స్థాపించాడు.
⭐ఇతని కాలంలో రాజ్యం 77 నాయంకరలు( సైనికవిభాగాలు) గా విభజితమై ఉండేది.
⭐నాయంకరలు అధికంగా పద్మనాయకులు అనే కులానికి చెందినవారు. నాయంకరులకు వారి ఆధీనంలోఉండే ప్రాంతాలలో పన్ను వసూలు చేసే అధికారంతో పాటు శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యత ఉండేది .
⭐ఇతని కాలంలో మాచలదేవి కళాకారిణి ఉండేది. ఈమె పేరిణి నృత్యకారిణి.
⭐సమ్మక్క సారక్క ఇతనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.
0 Comments