కాకతీయుల పరిపాలనా విధానం : 2 (kakatiya administration)

కాకతీయుల పరిపాలనా విధానం : 1

                                      

వ్యవసాయం:

⭐ ప్రజల ప్రధాన వృత్తి - వ్యవసాయం

⭐కాకతీయ రాజులు, వారి సామంతులు పెద్ద పెద్ద చెరువులను నిర్మించి నీటి పారుదల సౌకర్యాలను కల్పించారు.

⭐1వ ప్రోలరాజు తవ్వించిన సముద్రాలు : 

  • 1. సెట్టి సముద్రం
  • 2. కెరె సముద్రం
  • 3. జగత్ కేసరి సముద్రం

⭐గణపతి దేవుని సేనాని రుద్రుడు "పాకాల చెరువు"ను త్రవ్వించాడు.

⭐ రామప్ప చెరువును రేచర్ల రుద్రుడు త్రవ్వించాడు.

⭐ప్రతాపరుద్రుని కాలంలో అడవులను నరికించి విశాల భూభాగాలను సాగులోకి తెచ్చాడు. వీరి పరిపాలనాకాలంలో పండించిన ప్రధాన పంటలు: వరి, గోధుమ, కొర్రలు, జొన్నలు, పెసాలు , కందులు, చెరుకు, నూనెగింజలు 

⭐ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం తయారైనట్లు మార్కొపోలో రచనల వల్ల తెలుస్తున్నది.

పరిశ్రమలు:

⭐ ప్రాచీన కాలం నుండి ఆంధ్రదేశం సన్నని వస్త్రాలకు, చీరలకు ప్రసిద్ధి చెందినది.

⭐పాల్కూరి సోమనాథుడు తన "పండితారాధ్య చరిత్ర" అనే గ్రంథంలో ఇరవైకి పైగా వస్త్రాలను పేర్కొన్నాడు.

⭐మైసోలియ (మచిలీపట్నం) ప్రాంతం వస్త్ర తయారీకి ప్రసిద్ధి అని ప్లీని పేర్కొన్నాడు.

⭐ప్రధానపరిశ్రమలు - ప్రాంతాలు:

⭐ఓరుగల్లు -రత్నకంబళులు, ముఖ్మల్ వస్త్రాలు

⭐గుత్తికొండ, పల్నాటిసీమ- ఇనుప పరిశ్రమ 

⭐నిర్మల్ - డమాస్కస్ కత్తులు. 

⭐గోల్కొండ -వజ్రాల గనులు (మార్క్ పోలో ప్రకారం)

⭐మోటుపల్లిలో గణపతిదేవుడు అభయశాసనం వేయించాడు.

⭐కాకతీయుల కాలం నాటి ఎగుమతులు, దిగుమతుల గూర్చి మోటుపల్లి శాసనంతెలుపుతుంది. 

ఎగుమతులు : 

⭐చందనం, పోకలు, కర్పూర తైలం, దంతాలు, ముత్యాలు, పగడాలు, పునుగు, మిరియాలు ,హారతి కర్పూరం

⭐దిగుమతులు

  • సిల్కు వస్త్రాలు, 
  • చైనా కర్పూరం,
  • గులాబీ అత్తరు 
  • అరబిక్ గుర్రాలు

మార్కొపోలో ప్రకారం ఎగుమతులు : 

  • 1.వజ్రాలు 
  •  2. సన్నని వస్త్రాలు

ఎగుమతి, దిగుమతులపై సుంకం - 1/30వ వంతు

వీరి కాలంలో వడ్డీ 12% కంటే ఎక్కువ ఉండేది కాదు.

విదేశీ, దేశీయ వాణిజ్యాన్ని వైశ్యులు, బలిజ సెట్లు నిర్వహించేవారు.

నాణేలు 

⭐ కాకతీయుల కాలంలో నాణేలు ఎక్కువగా లభించిన ఆధారాలు లేవు. 

⭐ శాసనాలలో, సాహిత్యంలో నాణేల ప్రస్తావన ఉండేది.

⭐ నాణేలలో మిక్కిలి పెద్ద నాణెము - గద్యాణము లేదా నిష్కం  లేదా మాడ

 బంగారు నాణెం - గద్యాణము 

⭐ వెండి నాణెం - రూక

సాంఘిక పరిస్థితులు:

⭐ కాకతీయుల కాలాన్ని "శూద్రయుగం" అంటారు

సంఘం 

⭐ కాకతీయుల కాలం నాటి సంఘంలో గల ప్రధాన కులాలు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర

⭐ కాకతీయుల కాలంలో వృత్తులను బట్టి అనేక కులాలను విభజించారు. 

⭐ బ్రాహ్మణులు: 

  • 1. నియోగ బ్రాహ్మణులు
  • 2. వైదిక బ్రాహ్మణులు

కుల సంఘాలు :

⭐ కాకతీయుల సాంఘిక జీవనానికి ప్రధాన లక్షణం - కుల సంఘాలు

⭐ కాకతీయుల కాలంలో గల కుల సంఘాలను "సమయాలు” అని పిలిచేవారు. 

⭐ బ్రాహ్మణ సమయం - మహజనులు

⭐ వైశ్య సమయం  - వైశ్యనకరం

⭐ ప్రతి సమయానికి సమయాచారం, కుల కట్టుబాట్లు ఉండేవి. 

⭐ ప్రతి సమయానికి పన్నులు విధించే, దోషులను శిక్షించే అధికారం కలదు.

సాంఘిక దురాచారాలు:

⭐ ఈ కాలంలో సమాజంలో అనేక దురాచారాలు ఉన్నాయి.

⭐ ప్రధాన సాంఘిక దురాచారాలు : 

  • 1. బాల్య వివాహం    
  • 2. వరకట్నం
  • 3. కన్యాశుల్కం       
  • 4. నిర్బంధ వైదవ్యం

⭐ జూదం, మద్యపానం, కోడిపందేలు, పొట్టేళ్ల పందేలు వంటి చెడు అలవాట్లకు బానిసలైనారు.

⭐ వేశ్యలకు సంఘంలో గౌరవ ప్రదమైన స్థానం ఉండేది. 

మత పరిస్థితులు:

⭐ కాకతీయుల కాలం నాటికి బౌద్ధమతం దాదాపు క్షీణించిపోయింది. కానీ జైనమతం ప్రబలంగా ఉంది. 

⭐ ఈ కాలంలో సమాజంపై ఆధిపత్యం కోసం జైన, శైవ, వైష్ణవ మతాలు పోటీపడ్డాయి.

⭐ ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో జైనమతాన్ని ధ్వసం చేసినవారు వీరశైవులు

⭐  క్రీ.శ. 1200 నాటికి శైవ, వైష్ణవ మతాలు మాత్రమే మిగిలాయి.

కాకతీయులు (క్రీ.శ.1030-1323) kakatiyulu 1

రుద్రదేవుడు (క్రీ.శ. 1158-1195) Rudradeva

గణపతి దేవుడు (క్రీ.శ. 1199-1262) Ganapati Devudu

 రుద్రమదేవి (క్రీ.శ.1262-1289) Rudrama Devi 

రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289-1323)

కాకతీయుల పరిపాలనా విధానం : 1 (kakatiya administration)

కాకతీయుల పరిపాలనా విధానం : 2 (kakatiya administration)

Post a Comment

0 Comments

Close Menu