⭐తమిళుల చరిత్ర సంగం యుగంతో ప్రారంభమవుతుంది.
⭐సంగం అంటే పరిషత్తు, కూడలి లేదా సమావేశం అని అర్థం.
⭐దీనిని ప్రాచీన కాలంలో పాండ్య ప్రభువులు మధురైలో ఏర్పాటు చేయడం జరిగింది.
⭐ఇందులోని వందలకొద్ది కవులు సృష్టించిన సారస్వతమే సంగమ వాజ్ఞయంగా ప్రసిద్ధికెక్కింది.
⭐ఈ వాజ్ఞయంలో తమిళదేశ సంస్కృతి స్పష్టంగా ప్రతిబింభిస్తుంది.
⭐గొప్పగా ప్రసిద్ధి చెందిన సంగమ యుగం నాటి రాజ్యాలు :
1.చోళవంశం
2.చేర వంశం
3.పాండ్య వంశం
⭐దక్షిణ భారతదేశంలో వెలసిన చోళ, పాండ్య మరియు చేర అనే ఈ తమిళ రాజ్యాలు తమిళభాషను మరియు సాహిత్యంను అభివృద్ధి చేసినవి.
⭐అశోకుని 13వ ప్రధాన శిలా శాసనం
⭐మెగస్తనీస్ రచనలు
⭐ఖారవేలుని హథిగుంప శాసనం
⭐చోళ, చేర, పాండ్య రాజ్యాలు మౌర్య సామ్రాజ్యంలో లేవని అవి ప్రత్యేకమని పేర్కొన్న తమిళ గ్రంథం _ మామూళ్లనార్
⭐ఈ మూడు రాజ్యాలు కలిసిన ప్రాంతాన్ని ప్రాచీన వాజ్ఞయంలో తమిళం లేదా ద్రావిడ దేశం అని వ్యవ జరిగింది.
⭐ఈ మూడు రాజ్యాల రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో మొదట చోళులు విజయం సాధించి రాజకీయ అధిపత్యాన్ని చేపట్టినారు.
1. రామచంద్ర దీక్షితార్- క్రీ.పూ. 6వ శతాబ్దం నుంచి 5వ శతాబ్ద మధ్య కాలం అని
2. ఎన్. సుబ్రమణియన్ - క్రీ.పూ. 4వ శతాబ్దం నుంచి 3వ శతాబ్ద మధ్య కాలం అని
3. ఆచార్య నీలకంఠ శాస్త్రి - క్రీ.శ. మొదటి 3 శతాబ్దాలకు చెందినదని పేర్కొన్నారు.
⭐చోళ రాజ్యం విస్తరించిన ప్రాంతం : ఉత్తర తమిళనాడు
⭐చేర రాజ్యం విస్తరించిన ప్రాంతం: కేరళ ప్రాంతం
⭐పాండ్య రాజ్యం విస్తరించిన ప్రాంతం: దక్షిణ తమిళనాడు
⭐చోళ సామ్రాజ్య స్థాపకుడు : ఎలారా
⭐చేర సామ్రాజ్య స్థాపకుడు : యుధివంజారాల్
⭐పాండ్య సామ్రాజ్య స్థాపకుడు : ముదికుడిమి
⭐చోళ సామ్రాజ్యము లో గొప్పవాడు : కరికాళ చోళ
⭐చేర సామ్రాజ్యము లో గొప్పవాడు : సెంగుత్తవాన్
⭐పాండ్య సామ్రాజ్యము లో గొప్పవాడు : నెడుంజలియన్
⭐చోళ సామ్రాజ్య రాజధాని : ఉరయూర్
⭐చేర సామ్రాజ్య రాజధాని : వంజి /కరూర్
⭐పాండ్య సామ్రాజ్య రాజధాని : మధురై
⭐చోళ సామ్రాజ్య రాజ్య లాంఛనము : పులి
⭐చేర సామ్రాజ్య రాజ్య లాంఛనము : విల్లు & బాణము
⭐పాండ్య సామ్రాజ్య రాజ్య లాంఛనము : చేప
0 Comments