🔯బ్రహ్మ పుత్ర నది హిమాలయ నదీ వ్యవస్థలలో అతి పురాతనమైన నది మరియు పొడవైనది. భారతదేశం గుండా ప్రవహించే నదులలో పొడవైన నది - బ్రహ్మపుత్ర నది.( 2990 కి.మీ.)
🔯 భారతదేశంలో పొడవైన నది - గంగా నది. ( 2415 కి.మీ.)
🔯బ్రహ్మ పుత్ర నది టిబెట్ లోని కైలాస కొండల్లోని మానస సరోవరం వద్ద గల షమ్ యంగ్ డమ్ అనే హిమానీ నదం వద్ద జన్మిస్తుంది.
🔯 బ్రహ్మ పుత్ర నది సింధూ నదికి వ్యతిరేఖ దిశలో టిబెట్ ప్రాంతంలో తూర్పు దిశగా పయనించి, ప్రధానంగా చైనాలోని టిబెట్, భారత్, బంగ్లాదేశ్లో సుమారు 2990 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.
🔯ఇటీవలి కాలంలో చైనా దేశం వారు బ్రహ్మ పుత్ర నది జన్మస్థానం అంగ్సి ప్రాంతంగా గుర్తించారు. దీని కారణంగా ఈ నది పొడవు సుమారు 3,848 కి. మీ. గా ఉంది.
🔯 బ్రహ్మ పుత్ర నది మొత్తం పరీవాహక ప్రాంతం 5,80,000 చ.కి.మీ.
🔯 మన దేశంలో బ్రహ్మ పుత్ర నది పరీవాహక ప్రాంతం - 1,94,413 చ.కి.మీ.
🔯మన దేశంలో బ్రహ్మ పుత్ర నది రెండు (అరుణాచల్ ప్రదేశ్ మరియు అసోం) రాష్ట్రాలలో సమారు 916 కి.మీ ల పొడవున ప్రయాణిస్తుంది.
🔯బ్రహ్మ పుత్ర నది ప్రధానంగా 3 దేశాలు (చైనా, భారత్ మరియు బంగ్లాదేశ్ ) గుండా ప్రయాణిస్తుంది.
🔯బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లో గంగానదితో కలిసి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగ్లాదేశ్లో గంగానదిని పద్మానదిగా పిలుస్తారు.
🔯బ్రహ్మపుత్ర నది టిబెట్ను దాటి భారత్లో అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చాబర్వా శిఖరం వద్ద 'యూ' ఆకారంలో తిరిగి, జిదా (అరుణాచల్ ప్రదేశ్)లో ప్రవేశిస్తుంది. అనంతరం అసోంలోని సాదియా మైదాన ప్రాంతం గుండా భారత్లో ప్రవహించి తదుపరి బంగ్లాదేశ్లోనికి ప్రవేశిస్తుంది.
🔯బ్రహ్మపుత్ర నది దుబ్రి అనే ప్రాంతం వద్ద బంగ్లాదేశ్లోనికి ప్రవేశించి జమునా నదిగా పిలవబడి, తదుపరి గోలుండో వద్ద పద్మానదితో కలిసి మేఘనా నదిగా పిలవబడి చివరగా బ్రహ్మపుత్ర నది డాఖిన్ షాదీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
🔯బ్రహ్మపుత్ర నది ప్రయాణించే మార్గంలో దీన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.... చైనాలో - యార్లుంగ్ జంగ్ పో అని,
🔯అసోంలోని ఎర్ర నేలల మీదుగా ప్రవహించడం వల్ల బ్రహ్మపుత్ర నదిని ఎర్ర నది అని కూడాపిలుస్తారు.
🔯ప్రపంచంలోని అతి పెద్ద సుంబర్బన్స్ డెల్టా... బ్రహ్మపుత్ర, గంగా నదుల కలయిక వల్ల ఏర్పడింది..
🔯భారతదేశంలో గల ఏకైక నదీ ఆధారిత దీవి మాజూలీ బ్రహ్మపుత్ర నది వల్లే ఏర్పడింది. బ్రహ్మపుత్ర నది వరదల వలన అధికంగా నష్టపోతున్న రాష్ట్రం అసోం.
🔯 కావున బ్రహ్మపుత్ర నదిని అసోం దుఃఖదాయని అని పిలుస్తారు.
🔯 భారతదేశంలో ప్రవహించే నదులలో మగవారి పేరుమీద ఉన్న ఏకైక నది - బ్రహ్మపుత్ర నది
🔯 బ్రహ్మపుత్ర నదికి గల పర్వతీయ ఉపనది - రాగా త్సాంగ్ పో
🔯 బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన లోహిత్ నదిపై దేశంలోనే పొడవైన దోలా - సాదియా వారధిని నిర్మించారు.
🔯 ఈ వారధినే భూపేన్ హజారికా వారథిగా పిలుస్తారు. ఈ వారధి అరుణాచల్ ప్రదేశ్ - అసోం రాష్ట్రాలను కలుపుతుంది.
🔯 తీస్తా నది టిబెట్లోని చితము సరస్సు వద్ద జన్మిస్తుంది.
🔯 తీస్తా నది 1887 వరకు గంగా నది ఉపనదిగా ఉండేది. కానీ 1887లో వచ్చిన భూకంపం వల్ల దీని ప్రవాహ దిశ మారి బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా మారింది.
🔯 తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది.
0 Comments