సింధూ నాగరికత Chanhudaro ,Kalibangan, lothal,banawali ,Kozhikode

సింధూ నాగరికత Chanhudaro ,Kalibangan,lothal ,banawali ,Kozhikode



చన్హుదారో (Chanhudaro)

⭐ ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి : ఎన్.జి. మజుందార్ (1931) 

⭐  ఇచట త్రవ్వకాలు జరిపినది: ఇ.జె.హెచ్. మెక్కే

⭐  ప్రదేశం : చన్హుదారో, సింధ్ రాష్ట్రం, పాకిస్తాన్

⭐  మూడుసార్లు వరదలకు గురైన నగరం.

⭐  నది : సింధు

⭐  ఈ నగరాన్ని భారతదేశ  లాంక్ షోర్   పేర్కొంటారు. 

⭐  ఇది దుర్గం లేని ఏకైక నగరం. (కోట గోడ లేని ఏకైక నగరం)

⭐  పూసల తయారికీ ప్రసిద్ధి చెందిన నగరం - చన్హుదారో (పారిశ్రామిక పట్టణం)

⭐  రాగితో తయారైన ఇనుప పరికరాలు ఇచట లభించినవి..

⭐ ఇక్కడ ఇంక్ బాటిల్ను పోలిన మట్టి పాత్ర లభ్యమైంది. పిల్లికి సంబంధించిన ఆధారాలు లభించినవి.

⭐  భూగర్భ మురికి నీటి వ్యవస్థ గల నగరం.

⭐  చనుదారోను బొమ్మల కేంద్రంగా పిలుస్తారు.

⭐ టెర్ర కోట ఎద్దుల బండి, కంచు బొమ్మ బండి, నటరాజ విగ్రహం, లిఫ్ స్టిక్ లు లభించినవి .


కాళీభంగన్(Kalibangan)



⭐ ఇక్కడి త్రవ్వకాలకు అనుమతి ఇచ్చినది అమలానంద ఘోష్

⭐ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తులు : బి.బి. లాల , బే.కె.థాపర్ (1961-69) 

⭐ప్రదేశం: కాళీభంగన్ (శ్రీ గంగాపూర్ జిల్లా, రాజస్థాన్)

నది : ఘగ్గర్ (సరస్వతి)

⭐కాళీభంగన్ అనగా నల్లగాజులు అని అర్ధం.

⭐ఇది గాజుల తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం.

⭐ఇక్కడ దుర్గంతో పాటు నగరం మొత్తానికి ప్రహారి గోడ కలదు.

⭐ఇక్కడ యజ్ఞయాగాదులు నిర్వహించిన గుర్తులు లభ్యమైనాయి.

⭐భూమిని దున్నిన ఆధారం (నాగలి గుర్తులు) లభించాయి.

⭐ఇక్కడ  తందూరి  పొయ్యిలను కనుగొన్నారు.

నోట్: ఇది భారతదేశంలో రొట్టెల తయారీకి 5000 సంవత్సరాల చరిత్ర ఉందని సూచిస్తుంది. 

⭐ఈ నగరం భూకంపం వచ్చినట్లుగా ఆధారాలు లభించాయి. సర్పలేఖనం (హరప్పా లిపి గుర్తు) లభించింది.

⭐ఒంటె అవశేషాలు, ఇటుకలతో నిర్మించిన సమాధుల ఆనవాళ్ళు లభించాయి.

⭐ ఇచట 3 విధాలైన అంత్యక్రియ పద్ధతులు బయటపడినవి: 

  • 1. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న గోతులో వివిధ వస్తువులతో పూడ్చిన సమాధులు. 
  • 2. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న గోతులో, శవం లేకుండా పూర్చిన వస్తువులు (కాల్చిన గాజులు, శివ లింగం
  • 3. వృత్తాకారంలో ఉన్న గోతులు, వీటిలో పెద్ద జాడీలు, కుండలు.

లోథాల్ (lothal)



⭐ ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి -ఎస్.ఆర్.రావు (1955)

⭐ ప్రదేశం: లోధాల్, అహ్మదాబాద్ జిల్లా (గుజరాత్).   నది : భాగావో

⭐ఈ నగరంను మినీ హరప్పా నాగరికత నగరం లేదా కాస్మోపాలిటన్ నగరం అని కూడా అంటారు.

⭐ గుజరాతీ భాషలో లోథాల్ అనగా మృతుల దిబ్బ అని అర్థం.

⭐ఇది హరప్పా నాగరికతలో ఏకైక సహజ ఓడరేవు (టైడల్ పోర్ట్) గల నగరం.

⭐ కాల్చిన ఇటుకలతో కట్టిన ఓడల మరమ్మత్తు కేంద్రం, అగ్ని గుండాలు, రంగులు వేసిన జాడీలు లభించినవి. 

⭐ఇక్కడ యజ్ఞయాగాధులు నిర్వహించిన గుర్తులు లభ్యమైనవి.

⭐ఇక్కడ విదేశీ ప్రతిమలు (సిల్స్), చదరంగం ఆడిన గుర్తులు లభ్యమైనవి.

ఇక్కడ వరి పొట్టు అవశేషాలు, కంచుతో తయారు చేసిన కొలబద్ద లభ్యమైనది.

⭐స్త్రీ, పురుషుల శరీరాలను ఒకే సమాధిలో ఖననం చేసిన అనవాళ్ళు ఇచట లభించాయి.

⭐అలంకార ప్రాయమైన మృణ్మయ పాత్రలు లభ్యమైనవి.

⭐ఇది పూసల తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం (రెండు జాడీల నిండా 600 పూసలు లభించినవి)

⭐పర్షియన్ గల్ఫ్ ముద్రిక లోథాల్లో లభించింది. ఇది విదేశీ వాణిజ్యం గురించి తెలుపుతుంది.

బన్వాలీ (banawali )



⭐ ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి : ఆర్.ఎస్.బిస్ట్  (1974-77) 

⭐ ప్రదేశం: బన్వాలీ, హిస్సార్ జిల్లా (హర్యానా)   నది : సరస్వతి

 ⭐గ్రిడ్ వ్యవస్థ ప్రకారం నిర్మాణం జరగని ఏకైక పట్టణం - బన్వాలీ

⭐ఇది హరప్పా నగరాల ఆకారానికి భిన్నమైన ఆకారం కలిగినది, వృత్తాకార పట్టణ ప్రణాళిక కలదు. 

⭐నాణ్యమైన బార్లీ విత్తనాలు లభ్యమైనవి. 11 గదులు కలిగిన భవనం బయటపడింది.

⭐కుమ్మరి చక్రం, పులిముద్రలు, మట్టిపూసలు, పీపల్ ఆకు ఆకారంలో గల చెవి రింగులు బయటపడినవి. 

⭐ బార్లీ, ఆవాలు పండించిన ఆధారాలు లభించినవి.

⭐12 పులుల తలలతో కూడిన ముద్రలు, నాగేటి చాలు ప్రాంతం, టెర్రకొట్టాతో చేసిన నాగలి నమూనా దొరికింది 

⭐సరియైన పట్టణ ప్రణాళిక, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు లభించినవి.

కొట్ డిజియన్ (Kozhikode )

⭐ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి ఎఫ్.ఎ.ఖాన్ (1955-57)

⭐ప్రదేశం : మొహెంజొదారోకు 50 కి.మీ. తూర్పున ఉంది. నది సింధు

⭐మట్టి ఇటుకలతో  కట్టిన గోడలు, విశాలమైన ఇండ్లు, గడ్డితో కప్పిన ఇంటి పైకప్పులు గల ఆనవాళ్ళు లభించాయి

⭐టెర్రకోట్టా  ఎద్దుల బండి.

కంచు కడియం, కాంస్య గాజులు, లోహపు పనిముట్లు లభించినవి. 

⭐అత్తి ఆకు, నెమళ్ళు, జింక, సూర్యుని చిహ్నాలతో చిత్రించిన మట్టి పాత్రలు లభించినవి..


👉 చరిత్ర ,చరిత్ర ఆధారాలు 

👉 చరిత్ర (History )- పరిచయం

👉 చరిత్ర ఆధారాలు  Inscriptions

👉 చరిత్ర ఆధారాలు  Literary Sources

👉 సింధు నాగరికత (Indus Valley Civilisation)

👉 సింధూ నాగరికత Chanhudaro ,Kalibangan, lothal,banawali ,Kozhikode

Post a Comment

0 Comments

Close Menu