చేర సామ్రాజ్యం (Chera dynasty)

 చేర సామ్రాజ్యం



⭐మరో పేరు -కేరళ రాజ్యం

⭐వీరి రాజధాని-వంజి (ప్రస్తుతం కేరళలోని తిరువాంజి కులమ్ మరియు కరూర్)

⭐వీరి రాజచిహ్నం - ధనస్సు

⭐ఓడరేవు- కంగనూర్

⭐ఉత్తరాన - కొచ్చిన్ 

⭐దక్షిణాన- తిరువాన్కూర్ల మధ్యనున్న ప్రాంతంచేరరాజ్యాం.

⭐చేరవంశంలో మొట్టమొదటి పాలకుడు - ఉదివాంజెరల్ (ఇతని కుమారుడు నెడుంజెరల్)

నెడుంజెరల్

⭐నెడుంజెరల్ ఆడాన్ హిమాలయాల వరకు రాజ్యాన్ని విస్తరింపచేసి అధిరాజు అనే బిరుదును పొందాడు. 

⭐ఏడుగురు రాజుల కూటమిని ఓడించిన చేరరాజు- నేదుంజేరల్ ఆడాన్

⭐నెడుంజేరల్ ఆడాన్ బిరుదు - హిమయవరంబన్ (హిమాలయాలు సరిహద్దుగా గలవాడు)

⭐ నెడుంజేరల్ ఆదాన్ సోదరులైన కుట్టుపన్ 25 సం॥రాలు పాలించాడు. కొంగు దేశాన్ని ఓడించి చేర రాజ్యాన్నిపడమట సముద్రం నుండి తూర్పు సముద్రం వరకు వ్యాపింపచేశాడు.

⭐ఇతని వల్ల చోళ రాజకుమారికి ఇద్దరు కుమారులు జన్మించారు. 

1. ఇళంగో అడిగల్: ఇతని గ్రంథం - శిలప్పాధికారం

2. సెంగుత్తవాన్

సెంగుత్తవాన్

⭐సెంగుత్తవాన్ క్రీ.శ. 160 నుండి పాలించాడు. ఇతని బిరుదు : ఎర్రచేప

⭐ఆ కాలం నాటి గొప్పకవి అయిన పారనార్కు ఇతను సమకాలికుడు. 

⭐ఇతను మొత్తం సంగమ యుగంతో పాటు చేరలలో ముఖ్య పరిపాలకుడు -సెంగుత్తవాన్ (ఎర్రచేర)

⭐కేరళలో మహాపతివ్రత అయిన కన్నగి (పత్తిణిదేవి) ఆరాధనను ప్రవేశపెట్టినది -సెంగుత్తవాన్

⭐ఇతను కరూర్లో కన్నగి కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాడు.

 ⭐ఇతడి సోదరుడైన ఇళంగో అడిగల్ రాసిన శిలప్పాధికారం చేర పాలకుల నౌకదళాన్ని, వారి విజయాలను వర్ణిస్తుంది 

⭐శిలప్పాధిగారంలో సెంగుత్తవాన్ సముద్రాన్ని వెనక్కు తరిమాడనే కథ సూచిస్తున్న అంశం చేర రాజుల నౌకాబలం ను  సూచిస్తుంది. చేర రాజుల వర్తక రేవు పట్టణం - కంగనూర్

Post a Comment

0 Comments

Close Menu