Chola dynasty (చోళులు )

 చోళులు 



⭐తమిళ రాజ్యాలలో మొదట సార్వభౌమత్వం వహించిన రాజ్యం - ప్రాచీన చోళ రాజ్యం

⭐వంశ మూలపురుషుడు - కరికాళ చోళుడు

⭐మొదటి రాజధాని - ఉరయూరు

⭐కరికాల చోళుని మతం -శైవమతం

⭐చోళులలో ప్రసిద్ధుడు -కరికాల చోళుడు.

⭐రెండవ రాజధాని - పుహర్ (కావేరి పట్టణం )

⭐రాజచిహ్నం- పులి

⭐ఆర్కాట్ నుంచి తిరుచునాపల్లి వరకు ఉన్న కావేరీనది డెల్టాతో కూడినదే చోళరాజ్యం. చోళరాజులలో కరికాళ చోళుడు సుప్రసిద్ధుడు.

⭐కరికాల చోళుని చరిత్రను తెలుపుతున్న గ్రంథం - పట్టిన పాలై (కావేరి పట్టణంపై దీర్ఘకావ్యం) కరికాళుడు అనగా కాలిన కాలు కలవాడని (లేదా) శత్రు గజాలకు మృత్యువు లాంటి వాడని అర్ధం

⭐కరికాలుడు వైదిక మతాన్నిఆచరించి అనేక యాగాలను నిర్వహించాడు.

⭐కరికాల చోళుడు నిర్మించిన పట్టణం - కావేరి పట్టణం

⭐కావేరి  పట్టణాన్ని ప్రాచీన గ్రంథాలు పిలిచినతీరు - పుహార్ (కావేరీ పట్టణం)

సింహళం (శ్రీలంక) పై దండెత్తిన మొదటి చోళరాజు - కరికాళ చోళుడు

⭐కరికాలుడు శ్రీలంకను ముట్టడించి శ్రీలంక నుంచి 12వేల మందిని బందీగా పట్టుకొని తన సామ్రాజ్యంలో కావేరి నదీకి కట్టదలచిన నీటిపారుదల నిర్మాణంలో పని చేయడానికి తీసుకు వచ్చాడు.

⭐సింహళ బానిసలచే కరికాలుడు నిర్మించిన నిర్మాణం: కావేరి నదికి 160 కి.మీ పొడవున కట్ట  

⭐కరికాల చోళుడు 7 సముద్రాల రాజుగా ప్రసిద్ధి చెందినాడు.

⭐కరికాలుడు చేర, పాండ్య కూటమిని ఓడించిన సుప్రసిద్ధ యుద్ధం -వెన్నియుద్దం

⭐కరికాలుడు తొమ్మిది మంది రాజుల కూటమిని ఓడించిన యుద్ధం -వహైప్పరందలి యుద్ధం

⭐చోళ రాజ్యంలో పత్తి వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన వాణిజ్య కేంద్రం - ఉరైయూర్

⭐కరికాల చోళుడి ముఖ్య నౌకా కేంద్రం :పుహార్

⭐కరికాల చోళుడి తరువాత అతని మనవడు నెడెమిడి కిల్లిరాజ్యానికి వచ్చాడు. 

⭐నెడుమిడికిల్లి రాజ్యంపై సముద్రపు దొంగలు దాడిచేసి రాజధానిని కొల్లగొట్టారు.

⭐ప్రాచీన చోళులపై పల్లవులు, కేరళులు, పాండ్యులు, కలభ్రులు దాడి చేయడంతో ప్రాచీన చోళరాజ్యం అంతమైనది

⭐తదుపరి తిరిగి 9వ శతాబ్దంలో నవీనచోళ సామ్రాజ్యం స్థాపించబడినది.

⭐తొండై మండలము కరికాలుని కాలంలో చోళుల అధికారంలోకి వచ్చింది. దాని రాజధాని కాంచీపురం.

⭐ఈ ప్రాంతపు ప్రజలను తొండైయార్ అని, వారి రాజును తొండైమాన్ చక్రవర్తిగా పిలుస్తారు. 



Post a Comment

0 Comments

Close Menu