సింధు నాగరికత సమాజం (civilization society)

 సింధు నాగరికత కాలం నాటి సమాజం



🌟 సింధు నాగరికత నిర్మాణాలలో ముఖ్యమైనవారు 

  1. ఫొటో ఆస్ట్రలాయిడ్స్
  2. మంగోలాయిడ్స్
  3. మెడిటేరియన్స్
  4. అల్ఫానాయిడ్స్ 

🌟వీరిలో మెడిటేరియన్స్ ప్రధానమైనవారు.

🌟 సింధు ప్రజలలో ఎక్కువ భాగం: జాతి -ద్రావిడ జాతి

 🌟తెగ -మెడిటేరియన్స్

🌟 ఆచార్య భాష్యం ప్రకారం తొలుత ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, తరువాత మెడిటేరియన్స్ వచ్చారు. 

🌟సింధు ప్రజలు ద్రావిడులు అని ఫాదర్ హీరాన్ ప్రతిపాదించాడు.

🌟 వీరి సమాజంలో అనేక వర్గాల వారు ఉండేవారు. 

ఉదా: వ్యాపారులు, మత గురువులు, అధికారులు, పాలకులు, వ్యవసాయదారులు, ఇటుకల తయారీదారులు, టెర్రా కోట బొమ్మల తయారీదారులు. అలా అనేక వృత్తుల ప్రజలు ఉండేవారు.

🌟 ఉన్నత స్థానం పొందిన వర్గం -తాపీమేస్త్రీలు 

🌟ఇక్కడ పక్షుల వేటకు ఉపయోగపడే చిన్న చిన్న మట్టి కుండలు, కోడిపందాల బొమ్మలు బయటపడ్డాయి.

🌟ఒక స్త్రీ, ఒక ఎద్దు ముందు నాట్యం చేయడాన్ని బట్టి ఈ విధానమే దేవదాసి విధానానికి దారితీసి ఉంటుందని దయారాం సహానీ పేర్కొంటాడు.

🌟 పాత్రలపైన చెట్ల బొమ్మలు, వృత్తాలు వంటి కళ కనిపిస్తుంది. 

🌟 తాయెత్తులు తయారు చేసేవారు.

🌟 స్వస్తిక్ అదృష్టానికి గుర్తుగా పరిగణింపబడేది. (ఇది సర్వాభివృద్ధికి చిహ్నం)

🌟 ఇది పూర్తిగా వర్గసమాజము కాదు అలాగే వర్ణ సమాజము అసలే కాదు.

🌟 స్త్రీకి సముచితమైన స్థానం ఉన్నట్లు చరిత్రకారుల అభిప్రాయం.

🌟 వీరి సమాజం మాతృసామ్య వ్యవస్థను కలిగి ఉంది.

🌟 మాతృస్వామిక సమాజంగా ఉండేదని పేర్కొన్నది -సర్ జాన్ మార్షల్

🌟ఇక్కడ సామాజిక వ్యత్యాసాలు లేవు కానీ ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి. 

🌟హరప్పాలో ధనవంతుల ఇళ్ళు, శ్రామికుల ఇళ్ళువేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. 

🌟ధనికుల ఇండ్లు సాపేక్షంగా పెద్ద ప్రాంతంలో చుట్టూ ప్రహరీతో, కాల్చిన ఇటుకలతో, స్వంత బావితో, విశాలమైనగదులతో నిర్మితమై ఉన్నాయి.

🌟 ధనికులు పెద్దపెద్ద గృహాలు, రెండు అంతస్థుల భవనాలలో నివసించేవారు.

🌟సామాన్యులు రెండు గదుల ఇళ్లల్లో కూలీలు ఒక గది ఇళ్లల్లో నివసించేవారు.

🌟నగరం పశ్చిమాన పెద్దపెద్ద (పరిపాలనా) భవనాలు, తూర్పున సాధారణ నివాసాలున్నాయి. రహదారులకు ఎదురెదురుగా కిటికీలు గానీ, వాకిళ్లు గానీ లేవు. శబ్ద కాలుష్యం నుంచి రక్షణకు అలా చేసి ఉండొచ్చు. 

🌟కాల్చిన ఇటుకలతో ఇంగ్లీష్ బాండ్ అనే తాపీ విధానంలో ఇళ్లను నిర్మించారు.

🌟సింధు నగరాలు ఇంగ్లాండులోని లాంకషైర్ నగరాన్ని పోలి ఉన్నాయని సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు. 

🌟 సింధు పట్టణాల్లో పైన తెలిపిన సాధారణ లక్షణాలకు భిన్నంగా ఉన్న పట్టణాలు:

  • బన్వాలీ (హర్యానా) :
  • 🌟వంకర టింకర రోడ్లు గల నగరం, భూగర్భ మురుగునీటి పారుదల లేని                       నగరం.వృత్తాకారంలో నిర్మించబడిన నగరం. 
  • ధోలావేరా
  • 🌟 మూడు భాగాలు (ఎగువ, మధ్య, దిగువ) కలిగిని ఏకైక నగరం.
  • చిన్చుదారో :
  • 🌟పశ్చిమ వైపు పెద్ద భవనాలు (కోట) లేని నగరం, రక్షణ గోడలేని నగరం.
  • లోథాల్
  • 🌟 వీధి వైపు వాకిళ్లు (ద్యారాలు )గృహాలు కలవు.

వినోదం:

🌟వీరి ప్రధాన వినోద ఆట: చదరంగం

🌟సింధు నాగరికతలో పెద్దల వినోదాలు: చదరంగం,పాచికలు ,వేట 

🌟పాచికలు లభ్యమైన సింధు నాగరికతా ప్రదేశం : లోథాల్ 

🌟సింధు ప్రజల ఆటబొమ్మలలో అధికంగా లభ్యమైన ఆటబొమ్మ: బండి బొమ్మ

🌟 రవాణాకు ఎడ్ల బండ్లను ఉపయోగించారు. వీటినే ఎక్కాబండ్లు అంటారు.

వేశధారణ- అలంకరణ

🌟స్త్రీ పురుషులిద్దరూ ఉత్తరీయం, అంతరీయం ధరించారు.

🌟 పత్తి, ఉన్నిని వస్త్రాలకు ఉపయోగించారు.

🌟 పురుషులకు తలమీద జుట్టు, మీసాలు తీసివేసి గడ్డం పెంచుకున్నారు.

🌟స్త్రీలు నారదముడి, గొల్లభామముడి, విసనకర్ర జడ (ముడి) ధరించారు.

🌟స్త్రీ పురుషులు ధరించిన ఆభరణాలు -ముక్కుకు చెవికి పోగులు ,కడియాలు

మతం 

🌟 వీరు ప్రధానంగా అమ్మతల్లిని పూజించేవారు.

🌟 హరప్పా ప్రజలు ప్రకృతిని పూజించేవారు. దేవాలయాలు ఉండేవి కావు. హరప్పా ప్రజల మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారం ముద్రికలు 

🌟ప్రకృతి దేవత, వ్యవసాయ దేవత, పునరుత్పత్తి దేవతలను పూజించేవారు.

🌟అమ్మతల్లికి సంబంధిచిన ఆధారాలు హరప్పాలో బయటపడినాయి. 

 అమ్మతల్లి కనిపిస్తున్న తీరు తెన్నులు :

🌟రావిచెట్టు మొదట్లో నగ్నంగా నిలబడి ఉండగా బలి ఇవ్వడానికి మేకను తీసుకొని వెళ్తుండడం.

🌟 చెట్టు కొమ్మల మధ్యలో త్రిశూలధారి అయిన దేవత బొమ్మ

🌟 కాళీభంగన్ లో లభించిన ఒక స్థూపకార ముద్రపై స్త్రీ దేవత, పులి శరీరాకృతిని పొందినట్లుగా ఉంది.

🌟 సంతానం కొరకు మాతృదేవతలను పూజించేవారు.

 పశుపతి

🌟సింధు ప్రజల పురుష దైవం: పశుపతి (కొమ్ముల దేవుడు) లభించాయి.

🌟ఈ పశుపతికి సంబంధిచిన ఆధారాలు మొహంజదారోలో  లభించాయి 

 🌟 ఈ పశుపతి చుట్టూ నాలుగు జంతువులు కలవు:

  • గేరి 
  • పులి 
  • ఏనుగు 
  • ఖడ్గమృగం
  •  ఈయన కాళ్ళ దగ్గర రెండు జింకలు కలవు. 

🌟వీరు ప్రకృతి ఆరాధకులు.

🌟 కొమ్ముల దేవుడిని పశుపతిగా పేర్కొన్న చరిత్రకారుడు సర్ జాన్ మార్బల్

సింధూ ప్రజలు కొలిచినవి క్రింది విధంగా వున్నాయి.

🌟 వృక్షం - రావిచెట్టు 

🌟 పక్షి - పావురం

🌟 జంతువు - మూపురం ఉన్న ఎద్దు

🌟సింధూ ప్రజలు ఆరాధించిన చిహ్నం - స్వస్తిక్ గుర్తు

🌟వీరి లిపి: బొమ్మల లిపి / చిత్రలిపి. వీరు కుడినుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి రాసేవారు. దీనిని బౌద్ధి పెద్ద అంటారు. దీనిని పర్పలిపి, నాగపల్లి లిపి అని కూడా పిలుస్తారు.

🌟ఈ లిపికి సంబంధించిన ఆధారం: ముద్రలపై చేప, పక్షి మొదలైన బొమ్మలచే లిఖించబడటం వలన దీనిని బొమ్మల లిపి అంటారు.

సింధు లిపిపై పరిశోధన జరిపినవారు:

  • యస్.ఆర్. రావు
  • మహాదేవన్
  • నట్వర్ ఝా 
  • కృష్ణారావు

🌟 సింధు నుండి ఆవిర్భవించబడినదిగా భావింపబడుతున్న లిపి : బ్రహ్మిలిపి

🌟 సింధు నుంచి బ్రాహ్మీలిపి ఆవిర్భవించిందని ప్రొ॥ లాంగ్టన్, రాజారాం తెలిపారు.

🌟 ద్రావిడ భాషలకు మొదటి రూపం సింధు లిపి: మహాదేవన్ 

🌟 సంస్కృతికి మొదటి రూపం సింధు లిపి : యస్.ఆర్.రావు

🌟ఇటీవలి కాలంలో సింధు లిసి చదివినట్లుగా ప్రకటించుకున్న చరిత్రకారులు :యస్.ఆర్. రావు , నట్వర్ జు

🌟 సింధు లిసి మీద నట్వర్ జు రాసిన గ్రంధం : hose too The Vedic Glossary on Indus Script


👉 చరిత్ర ,చరిత్ర ఆధారాలు 

👉 చరిత్ర (History )- పరిచయం

👉 చరిత్ర ఆధారాలు  Inscriptions

👉 చరిత్ర ఆధారాలు  Literary Sources

👉 సింధు నాగరికత (Indus Valley Civilisation)

👉 సింధూ నాగరికత Chanhudaro ,Kalibangan, lothal,banawali ,Kozhikode

Post a Comment

0 Comments

Close Menu