రాజ్యాంగతవాదం (CONSTITUTIONALISM)

 రాజ్యాంగతవాదం (CONSTITUTIONALISM)

                                    



✡⚛ రాజ్యాంగ తావాడానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.
✡⚛రాజ్యాంగ వాదం అభివృద్ధి ఒక చారిత్రక ప్రక్రియ, రాజ్యాంగ మూలాలను పురాతన గ్రీకు రాజకీయ వ్యవస్థలో గుర్తించవచ్చును.

పురాతన గ్రీకులోని ప్రతి నగర రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉండేదని రాజనీతి శాత్రవేత్తలు పేర్కొన్నారు.
సుప్రసిద్ధ పురాతన గ్రీకు రాజనీతి తత్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్ తమ రచనల్లో రాజ్యాంగం గురించి విస్తృతంగా చర్చించారు.
గ్రీకుల తరువాత రాజ్యాంగం గురించి రోమన్ తత్వవేత్తలు రాజ్యాంగ భావనను అభివృద్ధి పరిచారు. మధ్యయుగాలలో రాజ్యాంగ భావనను. మరింత అభివృద్ధి పరిచారు. ఆధునిక కాలంలో రాజ్యాంగ భావన ఇంగ్లండులో అవతరించి ఇతర దేశాలకు ప్రాకింది.
17వ శతాబ్దంలో ఇంగ్లాండు, అనేక చట్టాల ఫలితంగా పార్లమెంటు మొదలైన రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడ్డాయి.
1790 శతాబ్దంలో ఫ్రాన్స్లో మొట్టమొదటి రాజ్యాంగం అవతరించింది. 

1776లో అమెరికాలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ విధంగా 20వ శతాబ్దం నాటికి అనేక ప్రాశ్చాత్య దేశాలలో రాజ్యాంగాలు ఏర్పడ్డాయి.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం రాజకీయ స్వాతంత్ర్యం పొందిన అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు రాజ్యాంగాలను రూపొందించుకొని అమలుపరిచాయి. 

దీని ఫలితంగా ఈ దేశాలలో రాజ్యాంగ బద్దమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ రాజ్యాంగాల రూపకల్పనలో అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాలను అనుకరించాయి.

రాజ్యాంగతావాదం అనేది చట్టాల ద్వారా నియంత్రించబడే రాజకీయ వ్యవస్థకు సంబంధించిన ఆధునిక భావనగా పరిగణించబడింది. 

రాజ్యాంగ తావాదం వ్యక్తికి బదులుగా శానన ఆధిక్యతకు ప్రతీకగా వుంటుంది. రాజ్యాంగత వాదానికి వ్యతిరేకమైనది డిపోటిజమ్. రాజ్యాంగ తావాదం, జాతీయవాదం. ప్రజాస్వామ్యం, పరిమిత ప్రభుత్వాలు అనే భావనలను సూచిస్తుంది.
కార్ల్ - జె. ఫ్రెదరికి తన కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అండ్ డెమోక్రసీ గ్రంథంలో రాజ్యాంగవారాన్ని అధికార విభజనగా వర్ణించారు. రాజ్యాంగతావాదం అనేది ప్రభుత్వ చర్యలపై నియంత్రణ కల్గివుండేందుకు అధికారాలను విభజించేందుకు వినియోగించబడే చర్యగా అతను పేర్కొన్నాడు.


ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దేందుకు, అది న్యాయబద్ధంగా వ్యవహరించేందుకు అవసరమయ్యే నియమ నిబంధనలను రాజ్యాంగ తావాదం రూపొందిస్తుందని భావించాడు.
సమర్థవంతంగా పనిచేసేందుకు రాజ్యాంగతావాదం ప్రభుత్వానికి కొన్ని పరిమితులను పేర్కొంటుందని అతను పేర్కొన్నాడు. కావున రాజ్యాంగ తావాదమనేది రాజ్యంలో రాజ్యాంగం ఉనికి ప్రధాన శాసనం ఏర్పదేందుకు, ప్రభుత్వానికి చుక్కానిగా ఉపయోగపడేందుకు ఉ దేశించబడింది.


ప్రభుత్వం నియంతృత్వ ధోరణులను అరికట్టుటకు, ప్రజల హక్కులను కాపాడేందుకు, రాజ్యం పార్వభౌమత్వ పరిధిని నిర్ణయించేందుకు రాజ్యాంగతావాదం ఏర్పడింది.
రాజ్యాంగమంటే "ప్రభుత్వ అధికారాలు, ప్రజల హక్కుల గురించి, ప్రభుత్వం-ప్రజలమధ్య గల సంబంధం గురించి తెలియజేసే నియమ నిబంధనల సమాహారం" _సిఎఫ్ స్ట్రాంగ్
రాజ్యాంగమంటే "శాసనం ద్వారా, శాసనం ప్రకారం ఏర్పాటైన శాశ్వత సంస్థలు చెప్పబడిన విధులు, హక్కులతో పనిచేసే రాజకీయ సమాజం గురించి తెలిపే భావన", కార్ల్, జె. ఫ్రెడరిక్
"రాజ్యాంగమంటే సంఘటిత రాజకీయ సమాజానికి సంబంధించిన చట్టం":- లార్డ్ బ్రైస్ 

ప్రభుత్వ స్వరూపం, అది పనిచేసే విధానాన్ని తెలిపే నియామాల సముదాయమే రాజ్యాంగం - లార్డ్ బ్రైస్

ప్రపంచంలో రాజ్యాంగ తా వాదానికి పునాది అయిన దేశం గ్రీకు దేశం, రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేర్కొనబడిన వ్యక్తి - అరిస్టాటిల్
ప్రపంచంలో సుమారు 157 దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన వ్యక్తి - అరిస్టాటిల్

అరిస్టాటిల్ రచనలు :

  • 1. పాలిటిక్స్
  • 2. ఎథిక్స్
  • 3. నికోమోచకే  

అరిస్టాటిల్ స్థాపించిన ప్రసిద్ధ అకాడమీ - లైసియమ్ / అలెగ్జాండర్ గురువు - అరిస్టాటిల్

అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేలో / ప్లేటో గురువు : సోక్రటీస్

ప్లేటో రచనలు

  • 1 రిపబ్లిక్ 
  • 2.ది లాస్ 
  • 3. అపాలజి (దీనిని గుజరాత్ భాషలో తర్జుమా చేసిన వ్యక్తి - గాంధీజీ)

“మంచి పౌరులు ఉత్తమ సమాజాన్ని సృష్టించడానికి కారకుడవుతాడు - అరిస్టాటిల్
"చట్టబద్ధమైన పాలన శ్రేష్ఠమైనది" - అరిస్టాటిల్ / "తత్వవేత్తల పాలన శ్రేష్టమైనది" - ప్లేటో

లిఖిత రాజ్యాంగం:


లిఖిత రూపంలో రూపొందించుకున్న రాజ్యాంగము. ఉదా: అమెరికా, భారత రాజ్యాంగాలు..

అలిఖిత రాజ్యాంగం:


లిఖిత రూపంలో కాకుండా చారిత్రక సాంప్రదాయాలను అనుసరించి పార్లమెంటు రూపొందించే చట్టాలే రాజ్యాంగం వలె చెలామణి కావటం, ఉదా: ఇంగ్లాండ్ దేశ పార్లమెంట్

ప్రపంచంలో మొదటిసారిగా లిఖిత రూపంలో రాజ్యాంగాన్ని రూపొందించుకున్న దేశం అమెరికా

ప్రపంచంలో ఏర్పడిన మొట్టమొదటి సమాఖ్యవేత్తం అమెరికా

అతిచిన్న లిఖిత రాజ్యాంగం అమెరికా

రాజ్యాంగ ప్రవేశిక భావనకు మూలం అమెరికా

న్యాయశాఖ ఔన్నత్యం అధికంగా గల దేశం అమెరికా

అత్యధిక దృఢ స్వభావం గల రాజ్యాంగాన్ని రూపొందించుకున్న దేశం - అమెరికా

ప్రపంచంలో హక్కులను రాజ్యాంగంలో చేర్చిన మొదటి దేశం అమెరికా అతి తక్కువ సమయంలో రాజ్యాంగాన్ని రూపొందించుకున్న దేశం అమెరికా (3 1/2 నుంచి 4 నెలలు).

భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగం రూపొందించుకోవటానికి ఎక్కువ సమయం తీసుకున్న దేశం - ఆస్ట్రేలియా (9 సంవత్సరాలు)

రాజ్యం, సమాజం,ప్రభుత్వం,సంస్థలు అనగా నేమి ??

👉 కేంద్ర ఎన్నికల సంఘం

Post a Comment

0 Comments

Close Menu