Gall bladder stones ( గల్ బ్లాడర్ (పసరతిత్తి) లో రాళ్లు)

 గల్ బ్లాడర్ (పసరతిత్తి) లో రాళ్లు:




👉గల్ బ్లాడర్  (పసరతిత్తి) రాళ్లనే గాల్‌ స్టోన్స్‌ అని అంటారు.

👉 స్థూలకాయం, కొలెస్ట్రాల్‌ ఎక్కువున్న ఆహారం తీసుకోవడమే దీనికి కారణం.

✍️పసరతిత్తి వ్యాధికి కారణాలు:

👉స్థూలకాయం.

👉మధుమేహం.

👉గర్భ నిరోధక మాత్రలు వాడే వారిలో.

👉సరోసిస్‌ లివర్‌.

👉ఎక్కువ కొలెస్ట్రాల్‌ వున్న వారిలో.

👉పలిఅన్‌ స్యాచురేటెడ్‌ కొవ్వు కల్గిన ఆహారం తీసున్నవారిలో

👉గాల్‌ బ్లాడర్‌  బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వుంటే వస్తాయి.

👉మహిళల్లో నలభై వయస్సు, లావుగా ఉన్నవారిలో నాల్గు రెట్లు ఎక్కువగా కన్పిస్తుంది.

👉గర్భవతుల్లో కూడా ఈ వ్యాధి వస్తుంది.

✍️లక్షణాలు:

👉చాలా  మందిలో ఈ రాళ్ల వల్ల ఏ లక్షణాలు కనిపించవు.

👉కొంత మందిలో మాత్రం ఉదరం పైభాగం కుడి పక్కన మెలిపెట్టినట్టు వస్తుంది.

👉భోజనం  చేసిన 30 నిమిషాల నుండి గంటన్నర తర్వాత మొదలవుతుంది.

👉ఈ నొప్పి కుడి భుజానికి వీపునకు, పొట్ట దిగువ భాగానికి పాకుతుంది.

👉మరికొందరిలో వయనం వచ్చినట్టు వుండడం, వాంతులవడం, చలితో కూడిన జ్వరంతోపాటు పసరికలొస్తాయి.

👉కొందరిలో పసరతిత్తి వాహికల్లో అడ్డుఏర్పడినప్పుడు అకస్మాత్తుగా తిత్తి వాచినప్పుడు, విపరీతమైన నొప్పి చలితో కూడిన జ్వరం వస్తుంది.

👉దీన్ని ‘అక్యూట్‌ కోలిసిస్టెటిస్‌’గా గమనించాలి.

👉రోగిని  పరీక్షిస్తే కడుపుపై భాగంలో, కుడిపైపు నొక్కితే విపరీతమైన నొప్పి కలుగుతుంది.

👉వ్యాధి  తీవ్రతను బట్టి కొన్ని విపరీత లక్షణాలు ఈ విధంగా వుంటాయి.

👉పచ్చకామెర్లు ఎక్కువగా వుండడం.

👉సప్టిసీమియా.

👉పసరతిత్తిలో చీము నిండి పగలడం.

👉తర్వాత షాక్‌లో వెళ్లడం జరుగుతుంది.

వ్యాధి నిర్ధారణ :

👉రక్తంలో బిలురూబిన్‌ ఎక్కువగా వుంటుంది.

👉సాధారణ (కడుపు) ఎక్స్‌రే, ఓరల్‌ కోలిసిస్టోగ్రఫీ, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా గుర్తించవచ్చు.

తీసుకోవలసిన  జాగ్రత్తలు:

👉లక్షణాలు ఎక్కువున్నప్పుడు బాగా విశ్రాంతి అవసరం.

👉 సాత్విక ఆహారం తీసుకోవాలి.

👉లావుగా వుంటే బరువు తగ్గించుకోవాలి.

👉గుడ్డు, వేయించిన పదార్థాలు, వెన్నె సంబంధిత పదార్థాలు, పందిమాంసం కూడా బాగా తగ్గించాలి.

👉వెచ్చని నీళ్లు వాటర్‌ బ్యాగ్‌లో వుంచి కడుపు మీద వుంచాలి.

👉వాంతులు  విరేచనాలు వుంటే నోటి ద్వారా ఏమి ఇవ్వకుండా నరాల ద్వారా గ్లూకోజ్‌ ఎక్కించాలి.

Post a Comment

0 Comments

Close Menu