💎గంగానది హిమాలయ నదీ వ్యవస్థల్లో అతి తరుణ నది గా పిలవబడుతుంది.
💎 ఈ నదికి గల మరో పేరు జాహ్నని నది.
💎అలక నంద నది దేవ ప్రయాగ వద్ద భగీరధి తో కలిసిన తర్వాత గంగా నదిగా పిలుస్తారు. అనగా గంగానది అలక నంద మరియు భగీరధి అనే రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుంది.
అలక నంద నవీ ఉత్తరాఖండ్లోని కుమయూన్ హిమాలయాల్లో బద్రినాధ్ సమీపంలోని సథన్నాధ్ దగ్గర గల అల్క అనే హిమానీ నదం వద్ద జన్మిస్తుంది.
💎 భగీరధి నది ఉత్తరాఖండ్ లోని కుమయూన్ హిమాలయాల్లో కేదారినాధ్ సమీపంలోని గౌముఖ్ దగ్గర గల గంగోత్రి అనే హిమానీ నదం వద్ద జన్మిస్తుంది.
💎 అలక నంద, పిండార్ నదులు కలిసే ప్రదేశం : కరణ్ ప్రయాగ
💎 అలకనంద, మందాకిని కలిసే ప్రదేశం - రుద్ర ప్రయాగ
💎 అలక నంద, జోషిమాత నదులు కలిసే ప్రదేశం - విష్ణు ప్రయాగ.
💎గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశం (త్రివేణి సంగమం)- ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ (లేదా) అలహాబాద్,
💎గంగానది హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశించి.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా వద్ద రెండు ప్రధాన శాఖలు గా చీలుతుంది.
💎తదుపరి గంగానది లో ఒక శాఖ పద్మానదిగా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించి, బ్రహ్మపుత్రతో కలిసి ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. మరో శాఖ హుగ్లీ నదిగా పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది.
💎ఈ నది మొత్తం పొడవు 2525 కి.మీ. కాగా భారత్లో దీని పొడవు సుమారు 2415 కి.మీ. గంగానది భారతదేశంలో ఎక్కువ దూరం ఉత్తరప్రదేశలో (1140 కి.మీ.) ప్రవహిస్తుంది.
💎 గంగానది భారతదేశంలో అతి పొడవైన నది మరియు అతి తరుణ నది.
💎గంగానది దేశంలోని వైశాల్యంలో 4వ వంతు ఆక్రమించి, అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది.
💎ఈ నది మన దేశ భూభాగంలో సమారు 26 శాతం నదీ పరీవాహక ప్రాంతం ను కలిగి ఉంది.
💎 రామ్ గంగా, గోమతి, ఘగ్రా,
💎గండక్, కోసి, భాగమతి, శారద తదితర హిమాలయ నదులు ఎడమవైపు నుంచి గంగా నదిలో కలుస్తాయి.
💎 యమున, చంబల్, సోన్
💎 బెట్వా, కెన్, దామోదర్, టాన్స్ మొదలైన ద్వీపకల్ప నదులు కుడివైపు నుంచి గంగా నదిలో కలుస్తాయి.
💎రామ్ గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి ఘర్వాల్ జిల్లాలో జన్మించి కలఘర్ వద్ద గంగా మైదాన ప్రాంతం లోనికి ప్రవేశిస్తుంది.
💎రామ్ గంగా నది దాదాపు 696 కి.మీ. ప్రవహించి కనౌజ్ వద్ద గంగానదిలో కలుస్తుంది.
💎నేపాల్ లోని ఎవరెస్ట్, ధవళగిరి శిఖరాల మధ్య గల సోహాతు కనుము వద్ద సుమారు 7000 మీ. ఎత్తులోజన్మిస్తుంది. అందువల్ల దీన్ని భారతదేశంలో ఎత్తైన ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నదిగా పరిగణిస్తారు.
💎గండక్ నదిని నేపాల్లో సాలిగ్రామి, బీహార్లో నారాయణి అని పిలుస్తారు.
💎 ఈ నది బీహార్లో పాట్నా వద్ద గంగానదిలో కలుస్తుంది.
💎 కోసి నదిని సంస్కృతంలో కౌరికి అంటారు. కోసి నదికి బీహార్ దుఃఖదాయని అని పేరుంది.
💎 ఈ నది అరుణ్ కోసి, సన్ కోసి, తామర్ కోసి అనే నదుల కలయిక వలన ఏర్పడుతుంది. కోసి నదినే సప్త కోసి అని పిలుస్తారు.
💎కోసి నది నేపాల్, టిబెట్, సిక్కిం సరిహద్దుల్లో గల గోసాయ్ నాధీ వద్ద జన్మించి, కాంచన్ గంగా పర్వత శిఖరాన్ని తాకుతూ కోసీచాత్ర మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుంది.
💎 ఈ నది బీహార్లో కుర్ సేలా వద్ద గంగానదిలో కలుస్తుంది.
💎 కోసి నది ఉపనదులు - అరుణ్ కోసి, సన్ కోసి, తామర్ కోసి తదితరాలు,
💎ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు సహర్ష (బీహార్) మరియు హనుమాన్ నగర్,
💎 గాగ్రా నదిని నేపాల్లో కర్ణాలి అని కూడా పిలుస్తారు..
💎 ఈ నది నేపాల్ లోని గుర్ల మాందాత్ శిఖరం వద్ద జన్మిస్తుంది.
💎గాగ్రా నది బీహార్లోని ఛాప్రా వద్ద గంగానదిలో కలుస్తుంది
💎నది ఉపనదులు - శారదా, సరయు, రపతి, శారదా నదిని చౌక, కాళి అని కూడా పిలుస్తారు.
💎గంగానది యొక్క కుడి వైపు ఉప నదులు.
💎ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఘర్వాల్ జిల్లాలో భండార్ పూన్చ అనే పర్వత శిఖరం వద్ద యమునోత్రి అనే హిమనీ నదం వద్ద యమునా నది జన్మిస్తుంది.
💎యమునా నది ముస్సోరి కొండలను దాటి తజేవాలా అనే ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది.
💎ఈ నది అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
💎యమునా నది ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.
💎ఈ నది పొడవు - 1376 కి.మీ.
💎యమునా నది ఒడ్డున మధుర, ఆగ్రా, ఢిల్లీ నగరాలున్నాయి.
💎ఈ నది గంగానది ఉపనదుల్లో కెల్లా అతి పెద్దది.
💎భారతదేశంలో ప్రవహించే ఉపనదుల్లో కెల్లా అతి పొడవైనది - యమునా నది
💎యమునా నది ఉపనదులు - చంబల్, బెట్వా, కెన్, కాల్ సింధి.
💎ఈ నది హిమాలయ పర్వతాల్లో జన్మించి దక్షిణదిశలో ప్రవహించి కుడివైపు నుండి గంగా నదిలో కలుస్తుంది .
💎చంబల్, బెట్వా, కెన్ నదులు ఉత్తరంగా ప్రవహించి యమునా నదిలో కలుస్తున్నాయి..
💎మధ్యప్రదేశ్లోని జనపావో కొండల్లోని మౌ అనే ప్రదేశంలో చంబల్ నది జన్మిస్తుంది.
💎చంబల్ నది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.
💎ఈ నది ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో యమునా నదిలో కలుస్తుంది.
💎చంబల్ నది పొడవు 1050 కి.మీ. దీని ఉపనది. నాస్, ఆరావళి పర్వతాల్లో బినాస్ నది చంబల్ నదిలో కలుస్తుంది.
💎చంబల్ నది యమునా నది ఉపనదుల్లో కెల్లా పెద్దది.
💎ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు - కోట / రావత్ భట, గాంధీ నగర్, మౌ.
💎బెట్వా నదిని నేత్రావతి నది అని కూడా పిలుస్తారు.
💎నేత్రావతి మధ్యప్రదేశ్లోని భోపాల్ సమీపంలో జన్మిస్తుంది.
💎బెట్వా నది సాంచి, గ్వాలియర్, ఝాన్సీల గుండా ప్రవహించి చివరగా ఉత్తర ప్రదేశ్ లోని హమీర్ పూర్ వద్ద యమునా నదిలో కలుస్తుంది.
💎బెట్వా నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు - సాంచి మరియు విదీశ,
💎మధ్యప్రదేశ్లోని కైమూర్ కొండల్లో కెన్ నది జన్మిస్తుంది..
💎కెన్ నది బుందేల్ ఖండ్ పీఠభూమి గుండా ప్రవహించి చివరగా బాండ వద్ద యమునా నదిలో కలుస్తుంది.
💎ఈ నదిని కర్ణావతి నది అని కూడా పిలుస్తారు.
💎మధ్యప్రదేశ్లోని అమర్ కంటక్ పీఠభూమిలో సోన్ నది జన్మిస్తుంది.
💎సోన్ నది నర్మదా నదికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల గుండా ఉత్తరంగా ప్రవహించి పాట్నా వద్ద దనీపూర్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
💎సోన్ నదిని సువర్ణ నది అని కూడా అంటారు.
💎ఈ నది ఉపనదులు మహానందా, గోపత్, రిహాండ్, కన్వర్, నార్త్ కోయల్, సౌత్ కోయల్ తదితరాలు,
💎జార్ఖండ్ లోని ఛోటానాగపూర్ పీఠభూమిలోని టోరీ అనే ప్రాంతంలో దామోదర్ నది జన్మిస్తుంది.
💎దామోదర్ నది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు దిగువన హుగ్లీ నదిలో కలుస్తుంది. దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయని అని కూడా పిలుస్తారు.
💎ఈ నది ఉపనదులు - బరాకర్, కోనార్, గది, దామోదర్ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు - సింద్రి, ఐరద్వాన్ మరియు దుర్గాపూర్
💎కైమూర్ పర్వతాల్లోని గోమచి శిఖరాల్లోని మైహర్ వద్ద టాన్స్ నది జన్మిస్తుంది. అలహాబాద్ నగరానికి దిగువన సిర్స వద్ద టాన్స్ నది గంగానదిలో కలుస్తుంది. దీనికి గల మరో పేరు తామస,
💎పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో గల మహల్దిరామ్ కొండల్లో మహానంద నది జన్మిస్తుంది.
💎మహానంద నది పశ్చిమ బెంగాల్లోని మహానంద శాంక్చ్యురీ నుంచి ప్రవహించి సిలిగురి, జల్పాయ్ గురి జిల్లాల మీదుగా బంగ్లాదేశ్లో పద్మానదిలో కలుస్తుంది.
0 Comments