సింధూ నాగరికత,Ganweriwala,Rakhigarhi,Ropar,Dholavira,Sutkagan Dor,surkotada,Amri,Rangapoor ,glumla ,Alamgirpu ,Daimabad

 సింధూ నాగరికత

Ganweriwala, Rakhigarhi, Ropar, Dholavira, Sutkagan Dor, surkotada, Amri, Rangapoor , glumla , Alamgirpu , Daimabad,



గనేరివాలా(Ganweriwala)

💎ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి : సర్. ఔరెల్ స్టైన్ 

💎ఇచట త్రవ్వకాలు జరిపినది: డా॥ ఎం.ఆర్. మొఘల్ (1970)

💎ప్రదేశం: గనేరివాలా, పంజాబ్-పాకిస్తాన్ నది: ఘగ్గర్

💎 ఇది ఆ కాలంలో ప్రధాన పట్టణంగా పేర్కొనబడింది.

రాఖిగర్హి (Rakhigarhi)

💎ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి: అమరేంద్రనాథ్ 

💎ప్రదేశం : రాఖిగర్హి (హిస్సార్ జిల్లా, హర్యానా)

💎ఇది ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సింధూ నాగరికత నగరం. 

💎టెర్రాకోట చక్రాలు, బొమ్మలు, శిల్పాలు, కుండలు, ఆస్తిపంజరం బయటపడినవి.

రోపార్ (Ropar)

💎ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి : వై.డి.శర్మ (1955-56) • 

💎ప్రదేశం: రూప్ నగర్ బారా జిల్లా, పంజాబ్

💎స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత్లో బయటపడిన మొదటి నగరం

💎ఇక్కడ కుండల తయారీ ఆనవాళ్ళు లభించాయి.

💎మనిషి శవంతో పాటు కుక్కను కూడా సమాధి చేయడం రోపార్ ప్రత్యేకత.

దోలవీర(Dholavira)

💎ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి : జె.పి.జోషి 

💎త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఆర్.ఎస్.బిస్త్

💎ప్రదేశం: భచౌతాలూకా, కచ్ జిల్లా, గుజరాత్

💎క్రీడా ప్రాంగణం, ఎడ్లబండ్లు, జలాశయం బయటపడినవి.

💎విశాలమైన కోటగోడలు, కోటలోపలి భాగంలో గొప్పవారిఇండ్లు, మధ్య పట్టణంలో అధికారంలో ఉన్నవారి చుట్టాల ఇండ్లు, కింది పట్టణంలో కార్మికుల ఇండ్లు ఉన్నాయి.

సుక్తజెండార్(Sutkagan Dor)

💎 ఈ ప్రాంతాన్ని కనుగొన్నవ్యక్తి: సర్. అరెల్ స్టెయిన్ (1931)

💎ప్రదేశం : సుక్తజెండార్, కరాచీ, పాకిస్తాన్,

💎పట్టణం రెండు భాగాలుగా విభజించారు. కోటప్రాంతం, దిగువబస్తి, చుట్టూ కోట గోడలు బయటపడినవి.

సుర్కుటడ(surkotada)  

💎 ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి జె.పి.జోషి (1972)

💎ప్రదేశం : భూజ్ దగ్గర, కచ్ జిల్లా, గుజరాత్   నది: రాణ్ ఆఫ్ కచ్

💎గుర్రం అవశేషాలకు సంబంధించిన ఆధారాలు కలవు. నాలుగు కుండలతో పూడ్చిన స్మశానం బయటపడింది.

💎నోట్: ప్రారంభంలో చరిత్రకారులు సింధూ ప్రజలకు గుర్రం తెలియదని, ఆర్యులు గుర్రాన్ని భారతదేశానికి పరిచయంచేసేవారని భావించేవారు.

💎రాతి కోటతో పరివేష్ఠితమై ఉన్న ఏకైక నగరం, 

💎కుండలో పెట్టిన ఎముకలు లభ్యమయ్యాయి.

అమ్రి(Amri)

💎నది సింధు ప్రదేశం: పాకిస్థాన్లోని దాదు జిల్లా

💎తవ్వకాలు జరిపినది: ఎన్.జి. మజుందార్ 

💎ఇక్కడ జుంగార్ సంస్కృతి వెలసింది.

💎మూపురం ఉన్న ఎద్దు ముద్రిక, ఖడ్గమృగం అవశేషాలు లభ్యమైనవి.

రంగాపూర్(Rangapoor)

💎త్రవ్వకాలు జరిపినది : ఎం. ఎస్. వాట్స్  

💎నది :భాదర్

💎ఇక్కడ హరప్పాకు పూర్వం ఉన్న సంస్కృతి వెలుగుచూసింది. 

💎ధాన్యపు పొట్టుకుసంబంధించిన అనవాళ్ళు లభించినవి.

గుమ్లా (glumla)

💎ఇది కాశ్మీర్లో గల నగరం. ఇచ్చట సర్వపూజకు సంబంధించిన అనవాళ్ళు లభించినవి.

అలంఘీర్ పూర్(Alamgirpur)

💎ఇది ఉత్తరప్రదేశ్లో బయటపడినది. ఇది హరప్పా నాగరికత పరిణితి దశకు చెందినది. * ఇది సింధు నాగరికతకు తూర్పు సరిహద్దున గల నగరం.

డైమాబాద్(Daimabad)

💎ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి : బి.పి. బోపార్దిక ర్ (1958) 

💎ప్రదేశం: అహ్మద్ నగర్ జిల్లా మహారాష్ట్ర 

💎ఇచట కాంస్య రథం, 2 ఎడ్లతో నడిపిన బండి లభించాయి.

భీర్రన 

💎ఫతేహాబాద్ జిల్లా హర్యానా. 

💎ఇచట కుండపైన నాట్యం చేసే బాలిక చిహ్నం లభించింది. 

💎ఇది మొహెంజొదారోలో నాట్యం చేసే బాలిక విగ్రహాన్ని పోలి ఉంది. 

💎విలువైన రంగు రాళ్ళు లభించాయి.

బాలు(Balu, Kaithal)

💎ఫతేహాబాద్ జిల్లా హర్యానా. 

💎ఇచట మొట్టమొదట వెల్లుల్లిని వాడిన ఆనవాళ్ళు, బార్లీ, గోధుమ, వరి, నువ్వులు, ద్రాక్ష మొదలైనవి లభించాయి


👉 చరిత్ర ,చరిత్ర ఆధారాలు 

👉 చరిత్ర (History )- పరిచయం

👉 చరిత్ర ఆధారాలు  Inscriptions

👉 చరిత్ర ఆధారాలు  Literary Sources

👉 సింధు నాగరికత (Indus Valley Civilisation)

👉 సింధూ నాగరికత Chanhudaro ,Kalibangan, lothal,banawali ,Kozhikode

👉 సింధూ నాగరికత,Ganweriwala,Rakhigarhi,Ropar,Dholavira,

Post a Comment

0 Comments

Close Menu