గోదావరి నది (Godavari ) మంజీరా(manjira) నది , ప్రాణహిత(pranahita) నది

 భారతదేశ ద్వీపకల్ప నదులు

⭐ద్వీపకల్ప నదులు వర్షాకాలం మాత్రమే నీటి ప్రవాహం కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని వర్షాధార  నదులు పిలుస్తారు.

⭐ద్వీపకల్ప నదులు కఠినశిలల గుండా ప్రవహించడం వల్ల సాధారణ వేగంతో అదో క్రమక్షయం చేస్తాయి.

⭐ ద్వీపకల్ప నదులన్నీ అంతర్ వర్తిత రకానికి చెందినవి.

⭐ఇవి నౌకాయానికి అనుకూలం కాదు. ఈ నదీ వ్యవస్థపై జలపాతాలు అధికంగా ఏర్పడతాయి.

⭐భారత ద్వీపకల్ప భూభాగం పడమర నుండి తూర్పు దిక్కునకు వాలి ఉన్నది. 

⭐దీని కారణంగా భారత ద్వీపకల్ప భూభాగంలో ప్రవహించే నదులలో సుమారు 90 శాతం నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాభారంలో కలుస్తున్నాయి

⭐మిగిలిన 10 శాతం నదులు పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. ద్వీపకల్ప నదులను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. 

అవి..

1. తూర్పు వైపు ప్రవహించే నదులు

⭐ గోదావరి, కృష్ణా, మహానది, కావేరి, పెన్నా మొదలైనవి.

2. పశ్చిమం వైపు ప్రవహించే నదులు : 

⭐ నర్మద, తపతి, సబర్మతి, మహి మొదలైనవి.

గోదావరి నది



⭐ గోదావరి నదిని దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

⭐గోదావరి నది ద్వీపకల్ప నదుల్లో అతి పెద్దది మరియు దక్షిణ భారత నదుల్లో కెల్లా అతి పొడవైనది.

⭐ గోదావరి నది భారతదేశంలో కెల్లా రెండవ పొడవైన నది.

⭐గోదావరి నది పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా లోని త్రయంబక్ సమీపంలో గల బీలే సరస్సువద్ద జన్మిస్తుంది.

⭐అక్కడి నుండి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సుమారు 1.465 కి.మీ. ప్రయాణించి చివరగాబంగాళాఖాతంలో కలుస్తోంది.

⭐ గోదావరి నది పొడవు తెలంగాణలో 522 కి.మీ.లు కాగా, ఆంధ్రప్రదేశ్లో (250 కి.మీ.లు) గా ఉన్నది.

⭐ గోదావరి నది మహారాష్ట్రలోని నాందేడ్ను దాటి తెలంగాణలోకి నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందుకుర్తి వద్ద (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సమీపంలో) ప్రవేశిస్తోంది.

⭐అక్కడి నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి సరిహద్దు లోని పోలవరం వద్ద ప్రవేశిస్తోంది. అనంతరం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ద్వారా ప్రవహించి చివరగా పాయలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తోంది, దీన్నే సప్త గోదావరి అంటారు..

⭐గోదావరి.. సముద్రంలో కలిసి ముందు గౌతమి, వశిష్ట, వైనతేయ, తుల, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ అనే ప్రధాన శాఖలుగా విడిపోయి, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రికి దిగువన యానాం, నరసాపురం మధ్య ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తోంది.

⭐ తెలంగాణలో గోదావరి నది ఒడ్డున బాసరలో సరస్వతి ఆలయం ఉంది.

⭐ గోదావరి నది గౌతమి, వశిష్ట పాయల మధ్య ఏర్పరిచే దీవిని కోన సీమ అంటారు.

⭐గోదావరి నది ఖమ్మం జిల్లాలోని పాపికొండల మధ్య బైసన్ గార్డు ఏర్పరుస్తుంది. 

⭐ గోదావరి నదికి అంతర్వేది సమీపంలో నదీ వంకరలు, ఆక్స సరస్సులు ఉన్నాయి.

⭐ గోదావరి నది ఒడ్డున గల ముఖ్య పట్టణాలు...

  • నాసిక్  -  మహారాష్ట్ర
  • నాందేడ్    - మహారాష్ట్ర
  •  బాసర - తెలంగాణ.
  • రాజమండ్రి - ఆంధ్రప్రదేశ్

⭐గోదావరి నదికి 2015 జూలై 14 నుండి 25 వరకు గోదావరి పుష్కరాలు జరిగినవి. 

⭐ ఈ పుష్కరాలను12 సం॥ లకుఒకసారి నిర్వహిస్తారు.

⭐గోదావరి పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇది దేశంలో రెండో అతిపెద్ద పరివాహక ప్రాంతం. 

⭐గోదావరి నది మొత్తం పరివాహక ప్రాంతం - 3,12,812 చ.కి.మీ.

 గోదావరి నది పరివాహక ప్రాంతం...

⭐మహారాష్ట్రలో -48.6 శాతం.

⭐తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో - 23.8 శాతం.

⭐మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో - 20.7 శాతం.

⭐ఒడిశాలో-5.5 శాతం.

⭐కర్ణాటకలో-1.4 శాతం.

గోదావరి నది యొక్క కుడి వైపు ఉప నదులు..... 

⭐ మంజీరా, మానేరు, ప్రవర, కిన్నెరసాని, మూల,

⭐ గోదావరి నది యొక్క ఎదను వైపు ఉప నదులు....

⭐ప్రాణహిత,ఇంద్రావతి, శబరి, సీలేరు, వార్థా, వైన్ గంగ, పెన్ గంగ, దుద్నా, పూర్ణ, మాచ్ ఖండ్ , కడెం,

మంజీరా నది



⭐మంజీరా నది మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో గల బాల ఘాట్  కొండలలో జన్మిస్తుంది.

⭐మంజీరా నది పొడవు - 644 కి.మీ. 

⭐ మంజీరా నది పరీవాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.

⭐మంజీరా నది ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ.

⭐మంజీరా నది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో నారాయణ్ ఖేడ్ దగ్గర నాగల్ గిద్ద  వద్ద తెలంగాణ రాష్ట్రంలోనికి ప్రవేశించి, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి నదిలో కలుస్తోంది.

⭐మంజీరా నది గోదావరి నదిలో కలిసే మొదటి ఉపనది.

ప్రాణహిత నది



⭐ప్రాణహిత నది గోదావరి నది ఉపనదులలో కెల్లా అతి పెద్దది. 

⭐ప్రాణహిత నది పొడవు 721 కి.మీ. కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఈ నది పొడవు - 113 కి.మీ.

⭐ప్రాణహిత నది వార్థా, వైన్ గంగ, పెన్ గంగ అనే మూడు నదుల కలయిక వలన ఏర్పడుతుంది.


మరిన్ని అంశాలు 

⭐  8 వ ఖండం ఎలా జిలాండై  ఉద్భవించింది ?

⭐ భారతదేశ నదీ వ్యవస్థ (River System in India)

⭐ సింధు నదీ వ్యవస్థ(sindhu river)

Post a Comment

0 Comments

Close Menu