సింధూ నాగరికత Harappa , mohenjo daro

 సింధూ నాగరికతలోని ముఖ్య నగరాలు Harappa , mohenjo daro



హరప్పా నాగరికత

💎 ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి : దయారాం సహానీ (1921)

💎 ప్రదేశం: హరప్పా (మౌంట్ గోమరి జిల్లా, పంజాబ్, పాకిస్తాన్)

💎 నది: రావి

💎 ఋగ్వేదంలో హరప్పా నగరం గురించి 'హరిపియం' అని వివరించబడింది.

ఈ నగరానికి గల పేర్లు 

  1. గేట్ వే అఫ్ సిటీ
  2. సిటీ అఫ్ గ్రానరీస్ 
  3. 1000 యుద్ధాలు జరిగిన ప్రదేశం.

💎సింధు నాగరికతకు  హరప్పా నాగరికత అని నామకరణం చేసినది - సర్ జాన్ మార్షల్ 

💎హుయాన్ తాస్తాన్గ్  వర్ణించిన హూ - స - నగరం   నగరం హరప్పా అని అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అభిప్రాయపడ్డారు.

💎ఇందులో  12 చిన్న ధాన్యాగారాలు 12 వరుసలలో 6. ధాన్యాగారాలు) లభ్యమైనాయి. 

💎ఈ ధాన్యాగారాలు ఈజిప్టు నాగరికతలోని "టెల్ అమర్నా" విధానమును పోలి ఉన్నాయి.

💎 కాంస్యముతో చేసిన దర్శణాలు , ఎడ్లబండి, కొలబద్ద లభించాయి.  

💎 చెక్కతో చేసిన శవపేటికలు లభించాయి. 

💎 శవపేటికల్లో తనంతోపాటు పూడ్చి పెట్టిన అలంకార వస్తువులు, అద్దాలు దొరికాయి.

💎 కాల్చిన ఇటుకలతో కట్టిన గోడలు, స్త్రీల నివాస సముదాయాలు, కూలీల ఇండ్లు బయటపడినవి.

💎 ఇక్కడ విదేశీయుడి శవాన్ని ఖననం చేసిన గుర్తులు లభ్యమయ్యాయి. 

💎 పాశ్చాత్యులు ఉపయోగించే మరుగుదొడ్లు ఇచ్చట లభ్యమైనాయి.

💎లోహాన్ని కరిగించే మూసలు, కాంస్యపు పనిముట్లు, లిపితో ముద్రించిన 891 ముద్రలు లభ్యమైనవి. 

💎 తలలేని పురుష విగ్రహం, నాట్యం చేసే బాలిక బొమ్మ బయటపడినవి.


మొహెంజొదారో (ది మౌంట్ ఆఫ్ ది డెడ్)

💎 ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి : ఆర్.డి. బెనర్జీ

💎 ఈ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తులు:  

  1. సర్ జాన్ మార్షల్ (1922-1930)
  2. ఇ.జె.హెచ్. ముక్కే (1927 & 1931).  
  3. సర్ మార్టిమమ్ వీలర్ (1930)
  4.  జార్జ్. ఎఫ్. డెల్స్ (1964)

💎 ప్రదేశం : మొహెంజొదారో (ది మౌంట్ ఆఫ్ ది డెడ్), లర్థానా జిల్లా, సింధ్ రాష్ట్రం (పాకిస్తాన్) 

💎నది : సింధు నదికి కుడివైపున గల నగరం. (దీనిని నేడు పాకిస్థాన్లో నికిలిస్థాన్ అనే పేరుతో వ్యవహరిస్తు

💎 సింధు నగరాలలో అతి పెద్ద నగరం - మొహెంజొదారో

💎 మొహంజదారో అనగా సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్ధం.  

💎  ఇచట మహా స్నానవాటిక, అతి పెద్ద ధాన్యాగారం బయటపడినవి.

💎కాల్చిన ఇటుకలతో నిర్మించిన 39-2349 అడుగుల విస్తీర్ణం గల మహా స్నానవాటిక బయటపడింది.



  • 💎 మహా స్నానవాటికను సర్ జాన్ మార్సల్ కనుగొన్నాడు. 
  • 💎 దీనియొక్క పొడవు 11.88 మీటర్లు
  • 💎 వెడల్పు - 7.01 మీటర్లు 
  • 💎 లోతు 2.43 మీటర్లు
  •  💎 ఈ స్నానవాటికకు ఉత్తర, దక్షిణ దిక్కులలో మెట్లు ఉన్నవి. 

💎 నైఋతి భాగంలో ఉపయోగించిన నీరు బయటకు వెళ్ళలకు ప్రత్యేక తూము వంటి నిర్మాణం కలదు.

💎 నీరు ఇంకిపోకుండా కాల్చిన ఇటుకలతో నిర్మాణం జరిపారు. 

💎 సమావేశ మందిరం మరియు దేవాలయం లాంటి కట్టడములు ఇచ్చట బయటపడినవి.

💎 నృత్యం చేస్తున్న కంచుతో తయారుచేసిన బొమ్మ (బాలిక బొమ్మ) లభ్యమైంది.

ఇచ్చట లభించిన ఇతర బొమ్మలు: 

  • కుక్క
  • మూపురం లేని ఎద్దు
  • పక్షులు.
  • మూపురం ఉన్న ఎద్దు

💎  ఇచ్చట 1398 ముద్రలు లభించినవి (అధిక ముద్రికలు బయటపడిన ప్రదేశం) 

💎  ఇచ్చట నేసిన ఎర్రటి గుడ్డ ముక్క లభించినది. పశుపతి మహాదేవ ముద్రికబయటపడింది.

💎 ఖరీదైన దుస్తులు ధరించిన అర్ధనిమీలత నేత్రుడైన గడ్డపు మనిషి యొక్కస్టియట్రైట్ విగ్రహం లభించింది.

💎 తూనిక రాళ్ళ పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి. రాళ్ళతో చేసిన శివలింగాలు లభించాయి.

💎 ఇచ్చట అనేక స్థంభాలతో కూడిన అసెంబ్లీ హాలు నిర్మాణం బయటపడింది.

💎 ఏడు సార్లు వరదలకు గురై, తిరిగి ఏడు సార్లు పునఃనిర్మితమైన పట్టణం,

💎 ఇక్కడి త్రవ్వకాలలో కుషాణుల కాలం నాటి బౌద్ధ స్థూపం బయటపడింది.


👉 చరిత్ర ,చరిత్ర ఆధారాలు 

👉 చరిత్ర (History )- పరిచయం

👉 చరిత్ర ఆధారాలు  Inscriptions

👉 చరిత్ర ఆధారాలు  Literary Sources

👉 సింధు నాగరికత (Indus Valley Civilisation)

Post a Comment

0 Comments

Close Menu