⭐ఆంగ్ల భాషలోని History (హిస్టరీ) అనే పదం గ్రీకు భాషలోని Histeria (ఇస్తోరియా ) అనే పదం నుంచి ఉద్భవించింది.
⭐గ్రీకు భాషలో ఇస్తోరియా అంటే వెదకడం, పరిశోధన, పరిశీలన అని అర్థం.
⭐ఇస్తోరియా అనే పదము ఇండో యూరోపియన్ భాషల్లోకి హిస్టోరియాగా మార్పు చెంది ప్రస్తుతం హిస్టరీ అనే పదం వాడుకలో ఉంది. చరిత్ర అనే పదం చర్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. చర్ అనగా నడత/నడవడిక అని అర్థం.
⭐చరిత్ర అనే పదం వివిధ భాషలలో వివిధ రకాలుగా వర్ణించబడినది.
⭐ అరబ్ భాషలో చరిత్రలో జరిగే సంఘటనలను తెలిపే కాలం - తారీఖ్ (Tarikh)
⭐చరిత్రను అధ్యయనం చేయడానికి పురావస్తు, వాజ్ఞ్మయ ఆధారాలు ఉపయోగపడతాయి.
⭐పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం లేదా ఆర్కియాలజీ అంటారు.
⭐భూమి పొరల్లో లభ్యమయ్యే భౌతిక అవశేషాల ద్వారా ప్రాచీన నాగరికతల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటారు. ఆర్కియాలజీ పితామహుడు - అలెగ్జాండర్ కన్నింగ్ హెూం
⭐సాంకేతికంగా తేదీలను (కాలాన్ని) నిర్ణయించుటకు ఉపయోగించే పద్ధతి - రేడియో కార్బన్ విధానం(సి14)
⭐చరిత్ర ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించడానికి సి14 లేదా కార్బన్ డేటింగ్ లేదా రేడియో కార్బన్ విధానం ఉపయోగిస్తారు.
⭐కార్బన్ డేటింగ్ విధానాన్ని అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డబ్ల్యు. ఎఫ్. లిబ్బి అనే శాస్త్రవేత్త 1947లో కనుగొని 1951లో సైంటిఫిక్ మంగ్లీ అనే పత్రికలో ప్రచురించినందుకు గాను ఇతనికి నోబెల్ బహుమతి. ప్రదానం చేశారు.
⭐పురావస్తు పరిశోధకులు గతాన్ని నిర్మించడానికి వివిధ ఆధారాలను ఉపయోగిస్తారు. పురావస్తు ఆధారాల్లో శాసనాలు, నాణేములు, కట్టడాలు భాగంగా ఉంటాయి.
0 Comments