పిల్లల్లో రోగనిరోధక(immunity) శక్తిని పెంచే ఆహారం
⭐పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. ముఖ్యంగా కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలంటే...
⭐ఆకుకూరలు, మునగకాయలు, కొత్తిమీర, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలి. వీటిలో ఫైబర్‌తో పాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి.
⭐పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.*
⭐కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు.
⭐పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ పసుపు ఆహారంలో ఇవ్వడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు.*
⭐బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించాలి. మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
⭐పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన కూల్ డ్రింక్,ఫ్రూట్‌జ్యూస్‌లు, చాక్లెట్స్, స్నాక్స్‌ను తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి.*
పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. ఒక గంటసేపైనా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి.
⭐రోగనిరోధక ( Immunity ) శక్తి అత్యంత ప్రధానమైనది పిల్లలలో రోదనిరోధక శక్తి తక్కువగా ( Immunity In Kids ) ఉంటుంది. పైగా పిల్లలకు సులభంగా ఫ్లూ, దగ్గు, ఫీవర్ వస్తుంటుంది. అందుకే వారి ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆహారంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి.
1.క్యారెట్లు..
⭐పిల్లల పెరుదలకు, ఆరోగ్యానికి విటమిన్ ఎ ( Vitamin A ) , జింక్ ( Zinc ) చాలా ముఖ్యం. అందుకే వారి ఆహారంలో క్యారెట్లు ఉండేలా చూసుకోండి. క్యారెట్‌తో కంటిచూపు మెరుగు అవుతుంది. దాంతో వారి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
2. పెరుగు
⭐పిల్లల శరీరంలో ఉండే బ్యాక్టీరియా నశించాలి అంటే వారికి పెరుగు ( Curd ) తప్పకుండా తినిపించాలి. పెరుగు తినడం వల్ల అందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు గట్టిగా మారుతాయి.
3. బత్తాయి, నిమ్మకాయ.
⭐నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ ( Vitamin C ) వల్ల ఫ్లూ, జలుబు, ఫీవర్ తగ్గుతుంది.
4. బాదం ( Badam ) , పిస్తా, జీడిపప్పు (Cashew ) తినడం వల్ల అందులో ఉండే పోషకాల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. పిల్లలు బలంగా మారుతారు. ఆరోగ్యంగా మారుతారు.
0 Comments