⭐ రేడియోధార్మిక పరిగణన ప్రకారం : క్రీ.పూ. 2300 - క్రీ.పూ 1750 వరకు.
⭐ అధిక మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం : క్రీ.పూ 2500 - క్రీ.పూ 1700 వరకు
⭐ రోమిలా థాపర్ ప్రకారం : క్రీ.పూ. 3500 - క్రీ.పూ 1750 వరకు
⭐ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రకారం :క్రీ.పూ. 2750 క్రీ.పూ 1500 వరకు
⭐ సింధు నాగరికత కాలం :కంచు యుగం
⭐ఇక్కడ తవ్వకాలు జరిపిన వ్యక్తి:కన్నింగ్ హమ్
⭐ నాగరికతకు పేరు పెట్టిన మొదటి వ్యక్తి :సర్ జాన్ మార్షల్
⭐ ప్రధాన దేవత :అమ్మ తల్లి
⭐ పూజించే వృక్షం:రావి/ అశ్వత్థ వృక్షం
⭐ పూజించే పక్షి: పావురం
⭐ పూజించే జంతువు:మూపురం కలిగిన ఎద్దు
⭐ ఉపయోగించే రాయి: స్టియటిట్
⭐ వీరు వినియోగించిన లోహం : కంచు/రాగి/బంగారం/వెండి మొ||వి,
⭐లిపి : బొమ్మల లిపి / చిత్రలిపి/నాగవల్లి కళ లిపి/వృషభాగ
⭐ తెలియని లోహం :ఇనుము
⭐ ఆరాధించే చిహ్నం: స్వస్తిక్ గుర్తు
⭐ నది దేవత వాహనం : మొసలి
⭐ ప్రపంచంలో మొదటగా పత్తిని పండించినవారు :సింధూ ప్రజలు
⭐ సింధు ప్రజల ప్రధాన ప్రయాణ సాధనం:ఎక్కా బండ్లు (ఎడ్ల బండి)
⭐ ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత:మెసపటోమియా (ఇరాక్) నాగరికత
⭐ ప్రపంచంలో మూడవ మరియు దక్షిణాసియాలో మొదటి నాగరికత :సింధు నాగరికత
⭐సింధు నాగరికతలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన నగరం : హరప్పా (1921) 1920-21లో హరిస్సాలో త్రవ్వకాలు జరిపినది: దయారాం సహానీ, యం.యస్. వాట్స్
⭐ 1922లో మొహంజొదారో పట్టణాన్ని కనుగొన్న తరువాత అప్పటి భారత పురావస్తు పరిశోధనా విభాగం డైరెక్టర్: జనరల్ సర్ జాన్ మార్షల్ దీనిని సింధు నాగరికతగా అభివర్ణించారు.
⭐ సింధు నాగరికతను వెలికితీసిన అప్పటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్- సర్ జాన్ మార్షల్,
⭐ సింధు నాగరికతను గురించి వెలుగులోకి తీసుకువచ్చిన పత్రిక - లండన్ వీక్లీ (1924)
⭐ మూల భారతీయ నాగరికత:కె.యన్ . ధీక్షిత్
⭐ హరప్పా నాగరికత:సర్ జాన్ మార్షల్
⭐ చారిత్రక సంధి యుగం:హెచ్.డి. సంకాలియా (వీరికి లిపి అర్థంకానందున సంధి యుగంగా పిలిచారు)
⭐ పట్టణ నాగరికత - పట్టణాలలో నివసించడం వలన
⭐ కాంస్యయుగపు నాగరికత:కాంస్యం అధికంగా వాడుట వలన
⭐ భారతదేశపు మూలనాగరికత :దేశంలో మొదటి నాగరికత అవడం వలన
⭐ అక్షరాస్యత నాగరికత. : లిపి ఉండడం వలన
⭐ తామ్ర శిలాయుగం:కాంస్యం, రాళ్ళు వాడకంలో ఉండడం వలన
⭐ మొట్టమొదట లోహాల వాడకం, లిపి రాతకు సంబంధించిన తొలి భారతీయ నాగరికత- సింధు నాగరికత
⭐ ఇది సువిశాలమైన భూభాగంలో ఏర్పడింది. సింధు నాగరికత కంచు యుగానికి చెందినది.
⭐చరిత్ర పూర్వ యుగానికి సంబంధించిన తామ్ర శిలా సంస్కృతికి చెందిన నాగరికత హరప్పా మట్టిదిబ్బలలో బయలు పడినది కావున దీనిని హరప్పా నాగరికత అంటారు.
⭐మొదటిసారి హరప్పా మట్టిదిబ్బను ప్రస్తావించిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి - సి.మాసన్
⭐ఋగ్వేదంలోని ఆరవ మండలంలో హరప్పా నాగరికత "పారిపియం" అనే పేరుతో ప్రస్తావించబడింది.
⭐ప్రస్తుత ఇరాక్ లోని టైగ్రిస్, యుప్రదీజ్ నదుల మధ్య వెలసిన నాగరికత,
⭐మెసపటోమియా (ఇరాక్ యొక్క ప్రాచీననామం) అనగా రెండు నదుల మధ్య ప్రాంతం అని అర్ధం .సింధూ ప్రజలు సుమేరియాతో వర్తక వాణిజ్య సంబంధాలను కొనసాగించారు.
⭐ నైలు నది పరివాహక ప్రాంతంలో వెలసిన నాగరికత
⭐హౌయాంగ్ హౌ నదీ ప్రాంతంలో వెలసిన నాగరికత. దీనినే మంచు నాగరికతఅంటారు.
⭐హౌయాంగ్ హౌ అంటే 'ఎల్లో రివర్' (Yellow River) అని అర్థం.
0 Comments