చరిత్ర ఆధారాలు Inscriptions

చరిత్ర ఆధారాలు  Inscriptions

I. పురావస్తు ఆధారాలు (Archaeological Sources).

⭐పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం లేదా ఆర్కియాలజీ అంటారు. 

⭐భూమి పొరల్లో లభ్యమయ్యే భౌతిక అవశేషాల ద్వారా ప్రాచీన నాగరికతల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటారు. ఆర్కియాలజీ పితామహుడు - అలెగ్జాండర్ కన్నింగ్ హెూం

⭐సాంకేతికంగా తేదీలను (కాలాన్ని) నిర్ణయించుటకు ఉపయోగించే పద్ధతి - రేడియో కార్బన్ విధానం(సి14)

కార్డన్ రేటింగ్ పద్దతి

⭐చరిత్ర ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించడానికి సి14 లేదా కార్బన్ డేటింగ్ లేదా రేడియో కార్బన్ విధానం ఉపయోగిస్తారు.

⭐కార్బన్ డేటింగ్ విధానాన్ని అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డబ్ల్యు. ఎఫ్. లిబ్బి అనే శాస్త్రవేత్త 1947లో కనుగొని 1951లో సైంటిఫిక్ మంగ్లీ అనే పత్రికలో ప్రచురించినందుకు గాను ఇతనికి నోబెల్ బహుమతి. ప్రదానం చేశారు.

⭐పురావస్తు పరిశోధకులు గతాన్ని నిర్మించడానికి వివిధ ఆధారాలను ఉపయోగిస్తారు. పురావస్తు ఆధారాల్లో శాసనాలు, నాణేములు, కట్టడాలు భాగంగా ఉంటాయి.


👉 కోల్పోయిన బంగారు నగరం 

 శాసనాలు  (Inscriptions):

⭐గట్టి ఉపరితలంపై లిఖించబడిన లిపిని శాసనం అంటారు. ఈ శాసనాలు రాళ్ల మీద, లోహాల మీద చెక్కించేవారు.

⭐ శాసనాలను ఒక పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని ఎపిగ్రఫీ అంటారు.

⭐శాసనంలోని ప్రాచీన లిపులను అధ్యయనం చేయడాన్ని "పేలియోగ్రఫీ' అంటారు.

⭐శాసనంల యందు ఉన్న సమాచారాన్ని బట్టి వీటిని 4 రకాలుగా విభజించవచ్చు. అవి : 

1.ప్రశస్తి శాసనము : 

⭐ఈ శాసనం నందు రాజు యొక్క విజయాలు గొప్పతనం (పొగడ్తలను)                                  గురించితెలుపుతూ వేసే శాసనములు.

ఉదా : సముద్రగుప్తుడి అలహాబాద్ శాసనము..

           గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనము

           రెండవ పులకేశి ఐహోలు శాసనము

2. దాన శాసనము :

⭐ఈ శాసనమును రాజుతోపాటు ఇతర వ్యక్తులు కూడా వేస్తారు. బ్రాహ్మణులకు దానమిచ్చిన అగ్రహారాలు, విహారాలు, ఇతరులకు ఇచ్చిన భూదానాల గురించి ఇందులో వివరిస్తారు. 

⭐వీటిని రాగిరేకులపైన లిఖిస్తారు కావున వీటిని తామ్రపలక శాసనాలు అంటారు.

3. రాజాజ్ఞ  శాసనము

⭐రాజు తన ఆజ్ఞలను, ఆదేశాల గురించి తెలుపుతూ వేసిన శాసనాలు.

⭐అశోకుడు వేసిన శాసనాలన్ని రాజాజ్ఞ శాసనాలు అంటారు. 

⭐భారతదేశంలో అత్యధిక శాసనాలను అశోకుడు వేయించాడు.

⭐అశోకుని శాసనాలను బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన జేమ్స్ ప్రిన్సెస్ (1837లో) ఆంగ్లంలోకి అనువదించాడు.

4. స్మారక శాసనము  :  

⭐గుర్తులుగా వేసే శాసనములే స్మారక శాసనములు.

నాణేములు:

⭐నాణేముల అధ్యయనాన్ని న్యూమిస్ మ్యటిక్స్ అంటారు.

⭐నాణేలపై గల బొమ్మల ఆధ్యయనం- 'సిగిల్మోగ్రఫీ'

⭐ప్రాచీన కాలంలో లోహాలతో నాణెంలను ముద్రించారు. అవి:•

  •  ⭐రాగి
  •  ⭐వెండి
  •  ⭐బంగారం
  • ⭐సీసం

⭐భారతదేశంలో తొలిసారిగా నాణేములు ఇండో- బాక్ట్రియన్ గ్రీకులు (యవనులు) చలామణిలోకి తెచ్చారు.

⭐భారతదేశంలో మొట్టమొదట నాణేముల చలామణి బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్లో జరిగింది.

కట్టడాలు / నిర్మాణాలు:

⭐కట్టణాలు లేదా నిర్మాణాల అధ్యయనమును ఐకనోగ్రఫీ (leco nography) అంటారు.

⭐వస్తు సంస్కృతిని చెప్పగలిగే వాటిలో కట్టడాలు ప్రధానమైన ఆధారం.

⭐గుహాలయాలు, దేవాలయాలు, మసీదులు, గుంబదీలు, దుర్గాలు ఇతర లౌకిక నిర్మాణాలు అన్నీ కట్టడాల కోవలకి వస్తాయి.

⭐హిందూ దేవాలయాలు వస్తు శిల్ప, రూపశిల్ప, ప్రతిమా శిల్పాలలోని పరిణామాలను చెప్పగా, మహమ్మదీయుల  నిర్మాణం అయిన తాజ్ మహల్ ప్రపంచపు వింతలలో ఒకటిగా చోటుచేసుకుంది.

⭐తాజ్ మహల్ మొఘల్ చక్రవర్తుల వైభవోతమైన జీవితాన్ని తెలియజేయగా, కాకతీయుల కాలం నాటి నిర్మాణాలు, శిల్పాలు ఆనాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు మతపరమైన విషయాలను తెలియపరుస్తున్నాయి.

చరిత్ర (History )- పరిచయం

Post a Comment

0 Comments

Close Menu