⭐కావేరి నది పశ్చిమ కనుమల్లో కర్ణాటకలోని కూర్గ్ జిల్లా బ్రహ్మగిరి కొండల్లో ఉన్న తలై కావేరి వద్ద జన్మిస్తోంది.
⭐కావేరి నది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా సుమారు 800 కి.మీ.ల దూరం ప్రయాణించి, చివరగా తమిళనాడులోని కావేరి పట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
⭐కావేరి నది దక్షిణ కర్ణాటక పీఠభూమి నుంచి తమిళనాడు మైదానాల్లోకి ప్రవేశిస్తూ మధ్యలో శివసముద్రం వద్దజలపాతాన్ని ఏర్పరుస్తోంది.
⭐కావేరి నది సం॥లో దాదాపు 10 నెలలు నీటి ప్రవాహంతో ఉండటం మూలంగా కావేరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు.
⭐మన దేశంలో నైరుతి మరియు ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షపాతాన్ని పొందే ఏకైక నది - కావేరి నది.
⭐ కావేరి నది పరివాహక ప్రాంతం - 81,155 చ.కి.మీ.
⭐ కావేరి నది పరివాహక ప్రాంతం కర్ణాటక (41 శాతం), తమిళనాడు (56 శాతం), కేరళ రాష్ట్రాల్లో (3 శాతం)విస్తరించి ఉంది.
⭐కావేరి నది తమిళనాడులోని శ్రీరంగం వద్ద రెండు పాయలుగా చీలుతోంది. ఇందులో ఉత్తరపాయను కోలరూన్/ కొల్లిడా అని, దక్షిణ పాయను కావేరి అని పిలుస్తారు.
⭐తమిళనాడులో కావేరి నది ప్రధానమైన డెల్టాను ఏర్పరిచింది. కాబట్టి ఈ నది తమిళనాడుకు అతి ముఖ్యమైంది..
⭐కావేరి నది ప్రవహించే ముఖ్యమైన జిల్లా - తంజావూరు,
⭐ హేరంగి, హేమావతి, లోకపావని, ఆర్కావటి,ష్రి మిషకుండా , భవాని, కబిని, సువర్ణవతి, అమరావతి, లక్ష్మణతీర్థ, షింషా మొదలైనవి.
⭐ పెన్నా నదిని పినాకిని అని కూడా పిలుస్తారు.
⭐ పెన్నా నది కర్ణాటకలోని కోలార్ జిల్లా నండిదుర్గం గిరుల్లో చెన్నకేశ్వర కొండ వద్ద జన్మిస్తుంది.
⭐ పెన్నా నది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సుమారు 600 కి.మీ. దూరం ప్రవహిస్తోంది.
⭐పెన్నా నది ఆంధ్రప్రదేశ్లోనికి అనంత పురం జిల్లా హిందూపూర్ సమీపంలో ప్రవేశిస్తుంది. పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో ప్రవహించు జిల్లాలు అనంత పురం, కడప, నెల్లూరు:
⭐పెన్నా నది చివరగా ఆంధ్రప్రదేశ్ లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది .
⭐ జయమంగళి, సగిలేరు, చెయ్యేరు, కుందేరు, చిత్రావతి, పాపాఘ్ని మొదలైనవి.
⭐పెన్నా నది సముద్రంలో కలిసే చోటుకు దక్షిణంగా సుమారు 100 కి.మీ.ల దూరంలో పులికాట్ అనే ఉప్పునీటి సరస్సు ఏర్పడింది. ఇది నెల్లూరు జిల్లా, తమిళనాడు మధ్య ఉంది. ఈ సరస్సు పక్షులకు నిలయంగా చెప్పొచ్చు.
⭐ నాగావళి నదిని లాంగ్యులా అని కూడా పిలుస్తారు.
⭐ నాగావళి నది ఒడిశాలోని రాయఘడ్ కొండలో పుట్టి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా మోపసు బందరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
⭐ నాగావళి నది యొక్క ఉప నదులు: ఒట్టిగడ్డ,జాంఝావతి, స్వర్ణముఖి, వేదవతి మొదలైనవి.
⭐ వంశధార నది తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో పెద్దది.
⭐ వంశధార నది ఒడిశాలో తూర్పు కనుమల రూపాంతరమైన జయపూర్ కొండల్లో జన్మించి ఆంధ్రప్రదేశ్లోకి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వద్ద ప్రవేశించి, అదే జిల్లా కళింగ పట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
⭐ సువర్ణ రేఖ నదిని సుబర్ణరేఖ నది అని కూడా పిలుస్తారు.
⭐సువర్ణ రేఖ నది. ఛోటానాగపూర్ పీఠభూమిలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ వద్ద నగ్రిలో జన్మిస్తోంది.
⭐సువర్ణ రేఖ నది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహించి ఒడిశాలోని కిర్తానియా వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
⭐తామ్రపాణి నది కేరళ రాష్ట్రంలోని అగస్త్యమలై కొండల్లో జన్మించి తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ లో కలుస్తోంది .
⭐బ్రాహ్మణి నది ఒడిశాలో మహానది తర్వాత 2వ పొడవైన నది.
⭐ బ్రాహ్మణి నది కోయిల్ మరియు శాంక్ అనే రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుంది.
⭐ కోయిల్ నది జార్ఖండ్లోని లోహర్దా గా అనే ప్రదేశం వద్ద జన్మిస్తుంది .
⭐ శాంక్ నది జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో జన్మిస్తుంది .
⭐ బ్రాహ్మణి నది, ఒడిశాలోని ధర్మా అనే ప్రదేశం వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది .
⭐ బ్రాహ్మణి నది ఒడ్డున రూర్కెలా ఇనుము-ఉక్కు కర్మాగారం ఉంది .
⭐ఈ రూర్కెలా ఇనుము-ఉక్కు కర్మాగారం నకు బ్రాహ్మణి నది నుండే నీటిని అందిస్తున్నారు.
0 Comments