కృష్ణా నది(krishna river)

 కృష్ణా నది



⭐కృష్ణా నది ద్వీపకల్ప నదుల్లో రెండో అతిపెద్ద, దక్షిణ భారతదేశంలో 2వ & దేశంలో 3వ పొడవైన నది.

⭐ కృష్ణా నది పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద జన్మిస్తుంది.

⭐ కృష్ణా నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి, చివరగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోహంసలదీవి  వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.

⭐ కృష్ణా నది మొత్తం పొడవు 1400 కి.మీ. 

⭐ కృష్ణా నది పొడవు తెలంగాణలో 480 కి.మీ.లు కాగా, ఆంధ్రప్రదేశ్లో 240 కి.మీ.లు గా ఉన్నది. కృష్ణా నది తెలంగాణలోకి మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం తంగడి వద్ద ప్రవేశిస్తోంది.

⭐ కృష్ణా నది శ్రీశైలం సమీపంలో పాతాళ గంగ గార్గ్  ను ఏర్పరుస్తోంది.

⭐ఇది విజయవాడకు దిగువన పులి గడ్డ  వద్ద రెండు పాయలుగా చీలి, మళ్ళీ కొంత దూరం తర్వాత కలుస్తోంది. పాయల మధ్య భూభాగాన్ని దివి సీమ అంటారు.

⭐ కృష్ణా గోదావరి నదుల మధ్య డెల్టా ప్రాంతంలో కొల్లేరు సరస్సు ఉంది. 

⭐ అత్యంత వివాదాస్పదమైన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు ఈ నదిపైనే ఉన్నాయి.

⭐ కృష్ణా నది మొత్తం పరివాహక ప్రాంతం - 2,58,948 చ.కి.మీ.

⭐కృష్ణా నది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది .

⭐కృష్ణా నది పరివాహక ప్రాంతం ఎక్కువగా గల రాష్ట్రం  కర్ణాటక కాగా, రెండవ రాష్ట్రం తెలంగాణ.

కృష్ణా నది నది యొక్క ఉప నదులు....

⭐ తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, మూసీ, హోలియా 

⭐డిండి, భీమా, కొయనా, వర్ణ , మున్నేరు, పాలేరు, యొన్న, 

⭐ పంచగంగ, దూదంగ, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు ముఖ్యమైనవి.

⭐ కృష్ణా నది ఉప నదులలో భీమా నది పొడవైనది కాగా, తుంగభద్ర నది అతి పెద్దది.


మరిన్ని అంశాలు 

⭐ సింధు నదీ వ్యవస్థ(sindhu river)

Post a Comment

0 Comments

Close Menu