చరిత్ర ఆధారాలు Literary Sources
లిఖిత ఆధారాలు/వాగ్మయ ఆధారాలు (Literary Sources)
🔯చరిత్రను అధ్యయనం చేయడానికి లిఖిత ఆధారాలను ఉపయోగిస్తారు. ఈ లిఖిత ఆధారాలలో స్వదేశీ లిఖిత గ్రంథాలు,విదేశీ లిఖిత గ్రంథాలు చరిత్ర అధ్యయనమునకు ఉపయోగపడతాయి.
ఏ) స్వదేశీ విఖిత గ్రంథాలు:
🔯ఇవి భారతీయుల ద్వారా భారతదేశంలో వ్రాయబడినవి:
- 1) మత గ్రంథాలు
- 2లౌకిక గ్రంథాలు
🔯వివిధ మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలు. ఉదా: బ్రాహ్మణ గ్రంథాలు, జైన గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు
బ్రాహ్మణ గ్రంథాలు
🔯వైదిక వాజ్ఞ్యయమైన వేదాలు, సంహితాలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, స్మృతి వాజ్ఞ్యయ ఉపవేదాలు, ఇతిహాసాలైన రామాయణ, మహాభారత, భాగవతాలు ప్రాచీన భారత రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సాంస్కృతిక పరిస్థితులు చరిత్ర రచనకు కొంత వరకు విలువైన సమాచారాన్ని అందించాయి.
జైన గ్రంధాలు
🔯 జైన ప్రామాణిక గ్రంధాలను అంగాలు, ఉప అంగాలు అంటారు. ఈ విధమైన
🔯"ద్వాదశ అంగాలు" మహావీరుని కాలంనాటి చారిత్రక వివరాలను అందజేస్తున్నాయి. భద్రబాహుని "కల్పసూత్రాలు" అలాగే ఆవశ్యక సూత్రాలు చరిత్ర రచనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. శక దండయాత్ర విశేషాలు ఆవశ్యక సూత్రాల ద్వారా తెలుస్తున్నాయి. హేమచంద్రుని పరిషిష్ఠ పర్వణం అనే జైన గ్రంథం చరిత్ర రచనకు ఎంతో దోహదపడింది.
బౌద్ధ గ్రంథాలు
🔯బౌద్ధమత ప్రామాణిక గ్రంథాలు అయిన వినయ, సుత్త, అభిదమ్మ పీఠకాలు అతి ముఖ్యమైనవి. వీటిని త్రిపీటకాలు అంటారు. బౌద్ధ గ్రంథాలు పాలి భాషలోవ్రాయబడినది క్రీ.పూ 3వ శతాబ్దం నాగరితకను తెలుసుకోవడానికి బుద్ధుని జాతక కథలు ఉపయోగపడుతున్నాయి. ఇంకా మిళింద పన్హా, దీపవంశ, మహావంశ, మౌర్య శుంగ వంశాల గురించి దక్షిణాధిలో బౌద్ధం గురించి ఎంతో సమాచారంను అందజేస్తున్నాయి.
లౌకిక గ్రంథాలు)
🔯 ఏ మతానికి సంబంధము లేని గ్రంధాలు. ఇవి వంశ చరిత్రలు, పాలన వ్యవస్థపై రచించబడ్డ గ్రంథాలు.
🔯 వ్యాకరణ గ్రంథాలు, జీవిత చరిత్రలు, ప్రాచీన సంస్కృతి కావ్యాలు, శాస్త్రీయ గ్రంథాలు.
🔯క్రీ.పూ. 5వ శతాబ్దంలో పాణీని వ్రాసిన అష్టాధ్యాయి మనదేశంలో తొలి లౌకిక గ్రంథము.
🔯క్రీ.శ. 12వ శతాబ్దంలో కల్హణుడు సంస్కృత భాషలో వ్రాసిన రాజతరంగిణి అత్యంత ప్రధానమైనది.
🔯ఈ గ్రంధం తరువాత వచ్చిన చారిత్రిక విలువలు గల గ్రంథాలు సోమేశ్వరుని 'రసమాల', 'కీర్తికొమౌడి ', 'అరిసింహుని సుక్షిత సంకీర్తన వంటి మౌర్యుచంద్రగుప్తుడి ప్రధానమంత్రి అయిన కౌటిల్యుని యొక్క అర్ధశాస్త్రం రాజనీతి గురించి తెలిసిన మొదటి శాస్త్రీయ గ్రంథం.
జీవిత చరిత్రలు.
🔯బానుని హర్ష చరిత్ర, పృథ్వీరాజ్ గురించి చాంద్ బర్దాయి వ్రాసిన పృథ్వీరాజ్ రాసో, కనౌజ్ పాలకుడైన యశోవర్మన్ గురించి ప్రాకృత కావ్యం గౌడ్-వాహ, బిల్హణుని విక్రమాంక దేవచరిత్ర, రామచరిత్ర, హేమచంద్రుని కుమారపాల చరిత్ర, పద్మగుప్తుని నవశశాంక చరిత్రలు ఎంతో ముఖ్యమైనవి.
సంస్కృత సాహిత్యం :
🔯కాళిదాసు వ్రాసిన మాళవికాగ్నిమిత్రం, విదిశ, విదర్భ రాజ్యాలకు మధ్య జరిగిన పోరాటం గురించి సింధు నది తీరంలో గ్రీకుల ఓటమి గురించి లాంటి చారిత్రక అంశాలను తెలుపుతుంది.
విశాఖదత్తుని ముద్రారాక్షసం మౌర్య చరిత్ర కు ,దేవి చంద్రగుప్తం గుప్తుల చరిత్ర రచనకు పనికి వస్తాయి.
🔯మేరుతుంగని చింతామణి, రాజశేఖరుని ప్రబంధకోశం చారిత్రక నాటకాలు, దండి దశకుమారచరిత్ర, సుబందుని వాసవదత్త, వాత్సాయనుని కామసూత్రాలు, పంచతంత్రం హితోపదేశం వంటి రచనలు చరిత్ర రచనకు ఎంత విలువ కలిగిన సమాచారం అందజేశాయి.
ఇతర భాషల సాహిత్యం:
🔯ప్రాకృత భాషలోని హాలుని గాథాసప్తశతి, గుణాడ్యుని బృహత్కథ, కుతూహలుని లీలావతి పరిణయం మొదలై గ్రంథాలు ఆ కాలం నాటి రాజకీయ, మత, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పనికి వచ్చే రచనలు.
శాస్త్రీయ గ్రంథాలు:
🔯వరాహమిహిరుడి బృహత్ సంహిత, బృహత్ జాతకాలు, వాగ్భటుని అష్టాంగ సంగ్రహ, అష్టాంగ బృహత్ సంహితల ఆర్యభట్టుని సూర్యసిద్ధాంతం, రోమక సిద్ధాంతాలు ఈ గ్రంథాలు ఆ కాలం నాటి వివరాలను తెలుపుతాయి.
విదేశీ లిఖిత గ్రంథాలు:
🔯భారతదేశంను అనేక మంది విదేశీయులు సందర్శించి అమూల్యమైన సమాచారం గల గ్రంథాలను అందించారు. ఈ గ్రంథాలు అనేక భాషలలో వ్రాయబడినవి.
నోట్ : భారతదేశాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసే విదేశీయులను 'ఇండాలజిస్టులు' అంటారు.
1) గ్రీకు -
🔯రోమన్ రచనలు:హెరబోటస్ రచించిన హిస్టోరీస్ (Histaries) లో పర్షియా - గ్రీకు యుద్ధాల గురించి భారత్-పర్షియా సంబంధాల గురించి, వాయువ్య భారతదేశంలోని సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి వివరించాడు. మెగస్తనీస్ రచించిన ఇండికా మౌర్యుల పరిపాలనా విశేషాలను తెలుపుతుంది. ప్లీనీ రచించిన 'నాచురల్ హిస్టరీ' ప్రాచీన కాలం నాటి ఇండో-రోమన్ వ్యాపారం గురించి తెలుపుతుంది.
2) చైనీస్ రచనలు
ఎ) ఫాహియాన్:
🔯ఇతను క్రీ.శ 399-414 మధ్య కాలంలో భారతదేశాన్నీ సందర్శించాడు. భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుంటే ఇతను మొదటివాడు. ఇతను భారత యాత్ర అనుభవాలని 'ఫో-కువో-కి ' (Fo-Ko-Kuli) అనే గ్రంథంలో వర్ణించారు.
బి) హుయాన్ త్సాంగ్:
🔯ఇతను భారతదేశంను సందర్శించి హర్షచక్రవర్తి నిర్వహించిన బౌద్ధమత సమావేశాలలో పాల్గొన్నాడు. ఇతను భారతదేశంలో పర్యటించిన విశేషాలను తన రచన సి-యు కీ' లో వివరించాడు .
3) టిబెటన్ గ్రంథాలు
🔯దివ్యవదన అనే టిబెటన్ బౌద్ధ గ్రంథము ఆశోకుని పాలనా వివరాలను తెలుపుతుంది :
4) శ్రీలంక గ్రంథాలు
🔯మహావంశ, దీపవంశ మరియు కులవంశ అనే సింహాల బౌద్ధగ్రంథాలు మౌర్యుల గురించిన వివరాలను అందజేస్తుంది.
5) అరబిక్ గ్రంథాలు
🔯'ఆల్ మసూది' కనౌజ్ పాలకుడైన మిహిరభోజుని పరిపాలనా వివరాలను తెలిపాడు. ఘజనీ మహమ్మద్ ఆస్థాన విధ్వాంసుడైన అల్బెరునీ తన గ్రంధమైన కితాబ్-ఉల్-హింద్ భారతదేశ ప్రజల జీవన విధానం గురించి పేర్కొన్నాడు. భారతదేశంలో మహమ్మదీయుల తొలి విజయాల గురించి మిన్హాజ్ - ఉద్దీన్-సిరాజ్ తన ప్రసిద్ధ తబకత్-ఇ-నాసిరి అనే గ్రంథంలో వ్రాశాడు. ఘజనీ పాలకుడైన మహ్మద్ ఘజనీ మంత్రి అయిన ఆల్-ఉల్- బీర్ మధుర దేవాలయ వైభవాన్ని వర్ణించాడు.
హెరిడోటస్
🔯 చరిత్ర పితామహుడు - హెరిడోటస్
🔯ఇతను ఆసియా మైనర్ నైరుతి భాగంలోని సముద్రతీరంలో ఉన్న గ్రీకు నగరమైన హాలికర్నాసస్ లో జన్మించాడు.
🔯ఇతని యొక్క ప్రముఖ గ్రంథం -హిస్టోరీస్ (Histories)
🔯ఈ గ్రంథంలో పారశీక సామ్రాజ్యం పుట్టుక గురించి, పారశీకులకు -గ్రీకులకు క్రీ.పూ. 499-479 మధ్య జరిగిన పోరాటాల గురించి ముఖ్యంగా జెర్కసీజ్ సైన్యాలు గ్రీకుల
చేతుల్లో ఓడిపోవడం గురించి వివరిస్తుంది.
🔯ఇతను ఈ గ్రంథంలో కేవలం పోరాటాల గురించే కాకుండా, సమకాలీన చరిత్ర గురించి కూడా సమగ్రంగా వివరించాడు.
0 Comments