⭐మన దేశంలో పశ్చిమం వైపు ప్రవహించి, అరేబియా సముద్రంలో కలిసే నదులు
⭐నర్మదా నది పశ్చిమం వైపు ప్రవహించే నదుల్లో అతి పెద్దది.
⭐నర్మదా నది వింధ్య, సాత్పురా పర్వతాల మధ్యలో ప్రవహిస్తోంది. నర్మదా నది విశీర్ణదరి గుండా ప్రవహిస్తుంది.
⭐ నర్మదా నదిని పగులు లోయ నది, మార్బుల్ రివర్ అని కూడా పిలుస్తారు.
⭐నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్ కంటక్ పీఠభూమి వద్ద జన్మించి, సోన్ నదికి వ్యతిరేఖ దిశలో ప్రవహిస్తుంది.
⭐నర్మదా నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా సుమారు 1,312 కి.మీ. ప్రయాణించి చివరగా గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కంభట్ లోని బ్రోచ్ లేదా బారుచ్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తోంది.
⭐ నర్మదా నది పరివాహక ప్రాంతం 98,790 చ.కి.మీ.
⭐నర్మదా నది పరివాహక ప్రాంతం అత్యధికంగా మధ్యప్రదేశ్ లోనూ ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనూ విస్తరించి ఉంది. నర్మదా నది అత్యధిక దూరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది.
⭐ నర్మదా నదిపై అత్యధిక ప్రాజెక్టులు ఉన్నవి.
⭐మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద ఉన్న దువనాధార జలపాతం అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఈ జలపాతాన్నిక్లాడ్ ఆఫ్ మిస్ట్ అంటారు.
⭐నర్మదా నది ఏర్పరిచే దీవి - ఆలియోటెట్,
⭐నర్మదా నది యొక్క ఉప నదులు.....
⭐ హిరన్, ఓర్ సంగ్, తావా, దూది, పరిపాన్, షార్, బార్నెర్, బంజర్, కుంది, షక్కర్, కోలర్ మొదలైనవి..
⭐ ఇటీవల నర్మదా నదికి సుమారు 101 ఉప నదులు ఉన్నట్లు గుర్తించారు.
⭐ పశ్చిమం వైపు ప్రవహించే నదుల్లో తపతి నది 25 అతిపెద్ద నది.
⭐తపతి నది సాత్పురా, అజంతా కొండల మధ్య ప్రవహిస్తోంది.
⭐ తపతి నది మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లాలోని ముల్లాయ్ వద్ద జన్మించి, నర్మదా నదికి సమాంతరంగా 724 కి.మీ.ల దూరం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది.
⭐తపతి నది అత్యధిక దూరం మహారాష్ట్రలో ప్రవహిస్తోంది.
⭐తపతి నదీ గుజరాత్లోని సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలోని
కలుస్తుంది .
⭐తపతి నది పరివాహక ప్రాంతం - 63,145 చ కి .మీ.
⭐ తపతి నది పరివాహక ప్రాంతం అత్యధికంగా మహారాష్ట్రలోనూ, ఆ తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ను విస్తరించి ఉంది.
⭐ నర్మద, తపతి నదులను కవలలు అంటారు.
⭐తపతి నది యొక్క ఉప నదులు: పూర్ణ, బేతుల్, పాట్కి, కాప్రా, గిర్నా, గంజాల్, పలేర్, బోరి మొదలైనవి..
⭐సబర్మతి నది రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలోని మేవార్ అనే ప్రాంతంలో జన్మించి, దక్షిణంగా ప్రవహిస్తూ జయసముద్రం సరస్సును తాకుతూ ఉదయ్ పూర్ గుండా వెళుతూ, దక్షిణ గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కంభట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తోంది.
⭐సబర్మతి నది పురాతన పేరు - గిరి కర్ణిక. సబర్మతి నదిని గుర్తించి పద్మ, గౌడపురాణంలో ప్రస్తావించారు.
⭐సబర్మతి నది పరివాహక ప్రాంతం రాజస్థాన్, గుజరాత్ లలో విస్తరించి ఉంది.
⭐సబర్మతి నది యొక్క ఉప నదులు: హరా, వాకల్, సీడీ, వేష్వా, హత్మతి మొదలైనవి.
⭐ మహి నది మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వతాల్లో పశ్చిమ భాగంలో సర్దారప్పూరు దక్షిణాన జన్మించి, మధ్యప్రదేశ్లో ఉత్తర వాయువ్యాన ప్రవహిస్తోంది. అక్కడి నుంచి రాజస్థాన్లో ప్రవేశించి, నైరుతి వైపు తిరిగి గుజరాత్ లోని గల్ఫ్ఆఫ్ కంభట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తోంది.
⭐ మహి నది ఒడ్డున ఉన్న ముఖమైన నగరం వడో దర,
⭐ మహి నది పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
⭐ మహి నది యొక్క ఉప నదులు: సోమ్, అనాస్, పనమ్ మొదలైనవి.
0 Comments