చారిత్రక పూర్వయుగ సంస్కృతులు (Pre-History in india)

 చారిత్రక పూర్వయుగ సంస్కృతులు 

⛤❋ చరిత్రను అధ్యయనం చేయడం కోసం మాత్రమే చరిత్రను మూడు భాగాలుగా విభజించారు చరిత్రకారులు.

1.పూర్వ చారిత్రక యుగం(ప్రాక్ చరిత్ర): లిపి లేని కాలచరిత్రను అధ్యయనము చేయలేని కాలము.

2.సంధికాల చారిత్రక యుగం (మూల చారిత్రక కాలం):లిపి ఉన్నా చదవలేని కాలము (చారిత్రక పూర్వయుగం, చారిత్రకసంధియుగ కాలాలను అధ్యయనం చేయడానికి పురావస్తుశాస్త్రం పై ఆధారపడవలసి ఉంటుంది) ఈ యుగానికి ముఖ్య ఉదాహరణ

సింధు నాగరికత. ఎందుకంటే వీరి లిపి సర్పలేఖనం. దీన్ని ఇంత వరకు ఎవరూ చదవలేదు.

3. చారిత్రక యుగం: లిపి ఉండి చరిత్ర అధ్యయనం చేయగల కాలం.

పూర్వ చారిత్రక యుగం

🔯 పూర్వ చారిత్రక యుగం (Pre-History) అంటే చరిత్రకు ముందుయుగం అని అర్ధం.

🔯పూర్వ చారిత్రక యుగం మానవ పుట్టుకతో ప్రారంభమై లిపివాడుకలోకి వచ్చేంత వరకు కొనసాగింది.

🔯 చరిత్ర అధ్యయనంలో పూర్వ చరిత్ర యుగం చాలా సుదీర్ఘమైన కాలం. సుమారు 10 లక్షల సంవత్సరాలు పైనుంచి ఈ చరిత్ర మనుగడలో ఉంది.

🔯 పూర్వ చరిత్ర యుగంలో రాతివాడకం ఎక్కువగా ఉండడం వలన దీనిని రాతి లేదా శిలాయుగం (Stone Age)అని కూడా చరిత్రకారులు సంభోదిస్తారు.

🔯 రాతి పనిముట్లలో వాటి పరిమాణాన్ని బట్టి సాంకేతిక పరంగా వచ్చిన మార్పుల ఆధారంగా ఈ యుగాన్ని వివిధ భాగాలుగా విభజించడం జరిగింది. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు...

🔯 పూర్వ చారిత్రక యుగానికి చెందిన 4 ప్రధాన సంస్కృతులు

  • 1) పాత రాతి(శిల) యుగం (Paleo Lithic Age) :క్రీ.పూ 10 లక్షల సంవత్సరాల పూర్వం నుండి 10,000 సంవత్సరం వరకు 
  • 2) మధ్య రాతి(శిల) యుగం (Meso Lithic Age);
  • క్రీ.పూ 10,000 నుండి 8,000 సంవత్సరం వరకు
  • 3) నూతన / కొత్తరాతి(శిల) యుగం (Neo Lithic Age): క్రీ.పూ 8,000 నుండి 4,000 సంవత్సరం వరకు
  • 4) రాగి శిలయుగం (Chalco Lithic Age):క్రీ.పూ 4,000 నుండి 3,000 సంవత్సరం వరకు |

1. పాత రాతి(శిల) యుగం (Paleo Lithic Age) :

🔯 పాలియో అనగా ప్రాచీన అని, లిథిక్ అనగా శిల అని అర్థం.

🔯 లారేజ్ అనే శాస్త్రవేత్త ఈ యుగాన్ని మళ్ళీ మూడు భాగాలుగా విభజించాడు.

  • (i) పూర్వ ప్రాచీన శిలాయుగం (లోయర్ పాలియోలిథిక్ పీరియడ్)
  • (ii) మధ్య ప్రాచీన శిలాయుగం (మిడిల్ పాలియోలిథిక్ పీరియడ్)
  • (iii) ఉత్తర ప్రాచీన శిలాయుగం (అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్)

ప్రాచీన శిలాయుగ లక్షణాలు:

🔯 ఈ యుగం మానవుడు నీగ్రిలో జాతికి చెందినవాడు.

🔯 ఈ యుగంలో మానవులు రక్త సంబంధీకులు, అందరూ కలిసి ఒక గుంపుగా ఏర్పడేవారు. ఈ గుంపునే కుదురుఅంటారు. (చిన్న చిన్న గుంపులుగా ఉండేవారు)

🔯 ఈ యుగం మానవుడి ముఖ్య వృత్తి :ఆహర సేకరణ (వేట)

🔯ఈ కాలం నాటి మానవుడి ఆహారం : 

  • పండ్లు
  • ఆకులు
  • పచ్చి మాంసం
  • దుప్పలు

🔯 ఈ కాలం నాటి ఆర్థిక వ్యవస్థను Hunting and Gathering Economy అంటారు.

🔯 ఈ యుగం మానవుడు ప్లీస్టోసీన్ యుగంలో జన్మించాడు. 

🔯 ఈ యుగం మానవుని జీవితాన్ని డి.డి. కోశాంబి స్వర్ణయుగం అని పేర్కొన్నాడు.

🔯 ఎందుకంటే ఈ యుగంలో మానవునికి రేపటి గురించి ఆలోచన లేదు.

🔯 ఈ యుగం మానవుడు ఉపయోగించిన రాయి - క్వార్ట్ జైట్  (స్పటికశిల) దీనినే పేబుల్స్ అంటారు.

🔯 ఈ యుగంలో అభివృద్ధి చెందిన పరిశ్రమను పెబుల్స్ పరిశ్రమ అంటారు.

🔯 ప్రాచీన కాలంలో మానవుడు పరికరాలు తయారు చేసుకోవడానికి దాగలి పద్ధతిని ఉపయోగించాడు.

🔯 చాపర్ (ఏకముఖ ఛేదనం) : ఒకవైపు మాత్రమే మొనదేలి ఉండటం.

🔯 చాపింగ్ (ద్విముఖ ఛేదనం) : రెండు వైపులా మొనదేలి ఉండటం.


ప్రాచీన శిలాయుగంపై పరిశోధన జరిపినవారు?

  1. కల్నల్ మెడోస్ టైలర్ 
  2. అలెగ్జాండర్ కన్నింగ్ హోం
  3. రాబర్ట్ బ్రూస్ ఫూట్

🔯 1863 తమిళనాడులోని పల్లవరం దగ్గర ప్రాచీన శిలాయుగం పనిముట్లని రాబర్ట్ బ్రూస్ ఫూట్ కనుగొన్నారు. అందుకే ఇతన్ని భారతదేశ ప్రాక్ చరిత్ర పితామహుడు అని పిలుస్తారు..

(i) పూర్వ ప్రాచీన శిలాయుగ పనిముట్లు

🔯 గులకరాతి పనిముట్లు :చాపర్, చాపింగ్

🔯 చేతి గొడ్డళ్లు :ద్విముఖాలు, బూస్తే, కూప్ -డి - ఇంగ్

🔯 గండ్ర గొడ్డళ్లు :U-ఆకారం కలవి, V-ఆకారం కలవి.

🔯 గోకుడు రాళ్లు (స్క్రాపర్స్)

🔯 రాబర్ట్ బ్రూస్ ప్పూట్ చేతి గొడ్డళ్ళ పరిశ్రమను కనుగొనబడిన ప్రదేశం  - కర్తలయార్లోని

🔯 అత్తిరాంపక్కం, వడమధురై (తమిళనాడు)

(II) మధ్య ప్రాచీన శిలాయుగ పనిముట్లు

🔯 మధ్య ప్రాచీన శిలాయుగపు సంస్కృతిని ముందుగా మహారాష్ట్రలోని ప్రచారలోయ పరివాహక ప్రాంతంలో కనుగొన్నారు.

🔯 ఈ సంస్కృతిని ముందుగా మహారాష్ట్రలోని నెవాసావద్ద కనుగొనడం వలన దీనిని నెవాసియన్ సంస్కృతి అనివ్యవహరించడమైనది. 

🔯 గోకుడు రాళ్లు (స్క్రాపర్స్) :

  • పక్క అంచు గోకుడు రాళ్లు (సైడ్ స్కాపర్స్)
  • కొన అంచు గోకుడు రాళ్లు (ఎండ్ స్పాపర్స్)
  • వృత్తాకారపు గోకుడు రాళ్లు (రౌండ్ స్కోఫర్స్)

🔯 మొనలు         

  • సాధారణ మొనలు 
  • తోక ఉన్న మొనలు 
  •  చిడ్రా కాలు (బోరర్స్)

(III) ఉత్తర ప్రాచీన శిలాయుగ పనిముట్లు 

  • బ్లేడ్లు (సన్నని అంచుగలవి, మొద్దు అంచుగలవి)
  • ఉలి అంచు మొనలు
  • చిరుకత్తులు
  • బాణపు మొనలు

🔯  ప్రాచీన శిలాయుగపు ప్రాంతాల్లో కనుగొనబడిన ప్రసిద్ధ గుహక్షేత్రం గల ప్రదేశం బింబెట్కా 
హైమిని లేవి తన సోషల్ థింకింగ్ అనే గ్రంథంలో ఇలా రాశాడు. మొత్తం చరిత్రను ఒక గంట సినిమా తీస్తే  అందులో 59 నిమిషాలు ప్రాచీన శిలాయుగం గురించి, అక్కడ నుంచి పారిశ్రామిక విప్లవం వరకు సెకనులు, అనంతరం జరిగిన పరిణామాలు 1 సెకను పడుతుందని పేర్కొన్నాడు.

2. మధ్య రాతి (శిల) యుగం (Mese Lithic Age).

🔯 ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగం మధ్యగల కాలాన్ని మధ్యశిలాయుగం అంటారు.
🔯 1956లో హెచ్.డి. సంకాలియా మహారాష్ట్రలోని ప్రవర నది ఒడ్డున నెవాసా అనే గ్రామం దగ్గర కొన్ని పరికరాలు ప్రత్తికి సంబంధించిన ఆనవాళ్ళను కనుగొన్నాడు. 
🔯 ఇవి అటు ప్రాచీన శిలాయుగానికి, ఇటు నవీన శిలాయుగానికి మధ్యలో వాడినట్లుగా కార్బన్ డేటింగ్ ఫలితాలు నిరూపించాయి.దీంతో భారతదేశంలో మధ్య శిలాయుగం కూడా ఉందని చరిత్రకారులు నిర్ధారణకు వచ్చారు.

మధ్య శిలాయుగ లక్షణాలు:

🔯 ఈ యుగం మానవుడు హేమాటిక్ జాతికి చెందినవాడు. గుహలలో ఎక్కువగా ఉండేవాడు.
🔯 ఈ యుగంలో మానవుని పరికరాలలో చాలా మార్పు వచ్చింది. ఈ యుగంలో తమ పరికరాలను 🔯 అతి సూక్ష్మగ  తయారుచేసేవారు. అందువలనే ఈ యుగాన్ని సూక్ష్మ రాతియుగం అంటారు.
🔯 కృత్రిమ గృహనిర్మాణమును ఈయుగములోనే ప్రారంభమైనది. ఉత్తరప్రదేశ్లోని ఇవి బయట
సరైన హార్ రాయి లో ఇవి బయటపడినవి .
🔯 ముఖ్యవృత్తి వేట (విల్లుని ఆవిష్కరించాడు). మానవ జీవిత విన్యాసంలో విల్లు ఆవిష్కరణ అసాధారణమైనది - గోర్డాన్ వైల్డ్.
🔯  కుక్కని పెంపుడు జంతువుగా చేసుకున్నాడు. 
🔯 ఈ కాలంలో పెచ్చుల పరిశ్రమ ముఖ్యమైంది. ఈ పరిశ్రమలో ముఖ్యమైనవి.
🔯  బ్లేడ్లు, బరమాలు (రంధ్రాలు పెట్టేవి).
🔯  విత్తనాల సేకరణ అనేది ఈ యుగంలోనే ప్రారంభమైనది..
🔯 నిప్పును కనుగొనడం ఈ యుగంలోనే జరిగింది. ఈ కాలంలో మృతదేహాలను ఖననం చేసేవారు 

🔯  వివిధ రాష్ట్రాలలో కనుగొనబడిన వివిధ వస్తువులు:

గుజరాత్ :  
  • బ్లేడ్లు
  •  చిరు పిడికత్తులు
  • గోకుడు రాళ్లు
  • సూచికలు 
రాజస్థాన్ :
  • ట్రాన్స్వర్స్ బాణపు మొనలు,చేదకాలు
ఈ కాలం నాటి సంస్కృతులను ఈ క్రింది రాష్ట్రాలలో గుర్తించారు

  • గుజరాత్: లాంఘ్నాజ్,
  • మధ్య భారతదేశం:పచ్మర్తి, ఆదంఘర్, మీర్జాపూర్
  • పశ్చిమబెంగాల్:బీర్బన్ పూర్,
  • తమిళనాడు:తేరి అనే సముద్ర రేఖా ప్రాంతాలు
  • మధ్యప్రదేశ్ ఆంఘర్లో పశుపోషణకు సంబంధించిన ఆనవాళ్ళను హెచ్.డి. సంకాలియా కనుగొన్నాడు. 
  • ఉత్తరప్రదేశ్ సరైనహార్ రాయ్ ల్లో 16 సమాధులను రాయ్ అనే పురావస్తు శాస్త్రవేత్త వెలికితీశాడు.
🔯కుండల తయారీ ఈ యుగంలోనే ప్రారంభమైనది. భారతదేశంలో తయారుచేసిన తొలికుండలు చోపాని మండోలో (ఉత్తరప్రదేశ్) బయటపడినవి, కుమ్మరి చక్రము నవీన శిలాయుగం నుండి వినియోగంలోకి వచ్చింది. 
🔯వాకంకర్, డి.హెచ్. గార్దన్ మొదలైనవారుపచిమరహీ  ప్రాంతంలో జరిపిన పరిశోధనలలో నారింజ పండు ధూమ్ర వర్గాలలోని చిత్రకళను గుర్తించారు.
🔯ఇలాంటి చిత్రకళ ఆంధ్రప్రదేశ్లో దప్పళ్ళి (కడప జిల్లా), బూదిగని (అనంతపురం జిల్లా), ఆదోని, చింతకుంట, దూపాడు గట్టు, కేతవరం, పులిచర్ల (కర్నూలు జిల్లా) వద్ద లభించినవి..
🔯 ఈ యుగంలో చిత్రించిన జంతువుల బొమ్మలు జింక, నక్క ,తాబేలు, కుందేలు
🔯ఈ కాలంలో జంతువులకు ఎక్కువ ప్రాముఖ్యం ఉండటం వలన వీరు వాటి చిహ్నములను ఆరాధన చిహ్నముగా ఎంచుకున్నారు. వీటినే టాలిమ్స్ అనేవారు. పశుపోషణ ఈ కాలములోనే ప్రారంభమైనది.

3.నూతన / నవీన / కొత్తరాతి(శిల) యుగం (Neo Lithic Age)


🔯ఈ యుగాన్ని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త వి. గోర్దాన్ చైల్డ్, దీనిని కొత్త రాతియుగపు విప్లవంగా పేర్కొన్నాడు
🔯కాశ్మీర్లోని జీలం నది పరివాహక ప్రాంతంలోని బూర్జహాం వద్ద తొలిసారిగా ఈ యుగపు సాంప్రదాయ ఆధారాలను కనుగొనడం జరిగింది.
🔯ఈ యుగంలో మానవుడు తన మేధోశక్తిని పెంచుకొని ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నారు.

నవీన శిలాయుగ లక్షణాలు:

🔯ఈ యుగపు మానవుడు ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతికి చెందినవాడు.
🔯ఈ యుగంలో మానవుడు సాధించిన విజయాలు:
  • వ్యవసాయం నేర్చుకోవడం
  • పశువులను పెంచడం
  • కుమ్మరి సారెను కనుగొనడం.
  • రాతి విగ్రహాల తయారీ
🔯ఈ యుగంలో పండించిన పంటలు: • రాగులు, ఉలవలు .
🔯ఈ యుగంలో పరికరాల తయారీకి ఉపయోగించిన రాళ్ళు: చెర్డ్ ,బసాల్ట్
🔯ఈ యుగంలో బండి చక్రాన్ని కనుగొని బండ్లను తయారుచేసుకున్నారు.
🔯 వ్యవసాయం చేయడానికి పశువులు అవసరం అయినాయి. కనుక పశుపోషణ చేపట్టారు.
🔯 జంతువులను మచ్చిక చేసుకున్నాడు. అవి : గొర్రెలు, మేకలు, కుక్కలు, పశువులు, 
🔯పశువుల పెంపకం వలన భూమిని దున్నడానికి పరికరం, పంటలకు మంచి సహజసిద్ధమైన ఎరువులు, పిల్లలకుపౌష్టికాహారమైన పాలు, పండిన పంటలను ఇండ్లకు చేర్చేందుకు రవాణా సదుపాయాలను కల్పించుకున్నాడు.
🔯పరిపాలనా వ్యవస్థ, నునుపైన పరికరాల తయారీని నేర్చుకున్నారు.
🔯సంఘ జీవనం, శ్రమ జీవనం, వృత్తులు ఏర్పడ్డాయి, వస్తు మార్పిడి మొదలైంది.
🔯 మాతృదేవతారాధన మొదలైంది. కుండలపై చిత్రాలు వేయడం ప్రారంభించారు.
శిశువులు, పెంపుడు జంతువులు మరణిస్తే వారు తమ ఇళ్ళలోనే ఖననం చేసేవారు.
🔯 వీరు ఇండ్లను బంకమట్టితోనూ, పచ్చి ఇటుకలతోనూ నిర్మించుకున్నారు.
🔯నవీన శిలాయుగం తొలిసారిగా బళ్ళారి జిల్లా రాయచూర్ దగ్గర ప్రారంభమైనదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
🔯ఒక్క భారతదేశంలోనే గాక ఆగ్నేయాసియా మొత్తంలో కూడా ఈ ప్రాంతమే జన్మస్థానం అని చరిత్రకారులుగుర్తించారు.
🔯 కుమ్మరి చక్రం అభివృద్ధికి చిహ్నం అని పేర్కొన్న చరిత్రకారుడు గోర్డాన్ చైల్డ్
🔯 ఈ యుగంలో లభించిన చిత్రలేఖనాలు (చిత్రాలు): విల్లంభులు ధరించిన మనిషి చిత్రం
కుక్క ,జింక 
🔯 గోర్డాన్ వైల్డ్ నవీన శిలాయుగాన్ని ప్యూర్ నియోలిథిక్ ,నియో-నియోలిథిక్ అని రెండు భాగాలుగా విభజించాడు.

నవీన శిలాయుగం నాటి ముఖ్య ప్రదేశాలు

  • 1) మహాగర (ఉత్తరప్రదేశ్) ఈ కాలంలో ఇచట బార్లీని ఎక్కువగా పండించారు. 
  • 2). ఛీరాండ్ (బీహార్) : ఇచట గోధుమలు, వరి, బార్లీని పండించారు. పామును పూజించినట్లు ఆధారాలు లభ్యమయ్యారు.ఎముకతో చేసిన సూది లభించినది. ఇందువలన వస్త్రాలను కుట్టుకునేవారని తెలుస్తుంది. 
  • 3) కొద్దీవ (ఉత్తరప్రదేశ్): వరి పండించిన ఆనవాళ్ళు లభ్యమైనవి. ప్రపంచంలోనే మొదటిసారిగా వరిని పండించిన ఘనత వీరికి లభ్యమయింది. 
  • 4) మెహర్గర్ (పాకిస్థాన్) : వాయువ్య భారతదేశంలోని బెలుచిస్తాన్ రాష్ట్రంలో కలదు. (అనగా నేటి పాకిస్తాన్).భారత ఉపఖండంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయం జరిగిన ప్రాంతం. ఇచట గోధుమలు, బార్లీ, ప్రత్తి పండించారు. ప్రపంచంలోనే ప్రత్తి పండించిన తొలి ప్రజలు వీరు. ఇచట కుమ్మరి చక్రం లభించింది.
  • 5) బూర్జహం (జమ్మూ & కాశ్మీర్): కాశ్మీర్ నందు శ్రీనగర్కు సమీపంలో జీలం నది ఒడ్డున గల ఈ నగరంలో అనేక నవీన శిలాయుగ అవశేషాలు లభించాయి. బూర్జహం అనగా జన్మస్థలం అని అర్థం. ఈ కాలం నాటి ప్రజలు ఇచట గోతులు త్రవ్వి నివాస గృహాలను నిర్మించుకున్నారు. ఇచట యజమానితోపాటు కుక్కను ఖననం చేసిన అనవాళ్లు లభించాయి. ఎముకలతో చేసిన పనిముట్లు లభించాయి.
  • 6) సంగనకల్లు (కర్ణాటక): కుండల తయారీకి సంబంధించిన అనవాళ్ళు, నునుపైన పరికరాలు బయటపడినవి.

4) రాగి / తామ్ర శిలాయుగం (Chalco Lithic Age) 

🔯 ఈ యుగంలో మానవుడు క్రమంగా లోహాలను ఉపయోగించడం నేర్చుకున్నాడు.
🔯మానవుడికి శిలాయుగం నుండి లోహ యుగానికి మారడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది.
🔯మానవుడు ఉపయోగించిన మొదటి లోహం - రాగి
🔯ఈ యుగంలో మానవుడు శిలా పనిముట్లను, రాగి పనిముట్లను రెండింటిని ఉపయోగించాడు.
🔯 ఈ యుగంలో నదీతీర ప్రాంతాలలో గ్రామీణ జనపదాలు ఏర్పడినవి.

లోహ యుగం నాటి ముఖ్య ప్రదేశాలు.

  • 1. రాజస్థాన్లోని అహర్ :అహర్ కు పురాతన పేరు తంబావతి అంటే రాగి ఉన్న చోటు అని అర్ధం. అజర్లోనివసించిన ప్రజలు బల్లపరుపుగా ఉన్న గొడ్డళ్లు, కత్తులు, గాజులు వాడినట్లు
  • ఆధారాలు లభించాయి
  • 2. రాజస్థాన్లోని గిలుండ్: రాగి కత్తుల పరిశ్రమ కనుగొనబడినది.  కాల్చిన ఇటుకలు, రాళ్లతో ఇళ్ళు నిర్మించుకున్నారు.
  • 3. మహారాష్ట్రలోని దైమాబాడ్ :ఇప్పటి వరకు బయటపడ్డ 200 జోర్వే సంస్కృతి స్థానాలలో అన్నింటికంటే పెద్దది. గోదావరి లోయలోని దైమాబాద్. పెద్ద సంఖ్యలో రాగి వస్తువులు లభించడం చేత డైమాబాద్ ప్రసిద్ధి చెందింది. ఉదా: వృషభంపై దాడి చేస్తున్న పులి బొమ్మ గలఎర్రపాత్ర దైమాబాద్లో బయటపడింది.
  • 4. మహారాష్ట్రలోని ఇనాంగాన్ :ఇనాంగాన్ రాగి - రాతి యుగానికి చెందిన పెద్ద కేంద్రం, మట్టి గట్టుతో నిర్మితమైనపంట కాలువ, మాతృదేవతను పోలిన విగ్రహం, ప్రత్తి వడికిన ఆధారాలు బయటపడ్డాయి.
  • 5. మహారాష్ట్రలోని జోర్వే :జోర్వేలో ఎరుపు మట్టి పాత్రల పై నలుపురంగు వేసిన పాత్రలు లభించాయి. పాత్రలపై తొలిసారిగా చిత్ర రచన చేసిన వారు ఈ ప్రాంతం వారేనని తెలుస్తుంది.
  • 6. మధ్యప్రదేశ్లోని మాళ్వా :మాళ్వాలో మగ్గం కండెలు లభించాయి. ఎద్దు విగ్రహం లభించింది. ఇది వారిమత చిహ్నం అయి ఉండొచ్చు. ఇచ్చట శివలింగం, యజ్ఞయాగాలకు సంబంధించినఆనవాళ్ళు లభించాయి.
  • 7. గంగా యమున ప్రాంతం: గంగా యమున మైదానంలో వ్యవసాయం, చేతి వృత్తులు ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. ఇచట మట్టి పాత్రలను ఉపయోగించిన అనవాళ్ళు లభించాయి.
  • 8. రాజస్థాన్లోని గణేశ్వర్ : ఈ ప్రాంతంలో బాణాలు, చేపలు పట్టే గాలాలు, కత్తులు దొరికాయి.మధ్యప్రదేశ్లోని భీంబెట్కాలో మానవుడు వేసిన చిత్రాలు లభ్యమయ్యాయి. ఇవి యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వకేంద్రంగా గుర్తింపు పొందింది. ఇచట ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం మరియుతామ్రశిలాయుగానికి చెందిన చిత్రాలు లభించాయి.
🔯 ప్రాచీన శిలాయుగం నుంచి లోహయుగం వరకు అన్ని దశలకు చెందిన పనిముట్లు సువర్ణరేఖ నదీ తీరంలోని ఘట్ శిలా  (జార్ఖండ్), మయూర్ భంజ్ (ఒడిశా) ప్రాంతాల్లో లభించాయి.

చరిత్రపై ప్రముఖుల వ్యాఖ్యానాలు:

🔯 ఉన్న అబద్ధాలన్నింటిలో ఏ అబద్ధం చాలా వరకు వాస్తవంగా కనిపిస్తుందో అన్వేషించమే చరిత్ర- రుసో 
🔯 ఇంత వరకు జరిగి చరిత్రంతా వర్గ పోరాటాలే -కారల్ మార్చ్
🔯 గతానికి, వర్తమానానికి మధ్య జరిగే నిర్విరామ భాషణమే చరిత్ర -హెచ్, కార్
🔯 మార్పులేని, ఏకరూపమైన గతాన్ని తెలిపే వృత్తాంతమే చరిత్ర- అరిస్టాటిల్

ఆర్కియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా :

🔯 1861 అలెగ్జాండర్ కన్నింగ్ హెూం ఆధ్వర్యంలో స్థాపించబడినది.
🔯 ఈ సంస్థ భారతదేశ సాంస్కృతిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
🔯 ఈ సంస్థ స్థాపన కాలం నాటి గవర్నర్ జనరల్ - లార్డ్ కానింగ్
🔯 1904లో లార్డ్ కర్జన్ హయాంలో దీనిని పునరుద్ధరించడం జరిగింది.
🔯 భారత ఆర్కియాలజీ పితామహుడు - అలెగ్జాండర్ కన్నింగ్ హోం

ప్రాచీన చరిత్రకు సంబంధించిన ఆధారాలు

        ప్రదేశంపేరు                                               లభించిన ఆధారం
  1. నేవేసా                                       ప్రత్తికి సంబంధించిన ఆధారాలు
  2. హస్తినాపురం                             చెరకు ఉపయోగించిన ఆధారాలు
  3. భీంబెట్కా                                  500 చిత్రాలతో కూడిన గుహలు:
  4. కోల్దివా                                        వరికి సంబంధించిన ఆధారాలు
  5. మెహర్ ఘర్                               వ్యవసాయం చేసిన ఆధారాలు
  6. ఆదంఘర్                                  జంతువుల మచ్చికకు సంబంధించిన ఆధారాలు
  7. ఆంత్రాజీ ఖేరా                           వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు
  8.  ముల్లాయిబాగ్ (కాశ్మీర్)             మొదటి మానవుని అవశేషాలు లభించాయి.

👉 చరిత్ర ,చరిత్ర ఆధారాలు 

👉 కోల్పోయిన బంగారు నగరం 

👉 చరిత్ర ఆధారాలు  Inscriptions

👉 చరిత్ర ఆధారాలు  Literary Sources

Post a Comment

0 Comments

Close Menu