⭐నదీ వ్యవస్థ వల్ల వ్యవసాయంతో పాటు, పారిశ్రామిక, రవాణా రంగాల పరంగా భారతదేశం ఎంతో లబ్ధి పొందుతోంది. నదీ వ్యవస్థ ద్వారానే వ్యవసాయ రంగానికి అవసరమైన ఒండ్రు మట్టి నేలలు, డెల్టాలు సమకూరుతున్నాయి.
⭐దేశంలోని నదులను హిమాలయ, ద్వీపకల్ప నదులుగా విభజించవచ్చు. వీటితో పాటు అంతర్ భూభాగ నదులుకూడా భారతదేశంలో ఉన్నాయి.
⭐దేశంలోని 77 శాతం నదులు బంగాళాఖాతంలో, 23 శాతం నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.
⭐ దేశంలోని మొత్తం నీటి పరిమాణంలో 90 శాతం నీరు బంగాళాఖాతంలో కలుస్తుంటే, 10 శాతం నీరు అరేబియా సముద్రంలో కలుస్తోంది.
⭐నదుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం - పోటమాలజీ.
⭐ నీటి గురించి అధ్యయనం చేయు శాస్త్రం - హైడ్రాలజీ.
⭐ప్రపంచ నదుల దినోత్సవం - సెప్టెంబర్ 28 ,
⭐ప్రపంచ నీటి దినోత్సవం - మార్చ్22.
⭐ఐక్యరాజ్య సమితి 2003 సం॥ను ప్రపంచ మంచి నీటి దినోత్సవంగా ప్రకటించినది.
⭐ జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళికలో ప్రస్తుతం 38 నదులను చేర్చారు.
⭐భారతదేశంలోని నదీ పరీవాహక ప్రాంతం / నదుల పరిమాణం ఆధారంగా నదీ వ్యవస్థను మూడు భాగాలుగా విభజించారు. అవి..
⭐సుమారు 20,000 చ.కి.మీ లేదా అంత కంటే ఎక్కువ జలగ్రహణ ప్రాంతాన్ని (Catchment area) కలిగి ఉన్న నదులను / 20,000 చ.కి.మీ లేదా అంత కంటే ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే నదులను ప్రధాన నదులు (Major rivers) అంటారు.
⭐ ఇటువంటి ప్రధాన నదులు మనదేశంలో 14 నదులు ఉన్నాయి.
⭐దేశంలో ఉన్న ఈ 14 పెద్ద నదులు మొత్తం రన్ఆఫ్ లో 85 శాతాన్ని ఆక్రమించినవి.
⭐ సుమారు 2,000 నుండి 20,000 చ.కి.మీ మధ్య జలగ్రహణ ప్రాంతం కలిగి ఉన్న నదులను / 2,000 నుండి 20,000 చ.కి.మీ. మధ్య ఆయకట్టుకు నీరు అందించే నదులను మధ్య తరహా నదులు అంటారు.
⭐ ఇటువంటి మధ్య తరహా నదులు మనదేశంలో 49 నదులు ఉన్నాయి.
⭐ దేశంలో ఉన్న ఈ 49 మధ్య తరహా సదులు మొత్తం రన్ ఆఫ్ లో 7 శాతాన్ని ఆక్రమించినవి.
⭐ 2,000 చ.కి.మీ కంటే తక్కువ జలగ్రహణ ప్రాంతాన్ని కలిగి ఉన్న నదులను / 2,000 చ.కి.మీ. కంటే తక్కువ ఆయకట్టుకు నీరు అందించే నదులను చిన్న నదులు అంటారు.
⭐ ఇటువంటి చిన్న నదులు దేశంలో దాదాపు 196 ఉన్నాయి.
⭐ దేశంలో ఉన్న ఈ 196 చిన్న నదులు మొత్తం రన్ ఆఫ్ లో 8 శాతాన్ని ఆక్రమించినవి. భారతదేశంలోని మొత్తం రన్ ఆఫ్ (Run of) లో 85 శాతం ప్రధాన నదులు, 7 శాతం మధ్య నదులు, 8 శాతంచిన్న నదులు ఉన్నాయి.
⭐ భారతదేశంలోని నదీ వ్యవస్థను ఉద్భవరీత్యా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.....
⭐ఈ నదులు సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని జీవ నదులు అంటారు.
⭐రుతుపవన కాలంలో ఈ నదులకు తరచుగా వరదలు సంభవిస్తాయి.
⭐ ఈ నదులలో కొన్ని పూర్వ వర్తిత రకానికి చెందినవి. అంటే ఆయా నదులు హిమాలయాలు ఆవిర్భవించక ముందే ఆ ప్రాంతంలో జన్మించాయి. ఉదా సింధూ, సట్లెజ్, బ్రహ్మపుత్ర,
⭐మరికొన్ని నదులు అంతరవర్తిత రకానికి చెందినవి. అంటే ఆ నదులు హిమాలయాల ఆవిర్భావం తర్వాత జన్మించాయి.
⭐ఉదా : గంగా, యమున, రామ్ గంగా, శారదా.
⭐ హిమాలయ నదులు ద్వీపకల్ప నదులతో పోల్చితే తక్కువ వయసు కలిగుంటాయి.
⭐భారతదేశంలోని మొత్తం నదీ ప్రవాహ పరిమాణంలో హిమాలయ నదులు దాదాపు 70 శాతం వాటాను కలిగిఉన్నవి.
⭐ హిమాలయ నదులు నౌకాయానానికి అత్యంత అనుకూలంగా ఉండును.
⭐ హిమాలయ నదులు వాటి ప్రవాహ మార్గంలో నదీ వక్రతలను కలిగి ఉంటాయి.
⭐ హిమాలయ నదులు U ఆకారపు గార్గ్ ల గుండా ప్రవహించును.
⭐హిమాలయ నదులకు పునరుజ్జీవనం ఉండదు. ఇవి శాఖీయ ప్రతిరూపాన్ని కలిగి ఉంటాయి.
⭐ హిమాలయ నదీ వ్యవస్థలో ప్రధానంగా మూడు నది వ్యవస్థలున్నాయి. అవి..
0 Comments