satavahana 1 (శాతవాహనుల రాజకీయ పరిణామ క్రమం)

                                      శాతవాహనుల రాజకీయ పరిణామ క్రమం



  • మత్స్యపురాణం వీరి వంశావళిని, ఒక్కొక్కరి పాలనా కాలము ప్రకారం స్పష్టంగా తెలిపింది.
  • ఈ మత్స్య పురాణాన్ని పరిగణనలోకి తీసుకొని శాతవాహనుల కాలాన్ని క్రీ.పూ. 271 నుండి 174కు వరకు ఉందని ఒక అంచనా వేసారు.
  • మత్స్యపురాణం ఆధారంగానే ప్రస్తుతం మనం శాతవాహన రాజకీయ చరిత్రను మనం అనుసరిస్తున్నాము.
  • వాయు పురాణం లో ౧౭౫ మంది రాజులు ఉండేవారని దాదాపు ౨౭౨ సంవస్తరాల కాలంపాటు పరిపాలించారని తెలిపారు.
  • మత్స్యపురాణం లో అయితే 30 మంది రాజులగురించి తెలిపారు.( మత్స్యపురాణం wiki )
  • శాతవాహన వంశనామానికి సంబంధించిన కథ గల ఇంకో పురాణం - విష్ణుపురాణం
  • ఈ మత్స్యపురాణం అనుసరించి శాతవాహనులను తొలి శాతవాహనులు, మలి శాతవాహనులుగా విభజించారు.
  • 1- 23 మంది తొలి శాతవాహనులుగాను
  • 24-30 మంది మలి శాతవాహనులు గాను విబజించారు

తొలివాహనులలో గొప్పరాజు : మొదటి శాతకర్ణి (3వ రాజు)
మలి శాతవాహనులలో గొప్పరాజు : యజ్ఞశ్రీ శాతకర్ణి (27వ రాజు)
శాతవాహనులందరిలో గొప్పరాజు : గౌతమీపుత్ర శాతకర్ణి (23వ రాజు)
ఎక్కువ సంవస్తరాలు పరిపాలించింది : 2వ శాతకర్ణి (6వ రాజు దాదాపు 56 సం॥లు)
శాతవాహనుల్లో చివరివాడు : 3వ పులోమావి (30వ రాజు) 
  • మూల పురుషుడు (పురాణాల ప్రకారం) : శ్రీ ముఖుడు
  • అదే శాసనాలు, నాణెలు, సోమదేవుని కథాసరిత్సాగరం ప్రకారం వీరి మూలపురుషుడు - సాతవాహనుడు

శాతవాహనుల రాజధాని :

  • 1. కృష్ణా జిల్లా లోని శ్రీకాకుళం (బార్నెట్, బార్జెస్ పరిశోధనల ప్రకారం ,V A స్మిత్ )
    2. గుంటూరు జిల్లా లోని ధాన్యకటకం/ ధరణికోట (R . G భండార్కర్ )
    3. ప్రతిష్టానపురం రాసి, రామారావ్, రాయ్ చౌదరీల పరిశోధనల ప్రకారం
    4.శాతవాహనుల రాజధాని విజయవాడ - రాయ్ చౌదరీ. ఇలా శాతవాహనుల రాజధానికి సంబంధించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు కలవు.
    మనం మాత్రం మొదటి రాజధాని ప్రతిష్టానపురం గాను రెండవది ధాన్యకటకం/ ధరణికోట గా చదువుకొంటాం
    మొదటి రాజధాని - ప్రతిష్టానపురం/ పైథాన్ (మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లా)
    రెండవ రాజధాని - ధాన్యకటకం (గుంటూరు జిల్లా)

మత్స్యపురాణంను అనుసరించి శాతవాహన రాజకీయ చరిత్ర

శ్రీముఖుడు (సిరి చిముక శాత)

  • వీరు శాతవాహన రాజ్య స్థాపకుడు గా కీర్తించబడతారు.
  • శ్రీముఖుడు గారి తండ్రి - శాతవాహనుడు / శాలివాహనుడు
  • ఈయన 'ప్రతిష్టానపురము'ను రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలించాడు.(మొదటి రాజధాని)

వీరికి సంబంధించిన ఆధారాలు ఏమి దొరికాయి ?

  • ఇతని కోడలు దేవి నాగానిక వేసిన 'నానాఘాట్' శాసనం (ప్రాకృత భాషలో ఉంది)
  • వీరు ముద్రించిన నాణెములు కొండాపూర్ (మెదక్), కోటిలింగాల (కరీంనగర్)లలో కొన్ని బయటపడినాయి.
  • ఇతని నాణాలపై రణగోభద్ర, రణగోస్వామి అనే పేర్లు ఉన్నాయి.
  • దేవి నాగానిక తన నానాఘాట్ శిలా శాసనంలో "సిరి చిముక శాత" అనే పదాన్ని పేర్కొన్నది.
  • అశోకుడు తన 13వ శిలాశాసనంలో ఆంధ్రులను తన సామంత జాతులలో ఒకరుగా పేర్కొన్నారు ... ఆ సామంతుడే శ్రీముఖుడు గా చెబుతారు.

అశోకుడికి సమకాలికుడు ఎవరు ?

  • అశోకుడు శ్రీముఖునికి 'రాయ' అనే బిరుదు ఇచ్చినట్లు ప్రముఖ చరిత్రకారుడు డి.సి. సర్కార్ అభిప్రాయం.
  • ఇతడు మొదట జైన మతాన్ని స్వీకరించి, ఆ తరువాత వైదిక మతాన్ని అనుసరించాడు.
  • ఇతని జైన మత గురువు - కాలకసూరి (విమలాదిత్య-త్రికాలయోగి)
  • శ్రీముఖుడి మరణానంతరం ఇతని కుమారుడు మొదటి శాతకర్ణి చిన్నవాడు కావడం వల్ల ఇతని సోదరుడు అయిన కన్హ లేదా కృష్ణ రాజ్యానికి వచ్చాడు.

కన్హ/కృష్ణ:

  • ఈయన శాతవాహన రాజులలో 2వ రాజు
  • కన్హ పాలనా కాలంలోనే శాతవాహనులు మహారాష్ట్రలోనికి చొచ్చుకుపోయారు.
  • వీరు నాసిక్ వరకు రాజ్యాన్ని విస్తరించి బౌద్ధ బిక్షువులకు రెండు విహారాలను నిర్మించి ఇచ్చాడు.
  • అవి 1. నాసిక్ 2.కన్హేరి
  • ఇతని పరిపాలనా కాలంలోనే ఆంధ్రలోనికి భాగవతమతం ఉత్తర భారత దేశము నుండి ప్రవేశించింది.
  • వీరు వైదిక - బ్రాహ్మణ మతాన్ని అవలంభించినా, బౌద్ధాన్ని కూడా ఆదరించినట్లు అతని కాలానికి చెందిన ఒకే ఒక నాసిక్ శాసనం వలన తెలుస్తుంది.
  • బౌద్ధ సన్యాసుల కొరకు ధర్మ మహామాత్య అనే ఉద్యోగులను నియమించాడు.

నోట్ :

  • భాగవతమతం మొదట ఉత్తర భారత్ లో - పుష్యమిత్రశుంగుని కాలంలో వెలుగులోకి వచ్చింది
  • భారత దేశం లో భాగవతమతం వున్నట్లుగా తెలియజేయు శాసనం-హీలియోడోరస్ యొక్క “బేస్నాగర్” శాసనం.
  • భాగవత మత స్థాపకుడు - శ్రీకృష్ణుడు (వాసు దేవుడు)

మొదటి శాతకర్ణి

  • మౌర్యుల సామంతులుగా కొనసాగిన శాతవాహనులు మొదటి శాతకర్ణి కాలంలో స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు.
    ఈయన శ్రీముఖుడి కుమారుడు
  • తొలి శాతవాహనులల్లో ఈయన గొప్పవాడు గా కీర్తించబడతారు.
  • వీరిని మత్స్య పురాణంలో "మల్లకర్ణ” “మహాన్” అని పేర్కొంది.
  • మొదటి సారిగా తన పేరుకు "శాతవాహన" అనే వంశనామాన్ని జోడించిన తొలి శాతవాహన రాజు ఈయన మొదటి శాతకర్ణి
  • వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించిన శాతవాహన రాజు కుడా మొదటి శాతకర్ణి గా చెప్పవచ్చు.
  • ఇతను రఠిరుల రాజైన మహారధి (ఆంగియుకుల వర్ధనుడైన) త్రైణకరో కుమార్తె దేవి నాగానిక (నాగవరదాయినీ)ను వివాహం చేసుకొన్నాడు.
  • దేవి నాగానిక, "నానాఘాట్ శాసనంను" (ప్రాకృతం) ఈ అంశాన్ని వేయించింది.
  • మొదటి శాతకర్ణి తన రాజ్య విస్తరణను పశ్చిమ దిశవైపు నుండి దండెత్తి, అస్మక (నిజామాబాద్), అకర,అవంతి, ములక (ఔరంగాబాద్), మాళ్వా ప్రాంతాలను జయించాడు.
  • పట్టణ తోరణ గుర్తుగల నాణెము...మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగున్ని ఓడించి అందుకు గుర్తుగా ఉజ్జయిని పట్టణ తోరణ గుర్తుగల నాణెములను వేయించాడు.
  • మొదటి శాతకర్ణి "గజగుర్తు" గల నాణేములను వేయించాడు.
  • తొలిసారిగా బ్రాహ్మణులకు వెండి నాణేంలను దానం చేయడంతో పాటు, పన్ను మినహాయింపు భూములను కూడా దానం చేశాడు.
  • కళింగాధిపతియైన మహా మేఘవాహన ఖారవేలుడు మొదటి శాతకర్ణిపై దండెత్తి ఓడించినట్లుగా ఖారవేలుగు హాథిగుంప శాసనం,గుంటుపల్లి శాసనాల్లో పేర్కొన్నాడు.
  • మొదటి శాతకర్ణి యవన రాజైన డెమిట్రియను కూడా ఓడించాడు.
  • శాతవాహనులల్లో వైదికమతం ప్రకారం యజ్ఞయాగాదులను నిర్వహించిన మొదటిరాజు ఇతనే.

యాగాలు ఏమి  చేశాడు

  • రెండు - అశ్వమేధ యాగాలు
  • ఒక - అనారంభనీయ యాగం
  • మూడు - దశరాత్ర యాగం
  • ఒక - రాజసూయ యాగం
  • ఒక - అగ్నిదేయ యాగం
  • మొదటి శాతకర్ణి ఈ యాగాల సందర్భంగానే బ్రాహ్మణులకు
  • పన్నులు లేని భూములను దానంగా ఇచ్చాడు.
  • 36000 కర్షపణాలు (కర్షాపణ-వెండినాణాలు)
  • 44000 గోవులు
  • 13 గ్రామాలు
  • 10 ఏనుగులు, 1000 గుర్రాలను దానంగా ఇచ్చాడు.

మొదటి శాతకర్ణి సమకాలిన భారతదేశ రాజులు

  • మగధ (ఉత్తర భారతదేశం) - పుష్యమిత్ర శుంగుడు
  • కళింగ (ఒరిస్సా) - ఖారవేలుడు 
  • ఇండోగ్రీకు రాజు - డెమిట్రియస్, మీనాండర్

మొదటి శాతకర్ణి బిరుదులు 

  • ఏకవీర
  • శూర
  • అప్రతిహత చక్ర
  • దక్షిణాపథపతి

వేదసిరి (పూర్ణోత్సుంగుడు) 

  • వీరు మొదటి శాత కర్ణి, దేవి నాగానికల కుమారుడు ఈ  వేదసిరి.
  • వేదసిరికే పూర్ణోత్సుంగుడు అని పేరు కలదు. ఈ పేరు వైదిక మతాన్ని ఆదరిస్తున్నట్లు సూచిస్తుంది.
  • నానాఘాట్ గుహలలో శ్రీముఖుని, కన్నుని ప్రతిమలతో పాటు తల్లి నాగనిక, తాత త్రైణకరో ప్రతిమలను వేయించాడు.
  • ఇతడి పాలనాకాలంలో కళింగ ఖారవేలుడు భట్టిప్రోలుపై దాడిచేశాడు.
  • వీరి తరువాత పాలనలోకి వచ్చినది స్కంధస్థంభి, ఇతని తరువాత రెండవ శాతకర్ణి వచ్చారు.
  • స్కంధస్థంభి అంత ముఖ్యమైన రాజు కాదు.

రెండవ శాతకర్ణి

  • ఈయన వరుసక్రమము లో 6వ రాజు.
  • ఎక్కువ సంవస్తరాలు పాలించిన రాజు గా కీర్తించబడ్డాడు. (56 సంవస్తరాలు కాలం పాటు)
  • ఇతను సాంచీ స్థూపంకు దక్షిణ తోరణాన్ని నిర్మించి, శాసనాన్ని వేయించాడు.
  • వీరి పాలనా కాలంలోనే శక, శాతవాహన ఘర్షణలు ప్రారంభమయ్యాయి
  • మాములుగా శకులు 2 రకాలు:
    1) కర్థమాంక వంశం (మాళ్వా ప్రాంతం) వీరందరిలో గొప్పవాడు రుద్రదాముడు.
    2) క్షహరాట్ వంశం (మహారాష్ట్రలో) వీరందరిలో గొప్పవాడు నహపాణుడు.
  • రెండవ శాతకర్ణి కాలంలో గతంలో శాతవాహనులు కోల్పోయిన ప్రాంతాలను తిరిగి వశపరుచుకున్నాడు.
  • ఈ అంశాన్ని బిల్సా శాసనంలో పేర్కొనబడ్డాడు.
  • రెండవ శాతకర్ణి నాణెంలు మాళ్వా, మహారాష్ట్ర, తెలంగాణ తదితర ప్రాంతాలలో లభించాయి.
  • మాళ్వాలో లభించిన ఇతని నాణెంల మీద “రాణోసిరి సతకనిక" అనే వ్యాఖ్య ఉంది.
  • రెండవ శాతకర్ణి బిరుదు : రాజన్య శ్రీ శాతకర్ణి
  • వీరి ఆస్థాన కళాకారుడు వశిష్టీపుత్ర ఆనంద

2వ శాతకర్ణి తరువాత పరిపాలకులిగా లంబోధరుడు, అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కంధస్వాతి, మృగేంద్రస్వా, రాజ్యానికి వచ్చారు.

కుంతల శాతకర్ణి

  • ఇతను 13వ రాజు.
  • కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృతం బదులు సంస్కృతం రాజ భాషగా మారింది.
  • రాజశేఖరుని కావ్య మీమాంస, వాత్సాయనుని కామసూత్ర, గుణాఢ్యుడి బృహత్కథలలో ఇతని ప్రస్తావన ఉంది.
  • ఇతని బిరుదు - విక్రమార్క (నండూరి కృష్ణమాచార్యుల ప్రతిపాదన ప్రకారం)
  • ఈయన ఆస్థానంలో వాత్సాయనుడు ఉండేవాడు.

వాత్సాయనుడి గ్రంధాలు:

  • కామసూత్ర (సంస్కృతం)
  • న్యాయ బాష్యం
  • కామసూత్రను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించింది ఎవరు ?
  • పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి.
  • కామసూత్ర శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవన విధానం గురించి వివరిస్తుంది.
  • ఈ గ్రంథం ప్రకారం కరీర్త అనే కామసంబంధిత భంగిమలు అమలులో వున్నట్లుగా తెలుస్తుంది.
  • కుంతల శాతకర్ణి భార్య మళయవతి (కరీర్త రతి భంగిమ ద్వారనే మరణించింది)
  • ఈ కుంతల శాతకర్ణి శకులను ఓడించి మాళ్వా, మహారాష్ట్రలను తిరిగి సంపాదించాడు.
  • ఈయన బార్య తో సంభాషించే సందర్భంలో సంస్కృత భాష రాకపోవడం వల్ల అవమానం గా బావించి సంస్కృతం నేర్పమని తన ఆస్థాన కవులను కుంతల శాతకర్ణి ఆదేశం జారిచేసాడు.
  • ఆరు నెలల్లో ఈయన సంస్కృతం నేర్చుకున్న తరువాత ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను రాజభాషగా ప్రకటిగాడు.తరువాత సంస్కృతం శాతవాహనుల రాజభాషగా మారింది.

వీరి ఆస్థాన కవులలో ముఖ్యులు 

  • శర్వవర్మ : కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంధాన్ని రాశాడు.
  • 6 నెలల్లో రాజు సంస్కృతాన్ని నేర్చుకొనడానికి వీలుగా మూలగ్రంథంలో వున్న శ్లోకాలను తగ్గించి ఈ వ్యాకరణాన్ని రాశాడు.
  • ఈ వ్యాకరణం ద్వారానే రాజు(కుంతల శాతకర్ణి) సంస్కృతాన్ని అభ్యసించాడు.
  • గుణాధ్యుడు : ఇతని రచన - బృహత్కథ (ప్రాచీన ప్రాకృత లేదా పైశాచిక భాషలో ఉంటుంది)
  • రాజుకు సంస్కృతాన్ని నేర్పే విషయంలో 6 నెలల్లో నేర్పడం సాధ్యం కాదని శర్వవర్మతో గొడవ జరిగి రాజ బహిష్కరణ చేయబడుతాడు.
  • ఇతడు పైశాచిక భాషలో బృహత్కథను రాసి రాజుకు చూపగా రాజు తిరస్కరించడంతో పాటు బృహత్కథను కాల్చి వేసాడు.
  • కాల్చిన తరువాత దానిలో మిగిలిన ఒకే ఒక లంబకం (అధ్యాయం) ఆధారంగా సోమదేవసూరి కథాసరిత్సాగరం అనే గ్రంథాన్ని రాసాడు.
  • బృహత్ కథలోని నాయకుడు - కుబేరుడు / కుబ్బీరుదు.
  • శర్వవర్మ మరియు గుణాడ్యుడు మధ్య సవాలు గురించి వివరించిన వాడు సోమదేవు ఈ విషయాన్ని తన కథా సరిత్సాగరంలో పేర్కొన్నాడు.
బృహత్ కథ ఆధారంగా రచింపబడ్డ ఇతర గ్రంథాలు ఏమి ?
  • క్షేమేంద్రుడు : బృహత్కథ మంజరి
  • హరిసేనుడు : బృహత్ కోష
  • వరాహమిహిరుడు : బృహత్ సంహిత
  • సోమదేవరసూరి : కథాసరిత్సాగరం
  • బృహత్ కథ ఆధారంగానే విష్ణుశర్మ పంచతంత్రాన్ని సంస్కృతంలో రచించాడు.
  • బుద్ధకథాశ్లోక సంగ్రహము - బుద్దస్వామి రచించాడు
  • కుంతల శాతకర్ణి తరువాత పాలనకు వరుసగా వచ్చినది - స్వాతికర్ణ, మొదటి పులోమావి.

మొదటి పులోమావి 

  • వాయు పురాణం ప్రకారం వీరు మగధను 10 సంవత్సరాలు పాలించాడు.
  • మగధ పాలకుడైన సుశర్మను (కణ్వ వంశం) ఓడించి మగధను జయించినట్లుమత్స్యపురాణం పేర్కొంటుంది.
  • ఆంధ్రులు మగధను జయించి పది సంవత్సరాలు పాలించినట్లు గర్గసంహితలోని యుగపురాణం చెబుతోంది.
  • ఇది వాస్తవమేనని ఇటీవల లభించిన శాతవాహన నాణెములు కుడా రుజువు చేశాయి.
  • కుమ్రహ అని పిలువబడే ప్రాచీన పాటలీపుత్రం వద్ద తవ్వకాలలో శాతవాహన నాణాలు లభించాయి.
  • ఇతను శాతవాహన రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా మార్చి ఆంధ్రులకు యావత్ భారత కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాడు.

గౌరవ కృష్ణుడు 

  • మొదటి పులోమావి తరువాత గౌరవ కృష్ణుడు రాజ్యానికి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు రాజ్య పాలన చేశాడు.
  • ఇతని కాలంలో వాయువ్య ప్రాంతంలోని పార్టియన్లను ఓడించి కుషాణులు భారతదేశంలో కుషాణల సామ్రాజ్యాన్ని స్థాపించారు.
  • గౌరవ కృష్ణుడు క్షాత్రపుల చేతులలో అనేక అపజయాలు పొందాడు.
  • ఇతనిని వివిధ రకాల పేర్లతో నికూవర్ముడు, వైకృష్ణుడు, అరిష్టకర్ముడు, అనిష్టకర్ముడు, రిక్త వర్ణుడు అని  పురాణాలు సంబోధించాయి.

హాలుడు

  • ఈయన 17వ రాజు దాదాపు 5 సంవస్తరాలు పాలించాడు.
  • ఇతనికి గల బిరుదు : కవివత్సలుడు
  • ఈయన స్వయంగా కవి
  • ఇతడు రాసిన గ్రంధం గాధాసప్తశతి (ప్రాకృత భాషలో).
  • ఈ గ్రంథం 700 కథలతో సంకలనం చేశాడు. ఇది శ్వేతంబర జైనుడైన జయవల్లభుని వజ్జలగ్గ అనే గ్రంధాన్ని పోలివుంది.
  • శాతవాహనుల పరిపాలనలో సలహాలు ఇచ్చుటకు పౌర సభలు ఉన్నాయని గాధా సప్తశతి తెలుపుతుంది.
  • బాణుడు తన హర్షచరిత్రలో గాధాసప్తశతిని పేర్కొనడం ద్వారా దీనిని హాలుడు రాసినట్లుగా తెలుస్తుంది.
  • హాలుని యొక్క విజయాలకు ప్రధాన కారణమైన సేనాపతి - విజయనాధుడు.
  • హాలుడు ప్రేమించి వివాహం చేసుకున్న శ్రీలంక రాకుమారి లీలావతి.
  • వీరి ప్రణయ వృత్తాంతంను గురించి లీలావతి పరిణయం అనే పేరుతో గ్రంథాన్ని కుతూహలుడు రాసాడు.
  • ఈ ఇరువురి వివాహం జరిగిన ప్రాంతం సప్తగోదావరీ తీరంలో (ద్రాక్షారామం) భీమవరం దగ్గర.
  • ఇతని పాలనా కాలంలో ప్రాకృతంనకు గొప్ప ఆదరణ లభించింది. ప్రాకృతంనకు స్వర్ణయుగంగా కీర్తించబడినది.
  • తొలి తెలుగు పదాలైన “అత్త, అద్దం, పొట్ట" హాలుని గాధా సప్తశతిలో ప్రస్తావించబడ్డాయి. గాధా సప్తశత భారతీయ సాహిత్యానికి మూలగ్రంథం గా చెబుతారు.

గౌతమీపుత్ర శాతకర్ణి

  • శాతవాహనుల్లో అతి గొప్పవాడు గౌతమీ పుత్రశాతకర్ణి
  • గౌతమీ పుత్రశాతకర్ణి శాతవాహనుల్లో 23వ రాజు.
  • ఇతను శాలివాహన శకం (క్రీ.శ. 78)ను ప్రారంభించాడు.
  • శాలివాహన శకంను పాటించిన ఏకైక రాజు - యాదవ రామచంద్ర దేవుడు (ఈయన దేవగిరిరాజు)
  • శాతవాహనుల్లో మొదటి సారిగా తల్లి పేరును తన పేరుకుముందు ఉపయోగించెను (తల్లిపేరు గౌతమి బాలశ్రీ)
  • తల్లి పేరు మొదట ఉపయోగించడాన్ని మాట్రిమెనిక్స్ అంటారు శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు.
  • గౌతమి బాలశ్రీ తన కుమారుడి విజయాల గురించి రెండవ పులోమావి పాలనా కాలంలో వేసిన “నాసిక్ శిలాశాసనం" లో వివరించింది.
  • ఇతను సౌరాష్ట్రపై దాడిచేసి క్షహరాట వంశంలో గొప్ప శక రాజైన నహపాణుడిని జోగల్ తంబి యుద్ధంలో ఓడించాడు.
  • గౌతమిపుత్ర శాతకర్ణి నహపాణుడిని ఓడించడం ద్వారా క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదును పొందాడు.
  • ఇతన్ని ఓడించిన తరువాత నహపాణుడి నాణెంలపై తన చిహ్నాలతో తిరిగి ముద్రించాడు.
  • ఇతని నాణెంలు కడలూరు (జోగల్ తంబి), మహారాష్ట్ర వద్ద లభ్యమైనాయి.
  • జోగల్ తంబి వద్ద లభించిన మొత్తం నాణెములు 13,270 ఇవి అన్ని వెండినాణాలు.
  • శాతవాహనుల కాలం నాటి నాణాలు పేరు రుషభదత్తుని నాసిక్ శాసనంలో కనిపిస్తాయి.
  • ఇతనికి “రాజోరణ్” అనే సార్వభౌమ బిరుదు కలదు.
  • ఈయన వైదిక సంప్రదాయాలను పాటిస్తూ బౌద్ధమతాన్ని కూడా ఆదరించాడు. 
  • బౌద్ధ బిక్షువులకు 100 నివర్తనాల" భూమిని దానం చేశారు. (1 నివర్తన = 1.5 ఎకరాల భూమి)
  • బౌద్ధ శాఖ అయిన “భద్రనీయ" అనే శాఖకు నాసిక్ లోని గుహలను ఇచ్చాడు.
  • శాతవాహనుల రాజులలో తన పేరుమీద మొదట శాసనాలు వేయించిన రాజు ఇతడే.
  • ఇతడు రాజ్యంలో బ్రాహ్మణాధిక్యతను ప్రవేశపెట్టి చతుర్వర్ణ వ్యవస్థను బలోపేతం చేశాడు.
  • దేశంలో మొదటి సారిగా బ్రాహ్మణులకు అగ్రహారాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు గౌతమీ పుత్రశాతకర్ణి.

ఇతడికి లభించిన బిరుదులు

కులవ్యవస్థను కాపాడిన వాడిగా :

  • ద్విజవర కుటుంబ వివర్ధన
  • వినువర్తిత చాతుర్వర్ణ సంకర
  • వర్ణ సాంకర్య నిరోధక
  • ఏక బ్రాహ్మణ (నాసిక్ శాసనంలో)
  • క్షత్రియ దర్పమాన మర్ధన

తాను సాధించిన విజయాలకు గుర్తుగా పొందిన బిరుదులు :

  • త్రిసముద్ర తోయ పీతవాహన (ఇతను గుర్రాలకు మూడు సముద్రాల నీటిని తాగించినవాడు.).
  • శకయవన పహ్లవ నిఘాదనుడు

ఇంకా ఇతని ఇతర బిరుదులు:

  • ఏక ధనుర్ధురుడు.
  • క్షహరాట్ వంశ నిరవశేషకర
  • బెణాకటక స్వామి
  • ఏక శూరుడు.
  • ఆగమనిలయ

ఇతను మొదటి దక్షిణ భారతదేశ రాజుగా ఖ్యాతి గడించాడు.
కారణం ఇతను నహపాణుడికి సహకరించిన శకులను, పల్లవులను, యవనులను కూడా ఓడించాడు.

ఇతడు జయించిన రాజ్యాలు :

  • అస్మక (తెలంగాణ)
  • అనూప (మహిష్మతి), విదర్భ, ఆకరావతి (మధ్యప్రదేశ్)
  • సౌరాష్ట్ర (గుజరాత్)
  • వింధ్య, సాత్పూర ప్రాంతం, సహ్యాద్రి, కన్హేరి,శ్రీశైలం, నాగార్జునకొండ
  • మూలక (మహా రాష్ట్ర)
  • నీలగిరి (తమిళనాడు)
  • అపరాంత (కొంకణ ప్రాంతం)
  • రాజ్యవిస్తరణ సరిహద్దులు:
  • ఉత్తరం : రాజస్థాన్
  • దక్షిణం : కట్టలూరు (కడలూరు)
  • తూర్పు :బంగాళాఖాతం
  • పడమర : అరేబియా మహాసముద్రం.

గౌతమి పుత్ర విజయాలకు ప్రధాన కారణం అతని మంత్రి - శివగుప్తుడు.

రెండవ పులోమావి / వాశిష్టి పుత్ర పులోమావి 

  • ఇతని పాలనాకాలంలోనే గౌతమి బాలశ్రీ నాసిక్ శిలాశాసనం వేయించింది.
  • గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత అతని కుమారుడు పులోమావి రాజ్యానికి వచ్చాడు.
  • నాసిక్ శాసనంలో రెండవ పులోమావిని దక్షిణాపధేశ్వరుడిగా పేర్కొంది.
  • ఇతని కాలంలో శకులలో గొప్పవాడైన "రుద్రదాముడు" శాతవాహన రాజ్యంపై దాడిచేశాడు.
  • జునాఘడ్ శాసనం ప్రకారం రుద్రదాముడు రెండవ పులోమావిని ఓడించాడు.
  • రెండవ పులోమావి రుద్రదాముడిచే పరాజయం పొంది రాజధానిని ప్రతిష్టానపురం నుండి అమరావతి మార్చడం జరిగింది.
  • ఇతని కాలంలోనే అమరావతి స్థూపం నిర్మించబడింది.
  • అలాగే  శాసనాలు నాసిక్ లో 4, కార్లలో 2, అమరావతిలో 1 దొరికాయి.
  • అమరావతి శాసనంలో నాగబు అనే పదం కనిపిస్తుంది.
  • మన ఆంద్రలో ఇతని నాణెములు విస్తారంగా లభ్యమయ్యాయి.
    ఇతని బిరుదులు:
  • నవనగర స్వామి
  • దక్షిణా పథేశ్వరుడు (నాసిక్ శాసనంలో పేర్కొనబడింది)

శివశ్రీ శాతకర్ణి/ వాశిష్టీపుత్ర శాతకర్ణి

  • ఇతనికి క్షత్రప అను బిరుదు గలదు.
  • శంకరుద్ర దమనుడు ఇతన్ని రెండు సార్లు ఓడించి తన కుమారై రుద్రదమనికను ఇచ్చి వివాహం చేశాడు.
  • దీని గురించి రుద్రదమనుడు వేయించిన జునాగడ్ శాసనం (సంస్కృతంలో మొదటి శాసనం)లో తెలియజేసారు.
  • క్రీ.శ. 150 నాటి గిర్నార్ లేదా జునాగడ్ శాసనాన్ని మొదటిసారిగా సంస్కృతభాషలో రుద్రదమనుడు వేయించాడు.
  • ఇతను క్షాత్రపుల ప్రభావంతో ద్విభాషా (ప్రాకృతం, తమిళం) నాణెంలు ముద్రించాడు.
  • ఈ రాజును రుద్రదమనుడు తన గిర్నార్ శిలా శాసనంలో దక్షిణాపథపతిగా పేర్కొన్నాడు.

యజ్ఞశ్రీ శాతకర్ణి

  • 27వ రాజు (చినగంజాం శాసనం ప్రకారం) మలిశాతవాహనులలో గొప్పవాడు.
  • లంగరు వేయబడిన ఓడగుర్తులు గల నాణాలు ముద్రించాడు.
  • మత్స్యపురాణం ఇతని పాలనా కాలంలోనే సంకలనం చేయబడింది. ఇతని సమకాలీన బౌద్ధమతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు.
  • నాగార్జునుడికి యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీ పర్వతంలో మహాచైత్య విహారం లేదా పారావత విహారంను నాగార్జునకొండలో నిర్మించాడు.
  • ఈ విహారంలో 1500 గదులు ఉండేవి అనిఫాహియాన్' పేర్కొన్నాడు.
  • అమరావతి స్థూపాన్ని విస్తరించెను.
  • ప్రపంచంలోనే మొదటిసారిగా ఓడలకు తెరచాపలను రూపొందించినది కుడా యజ్ఞశ్రీ శాతకర్ణి నే.
  • ఇతని కాలంలో రోమ్ దేశంతో వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది.
  • ఈయన  నాణేములు ఆంధ్రప్రదేశ్ చేబ్రోలులో లభించాయి.
  • ఇతని సేనాని - బావగోవుడు.
  • హర్షవర్ధని చరిత్రకారుడు బాణభట్టుడు. ఇతనిని త్రిసముద్రాధిపతి అని పేర్కొన్నాడు.
  • యజ్ఞశ్రీ కాలం నాటి రెండు శాసనాలు నవ్యాంధ్రప్రదేశ్లో లభ్యమయ్యాయి. అవి:
    1. చినగంజాం
    2. అమరావతి శాసనం

చినగంజాం శాసనం గురించి :

  • ఈ శాసనం ప్రకాశం జిల్లాలోని చినగంజాంలో దొరికింది.
  • ప్రస్తుతం మద్రాసు మ్యూజియంలో కలదు.
  • యజ్ఞశ్రీ బుద్ధునికి ఒక దానం చేసినట్లు ఉంది.

విజయశ్రీ 

  • ఇతని పేరు మీదుగానే శ్రీ పర్వతమునకు విజయపురి అని పేరు వచ్చింది.
  • యజ్ఞశ్రీ తరువాత అతని సోదరుడు విజయశ్రీ రాజ్యానికి వచ్చి ఆరు సంవత్సరాలు పాలించాడు.
  • ఇతని కాలం నాటి అసంపూర్ణ శాసనం ఒకటి విజయపురి (నాగార్జున కొండ) శిథిలాల్లో లభించింది.
  • ఆ శాసనంలో విజయ సంవత్సరం వైశాఖ తిథి పేర్కొనబడ్డాయి. అనగా సంవత్సరాలను శాసనంలో పేర్కొనడం అనేది ఇతని కాలం నుండే ప్రారంభమైంది.
  • అంతకుముందు ఏ శాసనంలో తిథి, నక్షత్రాలు పేర్కొనలేదు.

చండశ్రీ

  • విజయశ్రీ తరువాత చండశ్రీ రాజ్యానికి వచ్చాడు.
  • చండశ్రీ 11వ రాజ్య సంవత్సరం నాటి శిలాశాసనం తూర్పు గోదావరి జిల్లా
  • పిఠాపురం వద్ద కొడవలి (కొడవలి శాసనం) అనే గ్రామంలో లభించింది.
  • ఇతని నాణాలు కృష్ణా, గోదావరి జిల్లాలో దొరికాయి.

మూడవ పూలోమావి :

  • శాతవాహనుల్లో 30వ రాజు మరియు చివరివాడు 3వ పులోమావి
  • 3వ పులోమావిని ఓడించి రాజ్యం నుండి పారద్రోలినవాడు - ఇక్ష్వాకు రాజైన శ్రీశాంతమూలుడు.
  •  పులోమావి తన అవసాన దినంలను గడిపిన ప్రాంతం మ్యాకదోని (బళ్ళారి సమీపంలోని గ్రామం)  ఇతను బళ్లారిలో మ్యాకదోని శాసనాన్ని వేయించాడు.

Chola dynasty (చోళులు )

సంగము రాజ్యాలు/ప్రాచీన తమిళ రాజ్యాలు

 

 

Post a Comment

0 Comments

Close Menu