satavahana (శాతవాహనుల చరిత్ర ఆధారాలు)

         శాతవాహనుల చరిత్ర ఆధారాలు



       (శాతవాహనుల చరిత్ర ఆధారాలు) శాతవాహనులు మొదట మౌర్యుల సామంతులుగా ఉండేవారు వారి కిందనే పరిపాలన కొనసాగించారు. 

  • మౌర్య సామ్రాజ్య పతనానంతరం భారతదేశ రాజకీయ, సాంస్కృతిక సమైక్యతలను సంరక్షించి వాటిని పెంపొందించడానికి ప్రయత్నించిన రాజ వంశాల్లో శాతవాహనులు అగ్రగణ్యులు గా కీర్తించ బడతారు.
  • మౌర్యులు సార్వభౌమత్వానికి వారసులైన శుంగ, కణ్వ రాజ వంశాలను తుదముట్టించి, శాతవాహను రాజ్య పాలన చేశారని పురాణాలు పేర్కొంటున్నాయి.
  • వాయు, బ్రహ్మాండ, భవిష్య, మత్స్య పురాణాల లో శాతవాహనుల గురించిన ప్రస్తావన ఉంది.అంతే కాకుండా వీరి గురించి వివరించబడింది కుడా.
  • గోదావరి మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటి సారిగా ఏకంచేసిన మొదటి ఆంధ్రరాజులు వీరే (శాతవాహనులు).

శాతవాహనుల చరిత్ర  ఆధారాలు  

  • ఆధారాలు సాదారణముగా శాసనాలు, నాణెములు, పురాణాలు, సాహిత్యం , విదేశిరచనలు  రూపంలో దొరుకుతాయి వాటి గురించి.

పురాణాల లో ఎక్కడ ఎక్కడ తెలిపారు ?

  • పురాణాలు ఆంధ్రులను ఆంధ్రభృత్యులు, ఆంధ్ర జాతీయులుగా పేర్కొన్నాయి.
  • మత్స్యపురాణం శాతవాహనుల కాలాన్ని గురించి వివరిస్తుంది. ఇది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేసారు.
  • శాతవాహనుల వంశానికి సంబంధించిన కథ విష్ణుపురాణంలో వుంది.
  • ఆంధ్ర అనే పదం జాతి పదంగా ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో శునస్సేపుని కథలో ప్రస్తావించబడింది.
  • ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేద కాలం నాటిది.
  • ఆంధ్రులను గురించి మొదట పేర్కొన్న ఇతిహాసం - రామాయణం (రామాయణం మహా భారతం కన్నా ముందు జరుగుతుంది.)

నాణెములు ఎలా ఉండేవి ?

  • నాణెంల అధ్యయనం గురించి చదివేశాస్త్రం ను "న్యూమిస్ మ్యాటిక్స్" అని పిలుస్తారు లేదా అంటారు.
  • శాతవాహనుల నాణెములు సీసము, పోటీన్ అనే మిశ్రమ లోహంతోను అంతే కాకుండా వెండితోను చేయబడ్డాయి.
  • విరి  కాలంలో అత్యధికంగా సీసం నాణెములు ముద్రించబడ్డాయి అని చెబుతారు.

శాతవాహనుల కాలంలో అమలులో ఉన్న నాణెలు

  • 1) పోటిన్ నాణెం : రాగి + తగరం + సీసం (మిశ్రమ లోహంతో తయారు చెయ్యబడినవి)
  • 2) సువర్ణ నాణేములు : బంగారు నాణేములు
  • 3 ) కర్శపణం : రాగి, వెండి లోహాలతో ముద్రించబడినవి
  • 4) రోమన్ నాణేములు : బంగారు నాణేములు ,వెండి నాణెలు గా రెండు ఉండేవి.

ఎవరు ఎలా ముద్రించారు ?

  • మొదటి శాతకర్ణి మొదటగా వెండినాణెలు ముద్రించాడు.
  • ఒక బంగారు నాణెం 35 వెండి నాణెములతో సమానం.
  • మొదటి శాతకర్ణి , గౌతమి పుత్ర శాతకర్ణి ఉజ్జయిని పట్టణం గుర్తుగల నాణాలు వేయించారు.
  • గౌతమీ పుత్ర శాతకర్ణి శక రాజైన నహపాణుని వోడించి తన రాజ్యము లోని వెండి నాణాలను తీసుకొని తన చిహ్నంతో (ప్రతిమ) తిరిగి పునఃముద్రించాడు.
  • యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ తెర చాప గుర్తులు గల నాణాలు వేయించారు.

శాతవాహనుల నాణేములు బయటపడిన ప్రాంతాలు

  • శాలిహుండం (శ్రీకాకుళం)
  • అత్తిరాల (కడప) రోమన్ బంగారు నాణెంలు లభ్యమయ్యాయి.
  • వినుకొండ (గుంటూరు జిల్లా) - రోమన్ బంగారు నాణెంలు బయటపడ్డాయి.
  • కొండాపూర్ (మెదక్ జిల్లా)లో టంకశాల బయటపడింది. ఈ నాణెంల మీద ("సిరి చిముక శాత" అని వ్రాయబడి ఉంది)
  • నాగార్జున కొండ (గుంటూరు జిల్లా) (శాతవాహనుల చరిత్ర  ఆధారాలు)

శాతవాహనుల నాణెములపై ముద్రించబడిన చిత్రాలు ఏమి ?

  • ఎద్దు (వృషభం),
  • ఏనుగు,
  • సింహము
  • స్వస్తిక్ గుర్తు,
  • గుర్రం,
  • ఉజ్జయినీ తోరణం.

స్థానిక రాజుల పేర్లతో వెలుగులోకి వచ్చిన తొలి నాణేములు ఏమి ?

  • గోభద్ర
  • సమగోప (ఇవి కరీంనగర్లో వెలుగులోకి వచ్చాయి)

నాణెములపై గల భాష ఏమి ?

  • 'ద్విభాషా' పద్ధతిలో నాణేలపై రెండు భాషలు ముద్రించారు.
  • నాణెములపై 'ప్రాకృతం' మరియు 'దేశిభాష'ను ఉపయోగించారు.

శాసనాల గురించి ?

  • శాసనాల అధ్యయనం గురించి చదివే శాస్త్రం - "ఎపిగ్రఫి”
  • భారతదేశంలో మొట్టమొదటగా శాసనాలను వేయించిన రాజు - అశోకుడు (క్రీ.పూ 3వ సంవస్తరము లో )
  • ఆంధ్రదేశంలో మొట్టమొదటగా శాసనాలను వేయించిన రాజులు - మౌర్యులు (అశోకుడు)
  • APలో శాసనాలను వేయించిన తొలి ఆంధ్రరాజులు - శాతవాహనులు.
  • శాతవాహనుల శాసనాలపై బాగా అధ్యయనం చేసినది - బుహర్.
  • వీరి  అధికార భాష ప్రాకృతం
  • శాసనాల మీద వాడిన భాష ప్రాకృతం

ఎర్రగుడి, రాజులమందగరి శాసనం

  • ఇది కర్నూలు జిల్లాలో ఉంది.
  • ఈ శాసనం వేసినది - అశోకుడు
  • భాష - ప్రాకృతం.
  • ఇది గురు శిష్యుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది.
  • ఆంధ్రదేశంలో మౌర్యుల పాలనను గురించి నిర్ధారించే శాసనం. (శాతవాహనుల చరిత్ర  ఆధారాలు)

నానాఘాట్ శాసనం

  • ఈ శాసనం వేయించినది - దేవి నాగానిక.
  • దేవీ నాగానిక మొదటి శాతకర్ణి భార్య.
  • భాష - ప్రాకృతం
  • ఇది వైదిక క్రతువులు నిర్వహించుచున్న రాజును ప్రశంసిస్తున్న ఒక శాసనం నానాఘాట్ శాసనం(ప్రసస్తి శాసనం).
    నానాఘాట్ శాసనం బౌద్ధగుహలలో ఉంటుంది.
  • ఈ శాసనంలో శాతవాహనులు, మరాఠాలు మధ్య గల వైవాహిక సంబంధాల గురించి తెలియజేస్తుంది.
  • అంతే కాకుండా శాసనం వలన మొదటి శాతకర్ణి విజయాలు, ఘనకార్యాలు మరియు అతనికి అప్రతిహత చక్ర , ధక్షనాపధదిపతి అనే బిరుదులు ఉండేవని తెలుస్తుంది.

హాథిగుంపా శాసనం

  • ఇది వేయించినది - ఖారవేలుడు.
  • ఖారవేలుడు కళింగ రాజ్య పాలకుడు.
  • ఈయన  మొదటి శాతకర్ణికి సమకాలీన చక్రవర్తి.
  • ఈ శాసనం ద్వారా మొదటి శాతకర్ణి రాజ్యంలోని మూషిక నగరంపై కళింగ ఖారవేలుడు దాడి చేసి ఆ నగరానికి పితుండ అని పేరు పెట్టినట్లు తెలుస్తుంది.
  • ఈ శాసనం చతురంగ బలాలను గురించి ప్రస్తావించినది.

నాసిక్ శాసనం 

  • వేయించినది - గౌతమీ బాలశ్రీ ( గౌతమీ బాలశ్రీ, గౌతమీపుత్ర శాతకర్ణి గారి తల్లి)
  • భాష - ప్రాకృతం
  • ఈ శాసనంలో బాలశ్రీ రాజర్షి పత్నిగా వర్ణించబడినది.
  • ఇది వాసిష్ఠీపుత్ర పులోమావి కాలంలో జారీ చేయబడినది.
  • ఈ శాసనం గద్యరూపంలో ఉంటుంది.
  • గౌతమీపుత్ర శాతకర్ణి చేసిన దండయాత్రలు, సాధించిన విజయాలు, ఘనతను మరియు సామ్రాజ్యవిస్తీర్ణం, బిరుదుల గురించి ఈ శాసనం తెలియజేస్తుంది.
  • ఇందులో గౌతమీపుత్ర శాతకర్ణి, తన తల్లి బాలశ్రీతో కలిసి లునర్హ కొండపై నివసించే భిక్షువులకు దానధర్మాలు చేసినట్లు కుడా ఈ శాసనం తెలియజేస్తుంది. (శాతవాహనుల చరిత్ర  ఆధారాలు)

అమరావతి శాసనం 

  • ఈ శాసనం వేఇంచినది - రెండవ పులోమావి
  • భాష - ప్రాకృతం
  • ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన తొలిశాసనం ఇది.
  • నాగబు అనే తొలి తెలుగు పదం ఈ శాసనంలో లభించింది.
  • ఈ శాసనం అమరావతి స్థూపపు ప్రాకారపు ద్వార స్తంభంపై చెక్కబడి ఉంది.
  • ఈ అమరావతి స్థూపం మహాచైత్యంలో చేతికియ బౌద్ధ సంఘానికి చెందినదని కూడా ఈ శాసనం తెలుపుతున్నది.
  • పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఆంధ్ర, కోస్తా ప్రాంతాలకు వ్యాపించిందని తెలియపరుస్తుంది.

జునాఘడ్ శాసనం 

  • ఈ శాసనం వేసినది శక రుద్రదాముడు.
  • సంస్కృతంలో జారీ చేసిన మొదటి శాసనం ఇది.
  • శాతవాహనులు మరియు ఉజ్జయినీ క్షాత్రపుల వైవాహిక సంబంధాలు గురించి తెలియజేయును.
  • రుద్రదాముడు తన కుమార్తె రుద్రదమనికను శాతవాహన రాజైన వాసిష్ఠీపుత్ర శాతకర్ణికి ఇచ్చి వివాహం చేసినట్టు తెలియజేసింది.

భట్టిప్రోలు నిగమసభ శాసనం 

  • ఈ శాసనం వేఇంచినది - కుబేరుడు.
  • నగరపాలిక సభలైన నిగమసభలు గురించి తెలియజేయుజేస్తుంది.
  • శాతవాహనుల కాలం నాటి పట్టణ ప్రాంతాలను గురించి తెలియజేయుజేస్తుంది.

మ్యాకదోని శాసనం 

  • ఈ శాసనం వేయించినది : మూడవ పులోమావి
  • దొరికిన ప్రాంతం : బళ్ళారి. (కర్ణాటక)
  • మూడవ పులోమావి చివరి శాతవాహన చక్రవర్తి .
  • శాతవాహనుల రాజ్యపతనం గురించి ఈ శాసనం శాతవాహనులు గ్రామపాలన గురించి మరియు గ్రామంలో ముఖ్య శాంతిభద్రతల అధికారి అయిన గుల్మిక వివరాలను అందిస్తుంది.

ఉన్నాఘర్ శాసనం

  • శాతవాహనుల పరిపాలన వ్యవస్థ మరియు మంత్రిమండలి గురించి తెలియపరుస్తుంది.

అందౌ శిలా శాసనం

  • శాతవాహనుల పరిపాలన తెలియపరుస్తుంది.

సాహిత్య ఆధారాలు

ఈ కాలం నాటి గ్రంథాలు ప్రాకృత, సంస్కృత భాషలలో కలవు.
1. హాలుడు : గాథాసప్తశతి (భాష: మహారాష్ట్ర ప్రాకృతం)
2. వాత్సాయనుడు : కామసూత్రాలు, న్యాయ భాష్యం (700 శృంగార పద్యాలతో సంకలనం చేశాడు).
3. సోమదేవ సూరి : కథాసరిత్సాగరం (సంస్కృతంలో రచించాడు.)
4. గుణాధ్యుడు : బృహత్కథ (పైశాచిక భాష)
5. హరిసేనుడు : బృహత్కథ కోశము
6. క్షేమేంద్రుడు : బృహత్కథ మంజరి (ఇది సంస్కృతం)
7. కుతూహలుడు : లీలావతి పరిణయం (ప్రాకృతం)
8. వరాహమిహిరుడు : బృహత్కథ జాతక, బృహత్ సంహిత (సంస్కృతం)
9. ధన పాలుడు : తిలక మంజరి
10. శర్వవర్మ : కాతంత్ర వ్యాకరణం (సంస్కృత వ్యాకరణం)
11. చుళ్ళ కళింగ జాతక కథలు : గౌతమబుద్ధుని పూర్వజన్మల గురించి తెలియజేసే గ్రంథాలు
12 బుద్దస్వామి : బుద్ధ కథా శ్లోక సంగ్రహం

విదేశీ రచనలు

1 .నేచురల్ హిస్టరీ 

  • రచయిత ప్లీనీ
  • ఇతను 'రోమ్' నగరానికి చెందినవాడు.
  • ఈయన "నేచురల్ హిస్టరీ" అనే గ్రంథం లాటిన్ భాషలో రచించాడు.
  • ఈ గ్రంథంలో "ఐరోపాలోని బంగారం అంతయూ భారతదేశానికి తరలిపోతుందని తెలియజేసాడు"
  • అప్పటి శాతవాహనుల కాలం నాటి వర్తక, వాణిజ్యాల గురించి తెలుపుతుంది.

2. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ

  • రచయిత - అజ్ఞాత గ్రీకు నావికుడు
  • భాష - గ్రీకు
  • మరో పేరు - ఎర్రసముద్రంపై నావికుని దినచర్య
  • శాతవాహనుల కాలంలో ఉన్న వర్తక వాణిజ్యాల గురించి తెలియజేస్తుంది.
  • రోమ్, ఆగ్నేయాసియాతో ఆంధ్రుల వ్యాపారం గురించి, విదేశీ వాణిజ్యం చేయుచున్న రేవు పట్టణాల గురించి వర్ణించినది.
  • అరికమేడు రేవు పట్టణాన్ని అంతర్జాతీయ రేవు పట్టణంగా పేర్కొన్నది. శాతవాహనుల కాలంలో అరికమేడు రోమన్ ల విపణివీధిగా పేరు పొంది ఉండేది.
  • ఈ గ్రంథం ప్రకారం, శాతవాహనుల కాలంలో తూర్పు తీరాన ఉన్న ఏకైక రేవు పట్టణం - కొద్దూరా

3. గైడ్ టూ జియోగ్రఫీ 

  • రచయిత టాలమీ
  • టాలమీ "గైడ్ టూ జియోగ్రఫీ" అనే గ్రంథంలో శాతవాహనుల పాలన గురించి తెలిపాడు.
  • శాతవాహనుల రేవు పట్టణాల గురించి వివరించింది.
  • ఈ గ్రంథం ప్రకారం పశ్చిమతీరంలో భరుకచ్ఛ రేవు పట్టణం ముఖ్యమైనది. దీని తరువాత సోపార,కళ్యాణి రేవు పట్టణాలు ముఖ్యమైనవి.
  • శాతవాహనుల కాలం నాటి సమయం లో మైసోలియా(మచిలీపట్నం)ను టాలమీ గొప్ప వ్యాపార కేంద్రంగా వర్ణించాడు.

4. సి-యు-కి :

  • రచయిత - హుయానాత్సాంగ్
  • మరో పేరు - బుద్ధిస్ట్ రికార్డ్స్
  • హుయానా త్సాంగ్ చైనా దేశానికి చెందినవాడు. ఇతను 7వ శతాబ్దానికి చెందినవాడు.
  • యాత్రికులలో రారాజు అనే బిరుదు వీరికి కలదు.
  •  కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు గల భారతదేశంను సందర్శించి వివరాలు ఈయన అందించాడు.
  •  సియుకి (బుద్దిస్టికార్డ్స్)లో శాతవాహనుల గూర్చి వివరాలను అందించెను.

5. ఇండికా

  • రచయిత - మెగస్తనీస్
  •  భాష - గ్రీకు
  •  మెగస్తనీస్ భారతదేశాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు.
  •  గ్రీకు దేశానికి చెందిన వారు ఇతను.
  •  మౌర్యుల కాలంలో రాయబారిగా వచ్చి, పాటలీపుత్రనగర వర్ణన గూర్చి, శాతవాహనుల రాజకీయ వ్యవస్థ గూర్చి వివరాలు ఇతను అందించాడు.
  •  మన ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్ట మొదటి గ్రంధం.
    ఆంధ్రులకు 30 కోటలు ,లక్ష పదాతి దళాలు ఉన్నట్టు ఈయన పేర్కొన్నాడు.

శాతవాహనుల గురించి గుర్తు ఉంచుకోవలసినవి 

  • మూల పురుషుడు : శాతవాహనుడు
  • రాజ్య స్థాపకుడు : సిముఖుడు
  • రాజధాని : 1. ప్రతిష్టానపురం మరియు 2. ధాన్యకటకం
  • అధికార భాష : ప్రాకృతం (కుంతల శాతకర్ణి ప్రాకృతం ఐదులు సంస్కృతంను రాజభాషగా మార్చాడు)
  • రాజ లాంఛనం :సూర్యుడు
  • వీరి పాలకులలో గొప్పవారు : గౌతమీ పుత్ర శాతకర్ణి
  • చివరి రాజు : 3వ పులోమావి
  • వీరు ఆచరించిన మతాలు : జైనం, హైందవం (శ్రీముఖుడు మొదట జైన మతస్తుడు)
  • శాసనాలు : 1. నానాఘాట్ (ప్రాకృత భాషలో) - దేవినాగానిక 2. నాసిక్ (ప్రాకృతభాష) - గౌతమి బాలశ్రీ 3. మ్యాకదోని - మూడవ పులోమావి (బళ్ళారిలో)
  • విదేశీ యాత్రికుడు : మెగస్తనీస్

satavahana 1 (శాతవాహనుల రాజకీయ పరిణామ క్రమం)

Chola dynasty (చోళులు )

సంగము రాజ్యాలు/ప్రాచీన తమిళ రాజ్యాలు

Post a Comment

0 Comments

Close Menu