సింధు ప్రజల ఆర్థిక వ్యవస్థ (Sindhu Civilization Economy )

 ఆర్థిక వ్యవస్థ



🔯 సింధు ప్రజల ప్రధాన వృత్తి - వ్యవసాయం 

🔯 సింధూ నాగరిక ఆర్ధిక వ్యవస్థ - మిగులు ఆర్థిక వ్యవస్థ

🔯 భూగర్భ జలాలను సురక్షితంగా బావుల ద్వారా వాడిన మొదటి నాగరికత - సింధూ నాగరికత

వీరు ఖరీఫ్, రబీ పంటలను పండించారు.

🔯 ఖరీఫ్ పంట: పత్తి, వరి, ఆవాలు, నువ్వులు

🔯 రబీ పంట: గోధుమ, బార్లీ, పప్పు ధాన్యాలు, నూనెగింజలు

🔯 రబీ పంటలను ఎక్కువగా సింధూ, గుజరాత్ ప్రాంతాలలో పండించేవారు.

🔯 గోధుమలో రెండు రకాలు పొడుగు, పొట్టి రకం గోధుమలను పండించారు.

🔯 ఇతర పంటలు ఖర్జూరాలు, నువ్వులు, ప్రత్తి, బఠాణీలు, అపరాలు.

🔯 సింధూ ప్రజల నుంచి ప్రత్తిని దిగుమతి చేసుకున్న గ్రీకులు పిలిచిన పేరు సిండాన్ 

🔯 ప్రపంచంలోని మొట్టమొదటి సారిగా పత్తిని సాగు చేసినది : సింధు ప్రజలు 

🔯 సింధూ ప్రాంతం నుండి దిగుమతి చేసుకున్న పత్తి బేళ్లు లభ్యమైన ప్రాంతం: ఉమ్మా (యెసపుటోమియా నాగరికత)

🔯ఆఫ్ఘనిస్తాన్లో ఫోర్టుఘాయి వద్ద జనావాసంలో దున్నిన భూమి గుర్తులు లభించాయి. 

🔯వీరు తీపి పదార్థాల కోసం తేనెను ఉపయోగించేవారు. వరి పొట్టు అవశేషాలు లోథాల్, రంగాపూర్ దగ్గర లభ్యమైనాయి.

🔯 బార్లీ పంట పండించినట్లు ఆధారాలు బయటపడిన నగరం: బన్వాలీ 

🔯వీరు రాతి కొడవలిని, చెక్క నాగలిని ఉపయోగించారు. వీరికి ఇనుము గురించి తెలియదు.

🔯 సింధు నదికి అడ్డుకట్టలు కట్టి కృతిమ నదుల్ని సృష్టించారు. 

🔯వృషభం, మేక, కోడి, గొర్రె, పంది మొ|| జంతువుల్ని మచ్చిక చేశారు. ఖడ్గమృగం, పులి, ఏనుగు వీరికి తెలుసు.

🔯 ముద్రికలపై ఎక్కువగా ముద్రించిన జంతువు మూపురం గల ఎద్దు

🔯సింధు కాలం నాటి ప్రజలకు గుర్రం తెలియదని ఆర్యులే గుర్రాన్ని ప్రవేశపెట్టారనే అభిప్రాయం కలదు. 

🔯 సింధు త్రవ్వకాలలో గుర్రానికి సంబంధించిన ఆధారాలు బయటపడడంతో ఈ వాదన తప్పని ఋజువైంది.

🔯 లోథాల్లో టెర్రకోటతో చేసిన గుర్రపు బొమ్మ మరియు సుర్కటోదా (గుజరాత్) లో గుర్రపు ఆస్తిపంజరం బయటపడినది.

🔯గుర్రం తెలిసినట్లుగా (గుర్రపు ఎముకలు) ఆధారాలు బయటపడిన ప్రదేశం - సుర్కటోడా  (గుజరాత్)

🔯మూపురం ఉన్న, మూపురం లేని వృషభాలు కనిపించాయి.

🔯 టెర్రపు కోట గుర్రపు ప్రతిమ లభించిన ప్రాంతాలు : • 

  • లోథాల్,నౌషారో 
  • ధాన్యాగారము

🔯 ఈ ధాన్యాగారాలకు సంబంధించిన ఆధారాలు మొహంజదారో, హరప్పాలలో లభ్యమయ్యాయి. 

🔯 50.7x40.5 మీటర్ల కొలతలతో ధాన్యాగారము హరప్పాలో బయటపడింది..

🔯 అతిపెద్ద ధాన్యాగారము మొహంజదారోలో (150 × 50  కొలతలతో) బయటపడింది.

🔯 వీటిని నేటి స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్తో పోల్చవచ్చు.

🔯 హరప్పాలో రెండు వరుసలలో అరేసి (6×2) ధాన్యాగారాలు మొత్తంగా 12 ధాన్యాగారాలు బయటపడ్డాయి.

స్థానవాటిక

🔯 మహా స్నాన వాటికను పవిత్ర స్నానాలు ఆచరించే పుష్కరిణిగా పేర్కొన్న చరిత్రకారుడు - డి.డి. కోశాంభి

🔯 అతి పెద్ద స్నానవాటిక మొహంజదారోలో కనుగొనబడినది.

🔯 ప్రపంచంలో స్నానఘటం కలిగి ఉన్న ఏకైక నాగరికత - సింధూ నాగరికత

🔯 ఈ స్నానఘట్టానికి మురికినీరు బయటకు పోవడానికి నైరుతి మూలలో ఒక సన్నటి రంధ్రంను ఏర్పాటు చేశారు.

🔯 దీని నిర్మాణానికి మోర్టార్/ గచ్చును ఉపయోగించారు. దీనిని  జిప్సం గా  పేర్కొంటారు. * స్నానవాటికలోకి నీరు పంపడానికి తూర్పు ప్రక్కన ఒక బావిని నిర్మించారు.

🔯 దుస్తులు మార్చుకోవడానికి స్నానవాటికకు ఇరువైపులా గదులు నిర్మించారు

పరిశ్రమలు

  •  గాజుల పరిశ్రమ ; కాళీబంగన్, బాలాకోట్, 
  • పూసల పరిశ్రమ : లోథాల్, చనుదారో, రాతి పరిశ్రమ

కుండల పరిశ్రమ:

  • సింధూ నాగరికత వాసుల కుండలకు గల పేరు : Black Polished Ware Pottery 
  • నల్లని బంకమట్టితో కుండలను తయారు చేసేవారు.
  • ఈ నాగరికత ప్రజలు కుండలపై చిత్రాలను నల్లటి రంగుతో చిత్రీకరించేవారు.

ఇటుకల పరిశ్రమ:

  • ఇటుకల తయారీ విస్తృతమైన చేతి వృత్తి. వీరు కాల్చిన ఇటుకలను ఉపయోగించేవారు. ఇటుకల తయారీ ప్రమాణాలు: 1:2:4 (ఎత్తు: వెడల్పు : పొడవు)

👉 చరిత్ర (History )- పరిచయం

వ్యాపారం లేదా వాణిజ్యం

🔯 అంతర్గత వ్యాపారాన్ని ఎడ్ల బండి సహాయంతో నిర్వహించేవారు. ఎడ్ల బండ్లను 'ఎక్కా' అని పిలిచేవారు.

🔯 విదేశీ వ్యాపారాన్ని ఓడల సహాయంతో నిర్వహించేవారు.

🔯 నాటి అంతర్జాతీయ ఓడరేవులు: 

  • లోథాల్ బాలాకోట్  
  • సుర్కొటోడాలు

🔯 పర్షియన్ గల్ఫ్ ముద్రిక లోథాల్లో లభ్యమైంది.

🔯పర్షియన్ గల్ఫ్ లో సింధు నాగరికత ముద్రికలు లభ్యమైన ప్రదేశం: సైలక 

🔯 కొలత ప్రమాణాలు :వీరు తూనికలకు త్రాసును ఉపయోగించేవారు. కొలతలను దశాంశ పద్ధతి ఉపయోగించాఋ .

🔯వీరి కొలత ప్రమాణం 16 (16=ఒక యూనిట్). తూనికలకు ఆల్బెస్టార్ అనే రాయిని ఉపయోగించారు.

🔯వీరు ప్రధానంగా ఎగుమతి చేసే వస్తువులు :ఆహార ధాన్యాలు, పత్తి, ఏనుగు దంతాలు, ఆభరణాలు, పూసలు ,రంగురాళ్ళు, మిరియాలు, దూదితో చేసిన వస్త్రాలు మొదలైనవి.

🔯మెసపటోమియా, ఈజిప్టు దేశాలకు పై సరుకులను ఎగుమతి చేసేవారు. 

వీరు దిగుమతి చేసుకున్న వస్తువులు :

  • బంగారం:దక్షిణ భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్
  • రాగి:భేత్రి గనులు, బెలుచిస్థాన్
  • విలువైన రంగురాళ్ళు: మధ్య ఆసియా
  • తగరం: అరేబియా
  • ఆగేడ్: సౌరాష్ట్ర (గుజరాత్)
  • జీద్ : మధ్య ఆసియా
  •  టార్కొయీస్ : ఇరాన్
  • స్టియటిట్ :బెలుచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్
  • వెండి : ఆఫ్ఘనిస్తాన్, పర్షియా |
  • టిన్ : హజారీబాగ్ (జార్ఖండ్)
  • కలప: కాశ్మీర్
  • ఎర్రసింధూరం : ఆఫ్ఘనిస్తాన్
  • ఆమెథిస్ట్ :మహారాష్ట్ర
  • గవ్వలు: గుజరాత్ 
  • వజ్రాలు:ఈజిప్టు
  •  లాపిస్ జులీ (ఇంద్రనీలమణి)
  • బడేషన్ (ఆఫ్ఘనిస్టన్ )

🔯 వీరు తమ సమకాలీన నాగరికతలైన చైనాతో మినహా అందరితో వ్యాపారం చేశారు. (నైలు, బాబిలోనియా / సుమేరి

🔯అంతర్జాతీయ వర్తకంలో రాజస్థాన్ ప్రాంతం ప్రముఖ పాత్ర వహించింది. 

🔯 దాదాపు ప్రతి నగరం ఓడరేవులను కలిగి ఉండేది.

ముద్రికలు :

  • ముద్రికలు స్టియటైట్ అనే మెత్తని రాయితో తయారు చేశారు.
  • ముద్రికలు లభించిన ప్రాంతం :మొహంజదారో (1398 ముద్రికలు), హరప్పా (891 ముద్రికలు)
  • ఈ ముద్రికలను తయారు చేయు పరిశ్రమ బయల్పడిన ప్రదేశం - చన్హుదారో
  • ముద్రికలపై ఎక్కువగా కనిపించే జంతువు మూపురం లేని ఒకే కొమ్ము కలిగిన ఎద్దు (1159 ముద్రికలు లభించాయి)

ఈ ముద్రికలపై ముద్రించిన ముఖ్యమైన జంతువులు:

  • ఎద్దు
  • ఏనుగు
  • పులి
  •  ఖడ్గమృగం
  • కుందేలు
  • గేదె 

🔯 ముద్రికలలో గొప్పది మరియు  ప్రధానమైనది - పశుపతి ముద్రిక

🔯 మొహంజొదారోలో లభించిన ముద్రలపైన గల చెట్టు - అత్తి చెట్టు (పైపల్ చెట్టు)  కొమ్మలు 

🔯 టెర్రా కొట్టా మట్టితో అనేక రకాల ఆట వస్తువులను మరియు ముద్రికలను కూడా తయారు వీరు  చేసేవారు.

🔯హరప్పాలో మట్టి పాత్ర మీద వేటగానితో కలసి రెండువేట కుక్కలు వేటాడుతున్న దృశ్యం కనిపించినది.


ఇతర లోహాల బొమ్మలు:

🔯 వీరు ఎక్కువగా ఉపయోగించిన లోహం - కాంస్యం. 

🔯 ప్రపంచంలో మొదటగా వెండిని వాడినది వీరే అని నిపుణుల నిర్ధారణ .

🔯 హరప్పా నాగరికత కళలలో చెప్పుకోదగిన 2 విగ్రహాలు లభించిన ప్రాంతం - మొహంజొదారో అవి :

1. నాట్యగత్తె విగ్రహం :

  • బయటపడిన ప్రదేశం - మొహంజొదారో, ఎత్తు - 10.3 సెం.మీ
  • నిటారుగా నిలబడి ఎడమచేయి నడుముపై ఉంచిన భంగిమలో ఉంది.
  • కాళ్ళకు, చేతులకు కడియాలు ధరించినది. 

2. గడ్డం గల పురుషుని విగ్రహం:

  • లభించిన ప్రదేశం - మొహంజొదారో..
  • ఎత్తు - 17 సెం.మీ
  • గడ్డం చెక్కినతీరు (గడ్డం గల తీరు), భుజం చుట్టూ కప్పిన కండువ. ఈ రెండు లక్షణాలు మెసపటోమియాకు చెందినవి.

🔯 ఈ ప్రతిమను చూసి కొందరు ఒక మతాధిపతిది అని, మరికొందరు వ్యాపారి అని, యోగిది అని నామకరణం చేశారు. 

రాజకీయ వ్యవస్థ లేదా పాలనా వ్యవస్థ

🔯చరిత్రకారులకు సింధు లిపి పూర్తి స్థాయిలో అవగాహన కలగలేదు కాబట్టి పాలకులు ఎవరు అని, ఎలాంటి వ్యవస్థ కలదు అని నిర్ధారణకు రాలేకపోతున్నారు.

🔯 యుద్ధానికి ఉపయోగించే ఆయుధాలు, శిరస్త్రాణాలు, కవచాలు లభించలేదు. 

కాబట్టి రాచరిక వ్యవస్థ ఏర్పడలేదని అభిప్రాయము. 

🔯 Priestly King విగ్రహాన్ని బట్టి పూజారి వర్గం పాలించినట్లుగా పేర్కొన్న చరిత్రకారులు : రోమిల్లా థాపర్, డి.డి. కోశాంభి

🔯వ్యాపార వర్గాలు నాయకత్వం వహించి మున్సిపల్ ప్రభుత్వాలచే పరిపాలించబడినట్లుగా పేర్కొన్నవారు : ఆర్.యస్. శర్మ, 

🔯మత ప్రవక్తలచే ఈ నాగరికత పరిపాలించబడింది అని పేర్కొన్న చరిత్రకారుడు - స్టూవర్ట్ ఫిగాట్

🔯 పురపాలక సంఘాల పరిపాలనగా పేర్కొన్నది : దీక్షిత్ 

🔯 వీరు సుమేరియన్ల పాలనను అనుసరించినట్లుగా పేర్కొన్న చరిత్రకారుడు : మార్టిమర్ వీలర్


సాంకేతిక పరిజ్ఞానం:

🔯వీరికి తూనికలు, కొలతల పట్ల పూర్తి స్థాయి అవగాహన కలదు. వీరు ఉపయోగించిన తూనిక రాయి - అలస్టాట్

🔯 తూనిక రాళ్ళు, కొలబద్దలు లభ్యమైన సింధు నగరాలు: 

  • మొహంజొదారో  ,
  • హరప్పా
  • చన్నుదారో.

🔯 ప్రాథమిక తూనిక రాయి బరువు (13.63 గ్రాములు),

🔯  1,2,4,10, 20, 40, 100, 200, 400, 800, 800 యూనిట్ల తూకపు రాళ్ళు లభించాయి. 

🔯 2 అంకె ప్రామాణికంగా ల పద్ధతిలో తూనికలు వినియోగించినట్లు తెలుస్తోంది. 

🔯 తూనికరాళ్ళ పరిశ్రమ చన్నుదారో లో ఉండేది .

🔯 పొడవులను కొలవడానికి క్రమబద్ధమైన గుర్తులున్న కొలబద్దను తయారు చేసేవారు. 

🔯 స్కేల్ లభ్యమైన ప్రాంతం మొహెంజొదారో.

🔯 కాంస్యంతో తయారుచేసిన కొలబద్ద లభ్యమైన ప్రాంతం- హరప్పా, 

🔯 దంతంతో తయారుచేసిన కొలబద్ద లభ్యమైన ప్రాంతం : లోథాల్ 

లోహశాస్త్రం

🔯 వీరికి లోహశాస్త్రంపై అవగాహన కలదు. 

🔯 సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము  

🔯 ముడి ధాతువు నుండి రాగిని వేరు చేయడం ఈ నాగరికత ప్రజల లోహ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం.

 🔯 రాగి తగరాన్ని కలిపి కంచు తయారుచేసి కంచు పరిశ్రమను అభివృద్ధి చేశారు. 

🔯 కంచు పరిశ్రమ ఆధారాలు బయల్పడిన ప్రాంతాలు- హరప్పా, చనుదారో, రసాయనశాస్త్రం పై అవగాహన కలదని చెప్పాలి.

🔯 సింధు ప్రజల అంత్యక్రియ పద్ధతులు:  

🔯 సింధు ప్రజలు చనిపోయిన వారిని పూడ్చిపెట్టేవారు.

🔯మృతదేహాలను ఉత్తర దక్షిణంగా తల ఉత్తర దిక్కువైపు ఉండేటట్లు వెల్లకిలా పడుకో బెట్టేవారు. 

సింధు నాగరికత క్షీణించడంపై చరిత్రకారులకు భిన్నాభిప్రాయాలు కలవు

  • 🔯 ఆర్యుల దురాక్రమణ వల్ల సింధు జనావాసాలు అంతరించాయని తెలిపినది: మార్టిమర్ వీలర్ 
  • 🔯 కానీ కాలానుగుణంగా చరిత్రకారులు ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు.
  • 🔯 ప్రకృతి వైపరీత్యాలే ప్రధాన కారణం అని తెలిపినది: సర్ జాన్ మార్షల్  
  • 🔯 సింధు నది వరదల వల్ల సింధు నాగరికత అంతమైనట్లుగా పేర్కొన్నవారు : దయారాం సహానీ.
  • 🔯 నదులు ఎండిపోవడం వల్ల పతనమైనట్లు భావిస్తున్న నగరాలు బన్వాలీ , కాళీభంగన్ (సింధు నది ప్రవాహ దిశని మార్చుకోవడం వల్ల). 
  • 🔯 పర్యావరణ మార్పులు ప్రధాన కారణం : డి.డి. కోశాంభి
  • 🔯  కరువు కాటకాల వల్ల సింధు నాగరికత అంతమైందని పేర్కొన్నవారు ఫేయిర్ సర్వీస్
  •  ఫేయిర్ సర్వీస్ రచించిన గ్రంథం: ప్రీ హిస్టారిక్ ఇండియా.  
  • 🔯 టెక్టోనిక్ చర్య వల్ల సింధు నాగరికత అంతమైందని పేర్కొన్నవారు ఆర్. ఎస్. రైడన్
  • 🔯 ప్రధాన శత్రువు ప్రకృతే, ఇంద్రుడు, అనాగరికత తండాలు నిర్దోషులు అని పేర్కొన్నది : జి.ఎఫ్. రేల్స్
  • 🔯  సింధు నది ప్రవాహ మార్గంలో వచ్చిన మార్పులే ప్రధాన కారణం అని భావించినది : లాంబ్రిక్ 
  • 🔯 అంతర్గత వైఫల్యం, విదేశీదాడులు సమాన బాధ్యత వహించాయి అని నిర్ధారించినది : గార్టన్ చైల్డ్
  • 🔯 హరప్పా సంస్కృతి నిర్మూలనం భారతదేశ చరిత్రలో ఒక వెనుకడుగు అని అభిప్రాయపడిన చరిత్రకారుడు : డి.డి. కోశాం 

🔯  క్షీణదశలో కూడా కొనసాగిన ప్రాంతాలు: గుజరాత్ ,రాజస్థాన్ ,హర్యానా ,ఉత్తరప్రదేశ్

ఇతర అంశాలు

  1. సింధు ప్రజల చేత ఆరాధించబడేవి :
  2. జంతువు : మూపురం ఎత్తుగా ఉన్న వృషభం 
  3. నదీదేవత వాహనం : మొసలి
  4.  వృక్షం : రావి చెట్టు 
  5. పవిత్ర చిహ్నం : స్వస్తిక్
  6.  పక్షి : పావురం

వివిధ జంతువుల అవశేషాలు లభించిన ప్రదేశాలు

  • సర్కాథోడా : గుర్రపు అస్థిపంజరం 
  • అమ్రి: ఖడ్గమృగం 
  • కాళీభంగన్ ఒంటె 
  •  గుజరాత్ : ఏనుగు


🔯 ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటగా వెండి లోహాన్ని ఉపయోగించినది - సింధు ప్రజలు  భారతదేశంలో సింధు నాగరిక ప్రాంతాలు ఎక్కువగా గల రాష్ట్రం గుజరాత్

Post a Comment

0 Comments

Close Menu