సింధు నదీ వ్యవస్థ(sindhu river)

 సింధు నదీ వ్యవస్థ



⭐సింధు నది టిబెట్ లోని కైలాస కొండల్లోని మానస సరోవరం దగ్గర 5180 మీటర్ల ఎత్తులో ఉన్న గర్తాన్గ్  చూ / బొఖార్ చూ (వద్ద జన్మిస్తుంది) నుండి ప్రారంభమవుతుంది.

⭐ టిబెట్ లో దీన్ని లంగ్ చన్ కంబాబ్ లేదా సింగి కంభమ్ (సింహం నోరు) అని పిలుస్తారు.

⭐సింధు నది టిబెట్, జమ్మూకాశ్మీర్ లోని ఢాంచోక్ వద్ద మన దేశంలోనికి ప్రవేశించి, తదుపరి పాకిస్తాన్లోని సింధూ తల్బల వద్ద మైదానంలోనికి ప్రవేశించి చివరకు పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది.

⭐సింధు నది భారత్లో లడఖ్, జస్కార్ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహించి పాకిస్తాన్లోని సింధూ తల్బల వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.

⭐ సింధు నది ప్రధానంగా 3 దేశాలు (చైనా, భారత్ మరియు పాకిస్తాన్) గుండా ప్రవహిస్తుంది.

⭐ సింధు నది మొత్తం పొడవు 2,880 కి.మీ. కాగా, భారత దేశంలో 1114 కి.మీ. ప్రవహిస్తుంది.

⭐ సింధు నది  పరీవాహక ప్రాంతం 3,21,289 చ.కి.మీ.

⭐ అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతి పెద్దది, పొడవైనది సింధు నది. 

⭐ సింధు నది భారతదేశంలో కేవలం జమ్మూకాశ్మీర్ రాష్ట్రం గుండా మాత్రమే ప్రవహిస్తున్నది.

⭐ సింధు నది యొక్క కుడి ఉపనదులు (పర్వతీయ ఉప నదులు). ష్యోక్, గిల్గిట్, షిగార్, జష్కర్, ద్రాస్, గర్తాంగ్, హుంజ్, తోచి, కాబూల్ మొదలైనవి.

⭐ సింధు నది యొక్క ఎడమ ఉపనదులు (మైదాన ఉప నదులు).

⭐ జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ తదితరాలు.

జీలం నది 

⭐ జీలం నది ప్రాచీన నామం - వితస్త.

⭐ జీలం నది జమ్మూ కశ్మీర్లోని పిర్ పంజాల్లో ఉన్న వెరినాగ్ వద్ద జన్మిస్తుంది.

⭐ జీలం నది పొడవు -724 కి.మీ.

⭐ జీలం నది వల్ల శ్రీనగర్ వద్ద ఊలార్ సరస్సు ఏర్పడింది. జమ్మూకశ్మీర్లో కొంత దూరం భారత్, పాక్ సరిహద్దుగా ఉంటుంది. ట్రిమ్ము వద్ద చీనాబ్లో కలుస్తుంది.

చీనాబ్  నది

చీనాబ్ నది ప్రాచీన నామం - అస్కిని.

⭐చీనాబ్ నది హిమాచల్ ప్రదేశ్లోని బారాలాప్చాలా కనుమ వద్ద జన్మిస్తుంది. 

⭐చీనాబ్ నది చంద్ర, భాగ అనే రెండు చిన్న నదుల కలయికతో ఏర్పడుతుంది.

⭐ చీనాబ్ నది పొడవు - 1180 కి.మీ. 

⭐ చీనాబ్ నది ఆక్నూర్ వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశించి పంచ్నాడ్ వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది.

⭐ చీనాబ్ నది సింధు నది ఉపనదుల్లో అత్యధిక నీటికి తీసుకువస్తుంది.

రావి నది 

⭐ రావి నది ప్రాచీన నామం - పరూప్ని, దీన్ని ఐరావతి నది, లాహోర్ నది అని కూడా పిలుస్తారు.

⭐రావి నది హిమాచల్ ప్రదేశ్ లోని కులు కొండల్లోని రోహింగ్ కనుమ వద్ద జన్మిస్తుంది.

⭐ రావి నది రంగాపూర్ వద్ద చీనాబ్ నదిలో కలుస్తుంది. 

⭐ రావి నది పొడవు - 722 కి.మీ.

బియాస్ నది

⭐ బియాస్ నది ప్రాచీన నామం - విపాస 

⭐బియాస్ నది హిమాచల్ ప్రదేశ్ లోని కులు లోయలోని రోహితంగ్ కనుమ వద్ద గల బియాస్ కుండ్ వద్ద జన్మిస్తుంది.

⭐బియాస్ నది దౌలాధార్ శ్రేణిని చీలుస్తూ కాంగ్రా లోయ గుండా ప్రవహించి, పంజాబ్లోని హరికే వద్ద సట్లెజ్ నదిలో కలుస్తుంది. 

⭐ బియాస్ నది పూర్తిగా భారత దేశ భూభాగంలో మాత్రమే ప్రవహిస్తుంది.

⭐ బియాస్ నది పొడవు - 160 కి. మీ.

సట్లెజ్ నది

⭐ సట్లెజ్ నది ప్రాచీన నామం - శతుద్రి 

⭐ సట్లెజ్ నది 4,630 మీ. ఎత్తులో సింధూ నది జన్మ స్థానానికి సమీపాన, మానస సరోవరానికి దగ్గర్లోని రాకాసి సరస్సు వద్ద జన్మిస్తుంది.

⭐సట్లెజ్ నది షిష్కీల కనుమ గుండా హిమాచల్ ప్రదేశ్ వద్ద భారత భూభాగంలోకి ప్రవేశించి, పాకిస్థాన్ లోని మిథాన్ కోట్ వద్ద అన్ని ఉపనదులను కలుపుకొని సింధూ నదిలో కలుస్తుంది.

⭐సింధూ ఉపనదుల్లో పొడవైనది- సట్లెజ్ నది. దీని పొడవు - 1450 కి.మీ. 

⭐భారతదేశంలో సట్లెజ్ నది పొడవు 1050 కి.మీ.

⭐ సట్లెజ్ నది మైదానంలోకి ప్రవేశించే ప్రాంతం - రూపా నగర్.

⭐ సట్లెజ్ నది ప్రధానంగా 3 దేశాలు (చైనా, భారత్ మరియు పాకిస్తాన్) గుండా ప్రవహిస్తుంది.

⭐1960 సెప్టెంబర్ 19న జరిగిన Indus water Treaty ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదుల్లోని నీటిని భారతదేశం వాడుకుంటుంది.

⭐భారత్లో జీలం నది ఒడ్డున శ్రీనగర్, సట్లెజ్ నది ఒడ్డున లూథియానా, ఫిరోజ్ పూర్ నగరాలు ఉన్నాయి.

మరిన్ని అంశాలు 

⭐  8 వ ఖండం ఎలా జిలాండై  ఉద్భవించింది ?

⭐ భారతదేశ నదీ వ్యవస్థ (River System in India)

సింధు నదీ వ్యవస్థ(sindhu river)

Post a Comment

0 Comments

Close Menu