తుంగభద్ర(Tungabhadra) , మహా నది (mahanadi)

 తుంగభద్ర నది



🌟తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రంలోని వరాహ పర్వతాల్లోని గంగమాల ప్రాంతంలో జన్మిస్తోంది.

🌟తుంగభద్ర నది తుంగ భద్ర అనే రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుంది.

🌟కర్ణాటక రాష్ట్రంలో షిమోగా జిల్లాలోని శివమొగ్గ సమీపంలో కూడ్లీ అనే ప్రదేశంలో తుంగ - భద్ర అనే రెండునదులు కలుసుకోవడం మూలంగా తుంగభద్ర నది ఏర్పడుతుంది.

🌟తుంగభద్ర నది కృష్ణా నదికి అతి పెద్ద ఉపనది.

🌟  నది మొత్తం పొడవు - 531 కి.మీ.

🌟 తుంగభద్ర నది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. 

🌟  నది మొత్తం పరివాహక ప్రాంతం - 74,417 చ.కి.మీ.

🌟 తుంగభద్ర నది తెలంగాణలో జోగులాంబ గద్వాల్ (మహబూబ్నగర్) జిల్లా లోని అలంపూర్ వద్ద ప్రవేశిస్తోంది.

🌟 ఈ  నది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లోని సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 

🌟 ఈ  నది ఒడ్డున మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆలయం ఉంది.

తుంగభద్ర నది నది యొక్క ఉప నదులు...

🌟 వేదవతి, కుమదవతి, హంద్రి, హగరి, వరదానది.

మరిన్ని అంశాలు 

⭐ సింధు నదీ వ్యవస్థ(sindhu river)

మహా నది 



🌟 మహానది ఛతీస్ఘడ్  రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతంలో గల రాయపూర్ జిల్లాలోని షిహావ అనే  ప్రాంతం వద్ద జన్మిస్తుంది .

🌟 మహానది ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా సుమారు 857 కి.మీ.ల దూరం ప్రయాణించి, చివరగా ఒడిశాలోని కటక్ కు దిగువన నారాజ్ అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తోంది.

🌟 మహానది పరివాహక ప్రాంతం 1,42,000 కి.మీ.

🌟 మహానది పరివాహక ప్రాంతం ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలో విస్తరించి ఉంది. 

🌟 మహానది ఎగువ ప్రాంతంలో టీ కప్పు ఆకారంతో కూడిన ఛత్తీస్గఢ్ మైదానం ఉంది. 

🌟 మహానది కటక్ జిల్లాలో విశాలమైన డెల్టాను ఏర్పరుస్తోంది. ఈ డెల్టాను అనుకొని చిల్కా అనే ఉప్పునీటి సరస్సు ఉంది.

🌟ఈ నదికి బౌద్రోజ్, మందలి మధ్య ర్యాపిడ్ లు ఉన్నాయి.

🌟మహా నదిపై అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్టను నిర్మించాడు.

🌟 మహానది, గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని కళింగ అని అంటారు.

మహానది యొక్క ఉప నదులు

🌟 మండ్, షియోనాథ్, లేవ్, ఇబ్,

🌟 హసీడియో, ఓంగ్, జోంక్, టెల్ మొదలైనవి ప్రధాన ఉపనదులు,

మరిన్ని అంశాలు 

⭐ సింధు నదీ వ్యవస్థ(sindhu river)

Post a Comment

0 Comments

Close Menu