Wonder of Creation (జునాఖాన్) పిచ్చిసుల్తాన్

 మహమ్మాద్ బిన్ తుగ్లక్ (క్రీ.శ.1325-51)



 🔯ఇతని అసలు పేరు జునాఖాన్

ఇతని బిరుదులు-

1), ప్రిన్స్ ఆఫ్ మానీయర్స్ - ఇలా వర్ణించినది. థామస్.

2) సృష్టివైపరీత్యం (Wonder of Creation) అని 'బరౌనీ  ' ఇతన్నిశ్లాఘించారు. 

 ⭐ ఇతను బహుభాషాకోవిదుడు.

ఇతను గణిత, తర్క, ఖగోళ, వైద్య, భౌతిక, తత్వశాస్త్రాలను అధ్యయనం చేసాడు.

⭐ ఇతన్ని కొందరు చరిత్రకారులు పిచ్చిసుల్తాన్ గా పేర్కొన్నారు.

ఖలీఫాకు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించి అటుతర్వాత ఖలీఫాకు నజరానాలు చెల్లించారు. 

ఇతను హిందువుల పండగైన హెూలిలో పాల్గొన్న మొదటి సుల్తాన్ మొయినుద్దీన్ చిస్తీ   దర్గాను (అజ్మీర్)సందర్శించిన మొదటి సుల్తాన్,

టోకెన్ కరెన్సీని ప్రవేశ పెట్టిన ఢిల్లీ సుల్తాన్. 

సతీసహగమన వ్యవస్థను నిర్మూలించిన మొదటి సుల్తాన్.

ఇతను జహాపనా అనే పట్టణాన్ని నిర్మించాడు. ( ఢిల్లీలో)

⭐ఇబన్ బటూటా (మొరాకో ప్రయాణికుడు) మహమ్మద్ బీన్ తుగ్లక్ ఆస్థానాన్ని క్రీ.శ. 1342లో సందర్శించిదెహలా(డైరీ)నివ్రాశాడు,

ఇతను ఇబన్ బటూటాను తన రాయబారిగా చైనాకు పంపాడు.

సంస్కరణలు:

1. భూమిశిస్తు వ్యవసాయం(1326-27).

సుల్తానైన వెంటనే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని రాష్ట్రాల్లో ఆదాయపట్టికలుతయారుచేసి కేంద్రానికి పంపాలని ఆదేశాలిచ్చాడు.

గంగా-యమునా అంతర్వేదిలోని భూములమీద శిస్తును పెంచాడు (40%)

అదే సమయంలోనే అంతర్వేదిలోని(గంగా సింధు మైదానం) అనావృష్టి, భయంకరమైన క్షామము సంభవించింది. 

సుల్తాన్ క్షామ పరిస్థితిని గమనించి హిందూ ముస్లిం భేదాలను పాటించకుండా నివారణ కార్యక్రమాలను అమలుచేశాడు. బావులు త్రవ్వించాడు. రైతులకు అప్పులిచ్చాడు. ఈ కార్యక్రమాలు ప్రజల్లో సుల్తాన్ పట్ల సానుభూతిగాని, సదభిప్రాయాన్ని గాని పునరుద్ధరించలేకపోయాయి. 

మహ్మద్ కొత్తగా (13-10-43) "వ్యవసాయశాఖ"(దివాన్-ఇ-కోహ్లి) నెలకొల్పి  దానిద్వారా బంజరు  భూములను సాగుచేయు ఉద్దేశ్యముతో రైతులకు రుణాలిప్పించాడు. కాని వాస్తవానికి కొత్తభూములు సాగులోకి తీసుకురాలేదు. ప్రభుత్వోద్యోగుల మోసంవల్ల ఈ ప్రణాళిక విఫలమైంది.

2. రాజధాని మార్పిడి:

మహ్మద్ బీన్ తుగ్లక్  చేసిన సంస్కరణలన్నింటిలో తీవ్రమైన విమర్శలకు గురైంది. 1326-27లో నుంచి రాజధానిని దౌలతాబాదుకు (దేవగిరి) మార్చడం.

 రాజధాని మార్పిడి వల్ల మంగోలులు తరుచుగా భారతదేశంపై దాడి చేసి దోచుకున్నారు..

దౌలతాబాద్ వాతావరణం కూడా సుల్తాన్ కు సరిపడలేదు. అందువల్ల తిరిగి (1335-37) రాజధానిని ఢిల్లీకి మార్చాడు .

3. రాగి నాణేల ముద్రణ (1929-30):

సింహసనం ఎక్కిన నాటి నుంచి తుగ్లక్ దేశంలో చెలామణి ఉన్ననాణెల్లో అనేకమైన మార్పులు చేశాడు.

మహ్మద్  బీన్ తుగ్లక్ "నాణెలముద్రణ యువరాజు" గా పేరుపొందాడు.

⭐"దీనార్" అనే బంగారునాణేన్ని, "ఆదిలి" అనే వెండినాణేన్ని ముద్రించి చలామణిలో ఉంచాడు. ఈ మార్పులన్నింటిలోకి ముఖ్యమైంది "వెండి" నాణేలకు బదులు 'రాగి, ఇత్తడి' నాణేలు ముద్రించి చలామణిలోకి తేవడం .

⭐ రాగి, ఇత్తడి నాణేలు ప్రవేశపెట్టడానికి కారణాలు:

1. నాటికే చైనా చక్రవర్తి 'కుబ్లాయిఖాన్ (1260-94)కాగితాన్ని డబ్బుగా చెలామణి చేశాడు. 

2.నాణేలను(రాగి,ఇత్తడి) ప్రభుత్వం తప్ప ఇతరులెవ్వరూ ముద్రించకూడదని ఆదేశించకపోవడం వల్ల ఈ నాణేలు కుప్పలు కుప్పలుగా ప్రజలు ముద్రించారు. 

ప్రతి ఇల్లు రాగినాణేలను ముద్రించే టంకశాలగా మారింది. దీనితో డబ్బువిలువ పడిపోయి వస్తువులుధరలు బాగా పెరిగాయి.

సతీష్ చంద్ర అనే చరిత్రకారుడు ఈ నాణెలను "As worthless as stones"  గా మారాయన్నాడు.

ఢిల్లీలో ప్లేగ్ వ్యాధి ప్రబలినపుడు స్వర్గవారి వద్ద రెండున్నర సం|| విశ్రాంతి తీసుకున్నాడు.

తిరుగుబాట్లు:

సుల్తానిన  మరుసటి సంవత్సరం మే (1327) సాగర్ రాష్ట్రపాలకుడు (బావమరిది) జహుద్దీన్ గుర్హాన్స్' తిరుగుబాటు చేయగా స్వయంగా మహ్మద్ దండెత్తాడు..

1) 1327-28లో సింధు ముల్తానులను పాలిస్తున్న మహ్మద్ ఐబా(క్రిష్ణుఖాన్) తిరుగుబాటు చేశారు. సుల్తాన్ అతన్ని వధించి శాంతి నెలకొల్పాడు..

2)1336లో ముసునూరి కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించి స్వాతంత్రం ప్రకటించారు.

3) 1336లో హరిహర రాయలు, బుక్కరాయలు అనెగొందిలో స్వతంత్ర హిందూరాజ్యం స్థాపించాడు.

4)1338లో ఫక్రుద్దీన్  ముబారక్ బెంగాల్లో తిరుగుబాటు చేసి స్వతంత్రుడైనాడు. 

5) తుగ్లక్ ఆశక్తిని గమనించిన కొందరు ముస్లిం సర్దారులు దక్షిణాదేశంలో నాయకత్వంలో బహ్రుమనిరాజ్యం స్థాపించారు. 

6) 1347లో బహమనీ రాజ్యం స్థాపించబడింది.

నోట్ : తుగ్లక్ 1351లో తట్టా వద్ద (గుజరాత్) లో మరణించాడు.

తుగ్లక్ పై వ్యాఖ్యానాలు

1. "తుగ్లక్ అరిస్టాటిల్ తో  పోలికను కలిగి ఉన్నాడు" -బరౌనీ 

2. తుగ్లక్ మరణం వల్ల అతని బాధ ప్రజలకు,ప్రజల బాధ అతనికి తప్పింది"-లేన్ పూల్ 

3.సదుద్దేశాలు, చక్కని ఆలోచనలు, ఉదారభావాలు ఉండికూడా ఓరిమి, దూరదృష్టి సాధ్యాసాధ్య విచక్షణ లేనిపోవడంతో ఇతను సాటిలేని పరాజయం పొందాడు" లేన్ పూల్,

4. తుగ్లక్ మధ్యయుగంలో పాలించిన రాజులలో కెల్లా నిస్సందేహంగా సమర్థుడు- ఈశ్వరి  ప్రసాద్, 

5."తుగ్లక్  ఒక సృష్టివైపరీత్వం -బరౌనీ 

6.తుగ్లక్ విరుద్ధగుణాల మిశ్రమం" -బరౌనీ  , ఇసామీ.


satavahana 1 (శాతవాహనుల రాజకీయ పరిణామ క్రమం)

Chola dynasty (చోళులు )

సంగము రాజ్యాలు/ప్రాచీన తమిళ రాజ్యాలు

satavahana (శాతవాహనుల చరిత్ర ఆధారాలు)


Post a Comment

0 Comments

Close Menu