బింబిసార (BIMBISARA) సాంగ్

బింబిసార సాంగ్ - చెయ్యందించమంది ... ఒక పాశం





గాయకులు : Mohana Bhogaraju, Sandilya Pisapati

సంగీతం     : MM Keeravaani

సాహిత్యం  : MM Keeravaani

స్టార్ కాస్ట్    : Nandamuri Kalyan Ram, CatherIne Tresa, Samyuktha Menon

గుండె దాటి ... గొంతు దాటి 

పలికిందేదో వైనం 

మౌడువారిన మనసులోనే 

పలికిందేదో ప్రాణం 


ఆ ,కన్నుల్లోనే గంగై 

పొంగిన ఆనందం 

కాలంతో పరిహాసం 

చేసిన స్నేహం 


 పొద్దులు దాటి... హద్దులు దాటి

జగములు దాటి ... యుగములు దాటి 

(దాటి  దాటి ... దాటి  దాటి )


చెయ్యందించమంది ... ఒక పాశం

రుణ పాశం... విధి విలాసం

చెయ్యందించమంది ... ఒక పాశం చెయ్యందించమంది 

రుణ పాశం... విధి విలాసం


అడగలే కానీ ఏదైనా

ఇచ్ఛే అన్నయ్యనౌతా

పిలవాలే కానీ పలికేటి తోడు 

నీడయ్యిపోతా


నీతో ఉంటే చాలు

 సరితూగవు సామ్రాజ్యాలు 

రాత్రి పగలు లేదే దిగులు

తడిసె కనులు ఇదివరకెరుగని

ప్రేమలో గారంలో


చెయ్యందించమంది...  ఒక పాశం

ఋణ పాశం... విధి విలాసం

ప్రాణాలు ఇస్తానంది 

ఒక బంధం రుణ బంధం


నోరారా వెలిగే నవ్వుల్ని

నేను కళ్ళారా చూసా

రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో

నన్ను నేను కలిసా


నీతో ఉంటే చాలు

ప్రతి నిమషం ఓ హరివిల్లు, ఆ ఆ

రాత్రి పగలు లేదే గుబులు

మురిసె ఎదలు ఇదివరకెరుగని

ప్రేమలో గారంలో


ప్రాణాలు ఇస్తానంది  ఒక పాశం

రుణపాశం... విధివిలాసం

చెయ్యందించమంది

ఒక బంధం ఋణబంధం


ఆటాల్లోనే పాటల్లోనే

వెలిసింధేదో స్వర్గం

రాజే నేడు బంటై  పోయినా

రాజ్యం నీకే సొంతం

Post a Comment

0 Comments

Close Menu