⭐కింబర్లీ విల్సన్ ఒక సైకాలజిస్ట్. పోషకాహారంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.అయన చేసిన ఒక పరిశోధన గురించి
తెలుసుకొందాం
⭐ మన జ్ఞాపకశక్తి మీద ఆశ్చర్యకరమైన సానుకూల ప్రభావం
చూపే ఆహారాలు, పానీయాల గురించి చెప్తున్నారు. కొన్ని రకాల ఆహారాలు మన
జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి : కింబర్లీ విల్సన్
⭐ మనకు మూడు రకాల జ్ఞాపక శక్తులు ఉంటాయి: తక్షణమైనది, పనిచేసేది,
దీర్ఘకాలమైనది.
⭐ఇది కేవలం స్వల్పకాలం (షార్ట్ టైమ్) మాత్రమే సమాచారాన్ని
అట్టిపెట్టుకుంటుంది. ఉదాహరణకు.. ఎవరైనా మీకు ఒక ఫోన్ నంబర్ చెప్పినపుడు దానిని
రాసుకోకుండా వెంటనే డయల్ చేస్తారు. ఆ కాల్ తర్వాత ఆ నంబర్ సరిగ్గా గుర్తుండదు.
⭐
మన పనిచేసే జ్ఞాపకశక్తిని పనిలో ఉన్నపుడు ఆలోచించటానికి ఉపయోగిస్తాం.
⭐మాట్లడటం
వంటి పనులు చేసేటపుడు.. ఎదుటి వ్యక్తి అప్పుడే చెప్పిన మాటలను
గుర్తుపెట్టుకోవటానికి, దాని అర్థాన్ని అవగతం చేసుకోవటానికి, దీనికి ముందు జరిగిన
సంభాషణకు అనుసంధానం చేసుకోవటానికి, ఆ తర్వాత మన సొంత ఆలోచనలను చెప్పటానికి ఇది
సాయపడుతుంది.
⭐ ఇక దీర్ఘకాలిక జ్ఞాపకశక్తితో మనం రోజులు, నెలలు, సంవత్సరాల కిందటి సమాచారాన్ని
గుర్తుపెట్టుకుంటాం.
మన షార్ట్ టర్మ్ మెమొరీలోని జ్ఞాపకాలు.. ‘ఘనీభవనం’ అనే
ప్రక్రియలో మన లాంగ్ టర్మ్ మెమొరీకి మారుతాయి.
పర్పుల్ గ్రేప్ |
⭐ ఈ రెండిటిలో వాటికి ముదురు రంగును కలిగించే ఆంథోసియానైన్లు అనే
పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పాలీఫెనాల్ మిశ్రమాలు ఇతర బెర్రీల్లో కూడా
కనిపిస్తాయి.
⭐ ఇవి మన శరీరంలో జీర్ణమైనపుడు అవి రక్తనాళాల సరళతను, మన
మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల మెదడుకు మరిన్ని శక్తి పోషకాలు,
ఆక్సిజన్ అందుతుంది. ఫలితంగా మన జ్ఞాపకశక్తి పనితీరు మెరుగుపడుతుంది.
గ్రీన్ టీ |
⭐ గ్రీన్ టీని ఎక్కువ కాలం పాటు తీసుకోవటం ద్వారా కూడా షార్ట్-టర్మ్ మెమొరీ,
వర్కింగ్ మెమొరీ మెరుగుపడుతుందని.. జ్ఞాపకశక్తి బలహీనపడటం తగ్గుతుందని కొన్ని
అధ్యయనాలు సూచిస్తున్నాయి.
⭐ఇక చాకొలెట్ ప్రియులకు కూడా జ్ఞాపకశక్తి
బలంగానే ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే కొకోవా మెదడులో రక్తప్రసరణను
మెరుగుపరుస్తుంది. అయితే సత్ఫలితాలు రావాలంటే.. మీరు తినే చాకొలెట్.. 70 శాతం
పైగా కొకోవా ఉన్న డార్క్ చాక్లెట్ అయి ఉండాలి.
⭐
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు తీసుకునే ఆహారం ఎంత ఆరోగ్యవంతమైనదైతే.. మెదడులో జ్ఞాపక కేంద్రం అంత
పెద్దగా ఉంటుంది. మీ జ్ఞాపకశక్తి పనితీరు కూడా అంత మెరుగుగా ఉంటుంది. అంటే
పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, పప్పుదినుసులు, నూనె ఎక్కువగా ఉండే చేపలు
వంటి ఆహారం మెదడుకు పదును పెడతాయన్నమాట.
⭐ఎక్కువ కాలం నిల్వ ఉంచటం కోసం శుద్ధిచేసిన ఆహారాలు (ప్రాసెస్డ్ ఫుడ్) మన
జ్ఞాపకశక్తి మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని దశాబ్దాల పాటు జంతువుల మీద చేసిన
అధ్యయనాలు, మనుషుల మీద పెరుగుతున్న ప్రయోగాలు సూచిస్తున్నాయి.
⭐ఈ అంశంపై ఒక
అధ్యయనంలో.. మామూలుగా పోషకాలతో కూడిన ఆహారం తీసుకునే 110 మంది ఆరోగ్యవంతులైన
వ్యక్తులను.. ఒకే ఒక్క వారం రోజుల పాటు శుద్ధిచేసిన ఆహారం తినాలని చెప్పారు.
⭐ఆ
వారంలో నాలుగు రోజుల పాటు ఉదయం అల్పాహారం కింద బెల్జియన్ వాఫిల్స్ తినాలని, వారం
మొత్తం మీద ఎప్పుడైనా రెండుసార్లు భోజనం కింద ‘జంక్’ ఫుడ్ తినాలని సూచించారు.
అలా
తిన్న కొన్ని రోజుల్లోనే.. వారికి నేర్చుకునే జ్ఞాపకశక్తిలో సమస్యలు తలెత్తాయి.
ఆకలి మీద కూడా నియంత్రణ పోయింది.
⭐శుద్ధిచేసిన ఆహారాలు, చక్కెరలు
ఎక్కువగాను.. పండ్లు, కూరగాయలు, ఫైబర్ తక్కువగాను ఉండే రోజువారీ ఆహారపు అలవాట్ల
వల్ల.. అల్జీమర్స్ వంటి నాడీక్షీణత జబ్బుల ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా
తెలుస్తోంది.
0 Comments